Junior NTR: మళ్లీ ఫ్యామిలీతో కలసి విదేశాలకు వెళ్లిన జూనియర్ ఎన్టీఆర్?.. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కూడా అక్కడే..!

Updated on Dec 10, 2022 05:03 PM IST
న్యూ ఇయర్ వేడుకల్ని తారక్ (Junior NTR) విదేశాల్లోనే జరుపుకోనున్నారట. దాదాపు నెల రోజుల వరకు ఆయన ఈ వెకేషన్‌లో ఉండనున్నారని సమాచారం
న్యూ ఇయర్ వేడుకల్ని తారక్ (Junior NTR) విదేశాల్లోనే జరుపుకోనున్నారట. దాదాపు నెల రోజుల వరకు ఆయన ఈ వెకేషన్‌లో ఉండనున్నారని సమాచారం

జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR) సినిమా సినిమాకూ తన స్థాయిని పెంచుకుంటూ పోతున్నారు. నటుడిగా క్లిష్టమైన పాత్రలను ఎంచుకుంటూ వాటికి జీవం పోస్తున్నారు. అందుకే తెరపై ఎన్టీఆర్ నట విశ్వరూపం చూసేందుకు ఆయన అభిమానులతోపాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఈ ఏడాది ‘ఆర్ఆర్ఆర్’ (RRR Movie) సినిమాతో యాక్టింగ్‌లో తన రేంజ్ ఏంటో తారక్ మరోమారు నిరూపించారు. 

‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటించిన తీరుకు ఫిదా అవ్వాల్సిందే. భీమ్ పాత్రలో ఆయన ఎమోషన్స్ పలికించిన తీరు ఎవ్వరినైనా కట్టిపడేస్తుంది. అందుకే పాన్ వరల్డ్ రేంజ్‌లో ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని ఆయన సంపాదించుకున్నారు. ఇక, తర్వాతి సినిమాపై తారక్ ఫోకస్ పెడుతున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందనున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ లో ఆయన నటించబోతున్నారు. 

ఈ ఏడాది ‘ఆర్ఆర్ఆర్’ (RRR Movie) సినిమాతో యాక్టింగ్‌లో తన రేంజ్ ఏంటో తారక్ మరోమారు నిరూపించారు. 

కొరటాల–తారక్ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. త్వరలో ఈ సినిమా చిత్రీకరణ మొదలు కానుందని తెలుస్తోంది. దీంతో కుటుంబంతో కలసి ఎన్టీఆర్ విదేశాలు చుట్టేస్తున్నారు. రీసెంట్‌గా ఫ్యామిలీతో జపాన్ (RRR In Japan) వెళ్లిన ఆయన.. ఇప్పుడు షూటింగ్ స్టార్ట్ చేస్తారేమో అనుకుంటే.. మళ్లీ కుటుంబంతో కలసి ఫారిన్ ట్రిప్ ప్లాన్ చేశారు. తాజాగా భార్య లక్ష్మీ ప్రణతి, తనయులు అభయ్ రామ్, భార్గవ్ రామ్‌లతో ఎయిర్‌పోర్టులో దర్శనమిచ్చారు. న్యూ ఇయర్ వేడుకల్ని విదేశాల్లోనే తారక్ జరుపుకోనున్నారట. దాదాపు నెల రోజుల వరకు ఈ వెకేషన్‌లో ఉండనున్నారని సమాచారం. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

కాగా, సంక్రాంతి పండుగకు ముందు ఎన్టీఆర్ విదేశాల నుంచి రానున్నారట. జనవరి మూడో వారం తర్వాత కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో ఆయన యాక్ట్ చేయనున్న చిత్రం షూటింగ్‌లో పాల్గొనే ప్లాన్‌లో ఉన్నారట. ఈ సినిమాను నందమూరి కల్యాణ్​ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధా ఆర్ట్స్ పతాకాలపై కొరటాల శివ సన్నిహితుడు మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె నిర్మిస్తున్నారు.  

Read more: Most Trolled Telugu Movies : 2022లో అత్యధికంగా ట్రోల్ అయిన తెలుగు సినిమాలపై ప్రత్యేక కథనం..

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!