Vaarasudu: దళపతి విజయ్‌తో రష్మికా (Rashmika Mandanna) సెల్ఫీ.!.. లుక్ అదుర్స్ అంటున్న ఫ్యాన్స్

Updated on Sep 14, 2022 06:32 PM IST
 'వార‌సుడు'  సినిమా షూటింగ్‌లో ర‌ష్మిక (Rashmika Mandanna) మంద‌న్న విజ‌య్‌తో సెల్పీ దిగారు. ప్ర‌స్తుతం ఆ ఫోటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. 
 'వార‌సుడు' సినిమా షూటింగ్‌లో ర‌ష్మిక (Rashmika Mandanna) మంద‌న్న విజ‌య్‌తో సెల్పీ దిగారు. ప్ర‌స్తుతం ఆ ఫోటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. 

Vaarasudu: కోలీవుడ్ స్టార్ హీరో ఇళయ దళపతి విజయ్ జోసెఫ్ మొద‌టిసారిగా  తెలుగులో 'వార‌సుడు' సినిమాలో న‌టిస్తున్నారు. 'వార‌సుడు' సినిమాను తెలుగుతో పాటు త‌మిళ్‌లోనూ చిత్రీక‌రిస్తున్నారు. వంశీ పైడిప‌ల్లి స‌రికొత్త క‌థ‌తో ఈ మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. 'వార‌సుడు' చిత్రంలో విజ‌య్‌కు జోడిగా ర‌ష్మిక మంద‌న న‌టించ‌నున్నారు. ఈ సినిమా షూటింగ్‌లో ర‌ష్మిక మంద‌న్న (Rashmika Mandanna) విజ‌య్‌తో సెల్పీ దిగారు. ప్ర‌స్తుతం ఆ ఫోటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. 

సెల్పీ వైర‌ల్

ర‌ష్మిక‌ మంద‌న్న‌(Rashmika Mandanna), దళపతి విజ‌య్.. వీరిద్దరూ ప్రస్తుతం 'వారసుడు' షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.  ఈ రోజే ర‌ష్మిక మంద‌న్న విజయ్‌తో క‌ల‌సి దిగిన సెల్పీని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ ఫోటోను చూసిన విజయ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. 'వార‌సుడు'లో విజ‌య్ లుక్ అదిరిపోయిందంటూ కామెంట్లు పెడుతున్నారు.

పింక్ క‌ల‌ర్ ష‌ర్ట్‌లో విజ‌య్ కొత్త హెయిర్ స్టైల్‌లో క‌నిపించారు. అలాగే ర‌ష్మిక కూడా పింక్ అండ్ వైట్ డ్రెస్‌లో మెరిసిపోయారు. 'వార‌సుడు' చిత్రంలో ప్రభు, శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, జయసుధ, శ్రీకాంత్, శామ్, యోగి బాబు, సంగీతలు కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. 

హైదరాబాద్‌లో షూటింగ్

'వార‌సుడు' (Vaarasudu) చిత్రం మొద‌టి షూటింగ్ షెడ్యూల్ చెన్నైలో జ‌రిగింది. ప్రస్తుతం రెండో షెడ్యూల్ హైద‌రాబాద్‌లో జ‌రుగుతోంది. ఈ సినిమాకు సంబంధించి ప‌లు కీల‌క స‌న్నివేశాల‌ను హైద‌రాబాద్‌లో చిత్రీక‌రిస్తున్నారు. ఈ చిత్రానికి వంశీ పైడిపల్లితో పాటు హరి, అహిషోర్‌ సాల్మన్‌ కథ, స్క్రీన్ ప్లేను అందించారు. త‌మ‌న్ అందించే సంగీతం ఈ చిత్రానికి ప్ల‌స్ కానుంది.

'వార‌సుడు' సినిమాకు దిల్ రాజు, ప‌ర‌మ్ వి పొట్లూరి నిర్మాత‌లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌, పీవీపీ బ్యానర్ల‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విజ‌య్ న‌టిస్తున్న 'వార‌సుడు' సినిమాను 2023లో సంక్రాంతికి విడుద‌ల చేయ‌నున్నారు.

Read More: Thalapathy Vijay (దళపతి విజయ్) : టాలీవుడ్‌‌కి 'వారసుడు'గా తమిళ హీరో.. ఫస్ట్ లుక్ క్లాస్, సెకండ్ లుక్ మాస్ !

Advertisement
Credits: Twitter

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!