తెలుగు సినిమా ఆర్.ఆర్.ఆర్ (RRR)ను దాటి.. రేటింగ్‌లో దూసుకెళ్తున్న కన్నడ సినిమాలు !
టాలీవుడ్ స్టార్ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్.ఆర్.ఆర్ (RRR) చిత్రం రికార్డులు కొల్లగొట్టింది. ఐఎండీబీ టాప్ 250 ఇండియన్ ఫిల్మ్స్ జాబితాలో ఆర్.ఆర్.ఆర్. చోటు సంపాదించుకుంది. ఆర్.ఆర్.ఆర్. 169 వ స్థానంలో నిలిచింది. అయితే కన్నడ సినిమాలు మాత్రం ఆర్.ఆర్.ఆర్. కంటే ముందు వరుసలో ఉన్నాయి.
దేశభక్తి అంటే కొమురం భీముడిదే
ఆర్.ఆర్.ఆర్ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర ఒక ఎత్తైతే.. కొమురం భీముడో పాటతో ఎన్టీఆర్ ప్రతీ ఒక్కరిలో దేశభక్తి రగిల్చాడు. ఎన్టీఆర్ పాత్ర గురించి ప్రపంచ దేశాల్లో సినిమా అభిమానులు చర్చించుకుంటున్నారు. ఇక ఇజ్రాయెల్ దేశంలో ఓ వార్తాపత్రికలో ఎన్టీఆర్ నటనపై ప్రత్యేక కథనాన్నే ప్రచురించారు. దేశాన్ని కాపాడుకోవడానికి ఆర్.ఆర్.ఆర్.లో ఎన్టీఆర్ చేసిన పోరాటంపై వ్యాసాన్ని రాశారు.
దేశభక్తి అంటే కొమురం భీముడిలా ఉండాలంటూ ప్రచురించారు. ఇక ఎన్టీఆర్ క్లైమాక్స్ సీన్‌లో చేసిన ఫైట్ సీన్స్‌ను విదేశీయులు కూడా ఎంజాయ్ చేస్తున్నారట. ఎన్టీఆర్ (NTR) రామ్ చరణ్‌ను భుజాలపై మోసే సన్నివేశం అద్భుతమని అంటున్నారు. ఇక బ్రిటిష్ వారిపై అడవి జంతువులు ఎటాక్ చేసిన సన్నివేశాలకు ఒక ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఏర్పడిందని వినికిడి.
అయితే ఆర్ఆర్ఆర్ ఎన్ని రికార్డులు బీట్ చేసినా కూడా, ఇంటర్నెట్ మూవీ డాటాబేస్ (ఐఎండీబీ) రేటింగ్‌లో కన్నడ సినిమాలు సత్తా చాటాయి. రెండు కన్నడ చిత్రాలు ఈ జాబితాలో ఆర్ఆర్ఆర్ (RRR)ను అధిగమించాయి. దర్శకుడు ప్రశాంత్ నీల్, హీరో యశ్ కాంబోలో తెరకెక్కించిన కేజీఎఫ్ చాప్టర్ 2 ఈ జాబితాలో 101వ స్థానంలో నిలిచింది. ఇక కన్నడ హీరో రక్షిత్ శెట్టి నటించిన 777 చార్లి 116 స్థానంలో ఉంది. 777 చార్లి ఐఎండీబీ రేటింగ్‌లో 9000 ఓట్లతో 9.2/10 సంపాదించింది.
పాన్ ఇండియా సినిమాను క్రాస్ చేసిన 777 చార్లి
777 చార్లి సినిమాను ధర్మ అనే వ్యక్తి జీవితం ఆధారంగా నిర్మించారు. దర్శకుడు కే కిరణ్ రాజ్ ఓ డాగ్ కథతో ఈ సినిమాను తెరకెక్కించారు. చార్లీ అనే కుక్క ఓ వ్యక్తి లైఫ్‌లోకి వచ్చి.. అతని జీవితాన్ని మార్చేస్తుంది. 777 చార్లి సినిమా జూన్ 10న విడుదలై బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో ఈ సినిమా విడుదలైంది.
సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రానా దగ్గుబాటి సమర్ఫణలో 777 చార్లి విడుదలైంది. కిరాక్ పార్టీ సినిమాతో హిట్ సాధాంచిన రక్షిత్ శెట్టి 777 చార్లితో మరో సూపర్ హిట్ అందుకున్నాడు. పాన్ ఇండియా సినిమా ఆర్.ఆర్.ఆర్ (RRR) సినిమా కంటే రేటింగ్‌లో ఈ సినిమా ముందుకు దూసుకెళ్లింది.