విజయ్ (Vijay) ‘వారసుడు’ (Vaarasudu) రిలీజ్ డేట్ ఫిక్స్!. ‘ఆదిపురుష్’ (Adipurush)తో పోటీ తప్పదా?

Updated on Oct 13, 2022 12:15 PM IST
విజయ్ (Vijay), రష్మిక మందన్న (Rashmika Mandanna) తొలిసారిగా ‘వారసుడు’ (Vaarasudu) మూవీలో జోడీగా నటిస్తున్నారు
విజయ్ (Vijay), రష్మిక మందన్న (Rashmika Mandanna) తొలిసారిగా ‘వారసుడు’ (Vaarasudu) మూవీలో జోడీగా నటిస్తున్నారు

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌ (Vijay) హీరోగా టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి (Vamshi Paidipally) దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘వరిసు’ (Varisu). తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. దీనికి తెలుగులో ‘వారసుడు’ (Vaarasudu) అనే టైటిల్‌ను ఖరారు చేశారు మేకర్స్. 

టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ‘వారసుడు’ షరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాలో రష్మిక మందన్న (Rashmika Mandanna) కథానాయికగా నటిస్తోంది. తాజాగా ఈ మూవీ విడుదల తేదీని మేకర్స్ ఫిక్స్ చేసినట్లు సమాచారం. 2023, జనవరి 12 ‘వారసుడు’ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాణ సంస్థ ప్రకటించింది. అయితే ఏ తేదీన వచ్చేది మాత్రం స్పష్టం చేయలేదు. 

ఒకవేళ ‘వారసుడు’ మూవీని జనవరి 12న విడుదల చేస్తే తమిళంలో పెద్దగా పోటీ ఉండకపోవచ్చు. కానీ తెలుగులో మాత్రం ఈ సినిమా.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’తో పోటీపడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ సినిమా ఇప్పటికే జనవరి 12వ తేదీని రిలీజ్ కోసం ఫిక్స్ చేసుకుంది.

ఇకపోతే, ‘వారసుడు’ మూవీ షూటింగ్ దాదాపుగా పూర్తయిందని సమాచారం. కుటుంబ ప్రేక్షకులు మెచ్చేలా.. కొత్తదనం నిండిన కథతో ఈ చిత్రం రూపొందుతోంది. యాక్షన్‌కు కూడా ప్రాధాన్యం ఉంటుందని సమాచారం. అక్టోబర్‌ చివరికి మొత్తం చిత్రీకరణను పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో ప్రకాష్‌ రాజ్‌, జయసుధ, ప్రభు, శ్రీకాంత్‌ లాంటి స్టార్ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తుండటం విశేషం. 

ఇక తెలుగులోనూ 'వారసుడు'పై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ మధ్య కాలంలో విజయ్‌కు ఇక్కడా మార్కెట్ పెరిగింది. ‘తుపాకీ’, ‘పోలీసోడు’, ‘స్నేహితుడు’, ‘సర్కార్’. ‘అదిరింది’, ‘విజిల్’, ‘మాస్టర్’ చిత్రాలు తెలుగునాట మంచి వసూళ్లు సాధించాయి. దీంతో ‘వారసుడు’ సినిమాను టాలీవుడ్‌లో భారీ ఎత్తున రిలీజ్ చేయాలని దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారు. ఒకవేళ ‘ఆదిపురుష్’, ‘వారసుడు’ ఒకేరోజు రిలీజైతే థియేటర్ల సమస్య వస్తుంది. దీన్ని దిల్ రాజు ఎలా పరిష్కరిస్తారో చూడాలి. 

Read more: Vaarasudu: దళపతి విజయ్‌తో రష్మికా (Rashmika Mandanna) సెల్ఫీ.!.. లుక్ అదుర్స్ అంటున్న ఫ్యాన్స్

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!