KGF Chapter 2: కేజీఎఫ్ చాప్టర్ 2 ఫైనల్ కలెక్షన్ ఎంతో తెలిస్తే షాక్ అవాల్సిందే!
KGF Chapter 2: కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమా భారత సినిమా చరిత్రలో నిలిచిపోయింది. హీరో యశ్ నటనను ప్రేక్షకులు మెచ్చుకున్నారు. దర్శకుడు ప్రశాంత్ నీల్ బాక్సాఫీస్‌ను షేక్ చేసేలా ఈ సినిమాను తెరకెక్కించారు. హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ కేజీఎప్ చాప్టర్ 2 సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించారు.
యశ్‌కు జోడిగా ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి నటించారు. బాలీవుడ్ బడా స్టార్ సంజయ్ దత్ విలన్ పాత్రలో నటించి మెప్పించారు. బాలీవుడ్ నటి రవీనాటాండన్ కీలక పాత్రలో నటించారు.
వేల కోట్లను రాబట్టిన యశ్ సినిమా
ప్రపంచ వ్యాప్తంగా కేజీఎఫ్ చాప్టర్ 2 ఏప్రిల్ 14న రిలీజ్ అయింది. పాన్ ఇండియా సినిమాగా సత్తా చాటింది. కన్నడ, తెలుగు, తమిళ్, మళయాళం, హిందీ భాషల్లో రిలీజ్ అయింది. ఈ సినిమా విడుదల అయినప్పటి నుంచి కాసుల సునామీ సృష్టించింది. కేజీఎఫ్ చాప్టర్ 2 కలెక్షన్లు రోజు రోజుకు పెరుగుతూ పోయాయి.
వందల కోట్ల రూపాయలను కొల్లగొట్టిన సినిమాగా, ఈ చిత్రం చరిత్ర సృష్టించింది. తక్కువ సమయంలోనే వేయి కోట్ల రూపాయలను వసూళ్లు చేసింది. వేల కోట్ల రూపాయలు వసూళ్లు చేసిన రెండో సినిమాగా రికార్డు సాధించింది. ఈ సినిమా రూ.1201 కోట్లను వసూళ్లు చేసింది.
కేజీఎప్ చాప్టర్ 2 వసూళ్ల వివరాలు
- తెలుగు రాష్ట్రాలు (ఏపీ, టీఎస్) - రూ. 82.65 కోట్లు (రూ. 147 కోట్లు గ్రాస్)
- కర్ణాటక - రూ. 98 కోట్లు ( రూ. 175 కోట్లు గ్రాస్)
- తమిళనాడు - రూ. 55 కోట్లు (రూ. 110 కోట్లు గ్రాస్)
- కేరళ - రూ. 28 కోట్లు (రూ. 67 కోట్లు గ్రాస్)
- నార్త్ ఇండియా - రూ. 197 కోట్లు ( రూ. 495 కోట్లు గ్రాస్)
- విదేశాల్లో - రూ. 88 కోట్లు ( రూ. 207 కోట్ల గ్రాస్)
- ప్రపంచ వ్యాప్త వసూళ్లు - రూ. 548.65 (రూ. 1201 కోట్ల గ్రాస్)
కన్నడలో రికార్డు
కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమా మొత్తం రూ.548.65 కోట్ల షేర్ రాబట్టింది. ఇక గ్రాస్ పరంగా రూ. 1201 కోట్లును కొల్లగొట్టింది. కన్నడ సినిమా పరిశ్రమలో అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. అంతేకాకుండా కన్నడ ఇండస్ట్రీలో భారీ కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా రికార్డు సృష్టించింది.