హైదరాబాద్‌లో ‘వారసుడు’ సినిమా షూటింగ్.. జానీ కొరియోగ్రఫీలో ఆడిపాడుతున్న దళపతి విజయ్ (Thalapathy Vijay) –రష్మిక

Updated on Sep 10, 2022 06:46 PM IST
దళపతి విజయ్ (Thalapathy Vijay) తెలుగులో నేరుగా నటిస్తున్న మొదటి సినిమా ‘వారసుడు’. ఈ సినిమాకు తమిళంలో ‘వరిసు’ అనే టైటిల్‌ పెట్టారు
దళపతి విజయ్ (Thalapathy Vijay) తెలుగులో నేరుగా నటిస్తున్న మొదటి సినిమా ‘వారసుడు’. ఈ సినిమాకు తమిళంలో ‘వరిసు’ అనే టైటిల్‌ పెట్టారు

తుపాకి, మాస్టర్, బీస్ట్ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ (Thalapathy Vijay). తెలుగులో నేరుగా మొదటిసారి నటిస్తున్నారు విజయ్. తెలుగుతోపాటు తమిళంలో కూడా తెరకెక్కుతున్న ఈ సినిమాను వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు తెలుగులో ‘వరిసు’ అని, తెలుగులో ‘వారసుడు’ అనే టైటిల్స్‌ ఖరారు చేశారు.

దిల్‌ రాజు నిర్మిస్తున్న వారసుడు సినిమాలో రష్మికా మందాన హీరోయిన్‌గా నటిస్తున్నారు. హైదరాబాద్‌లో శరవేగంగా ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. వారసుడు సినిమా షూటింగ్‌లో భాగంగా హీరోహీరోయిన్లు విజయ్ – రష్మికలపై ఒక పాటను చిత్రీకరిస్తున్నారని సమాచారం.

దళపతి విజయ్ (Thalapathy Vijay) తెలుగులో నేరుగా నటిస్తున్న మొదటి సినిమా ‘వారసుడు’. ఈ సినిమాకు తమిళంలో ‘వరిసు’ అనే టైటిల్‌ పెట్టారు

ఫ్యామిలీ ప్రేక్షకులకు నచ్చేలా..

ఈ పాటకు కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌‌ స్టెప్స్ వేయిస్తున్నారని టాక్. ఫ్యామిలీ ప్రేక్షకులకు నచ్చే కథతో వారసుడు సినిమాను వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. యాక్షన్‌ సన్నివేశాలకు కూడా ప్రాధాన్యం ఉన్నట్టు సమాచారం.  

అక్టోబర్‌ చివరి నాటికి వారసుడు సినిమా షూటింగ్ పూర్తి చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. దళపతి విజయ్ (Thalapathy Vijay) హీరోగా నటిస్తున్న ‘వారసుడు’ సినిమాలో ప్రకాష్‌ రాజ్‌, జయసుధ, ప్రభు, శ్రీకాంత్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Read More : Thalapathy Vijay: దళపతి విజయ్ సినిమాకి.. మహేష్ బాబు వాయిస్ ఓవర్ ?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!