Director Vishwanath: కొమ‌రం భీముడికి కళాతపస్వీ కే విశ్వ‌నాథ్ ప్ర‌శంస‌లు

Updated on May 11, 2022 10:40 PM IST
Director Vishwanath: కళాతపస్వీ కే విశ్వనాథ్ వీడియో ఒక‌టి వైర‌ల్ అయింది. ఆర్.ఆర్.ఆర్ సినిమాలోని కొమ‌రం భీముడో సాంగ్ చూస్తున్న విశ్వ‌నాథ్ వీడియో సోష‌లో మీడియాలో పోస్ట్ చేశారు.
Director Vishwanath: కళాతపస్వీ కే విశ్వనాథ్ వీడియో ఒక‌టి వైర‌ల్ అయింది. ఆర్.ఆర్.ఆర్ సినిమాలోని కొమ‌రం భీముడో సాంగ్ చూస్తున్న విశ్వ‌నాథ్ వీడియో సోష‌లో మీడియాలో పోస్ట్ చేశారు.

Director Vishwanath: కళాతపస్వీ కే విశ్వనాథ్ వీడియో ఒక‌టి వైర‌ల్ అయింది. ఆర్.ఆర్.ఆర్ సినిమాలోని కొమ‌రం భీముడో సాంగ్ చూస్తున్న విశ్వ‌నాథ్ వీడియో సోష‌లో మీడియాలో పోస్ట్ చేశారు. ఎన్టీఆర్ న‌ట‌న‌ను విశ్వ‌నాథ్ తీక్ష‌ణంగా చూశారు. 

ఆర్.ఆర్.ఆర్. సినిమాలో ఎన్టీఆర్ న‌టించిన కొమ‌రం భీముడో వీడియో సాంగ్ రీసెంట్‌గా రిలీజ్ చేశారు. కొమ‌రం భీముడో పాట‌లో ఎన్టీఆర్ జీవించారంటూ ప్ర‌శంస‌లు అందుతున్నాయి. సోష‌ల్ మీడియాలో కొమ‌రం భీముడో పాట ట్రెండిగ్‌లో ఉంది. 

క‌ళాత‌ప‌స్వీ కే.విశ్వ‌నాథ్ (Director Vishwanath) కూడా కొమ‌రం భీముడో పాట‌ను చూశారు. ఎన్టీఆర్ న‌ట‌న‌ను త‌దేకంగా చూస్తున్న విశ్వ‌నాథ్ వీడియో సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఎన్టీఆర్ న‌ట‌న‌ను క‌నురెప్ప వేయ‌కుండా విశ్వ‌నాథ్ చూశారు. రామ్ చ‌ర‌ణ్, ఎన్టీఆర్ న‌ట‌న చూసిన విశ్వ‌నాథ్ ప్ర‌శంస‌లు అందించారు. 

ఆర్.ఆర్.ఆర్ సినిమా రిలీజ్ త‌ర్వాత కూడా ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి ప్రేక్ష‌కుల‌కు వినోదం పంచుతున్నారు. సినిమా పాట‌ల‌ను కొన్ని సీన్స్ యాడ్ చేసి ఒక్కో పాట రీలీజ్ చేస్తూ  ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తి పెంచుతున్నారు. స్టార్ డైరెక్ట‌ర్ విశ్వ‌నాథ్ (Director Vishwanath)  కూడా ఆర్.ఆర్.ఆర్. పాట‌ల‌ను ఆస‌క్తిగా చూస్తున్నారు.

ఆర్.ఆర్.ఆర్ సినిమాను రాజ‌మౌళి ఓటీటీలో విడుద‌ల చేయ‌నున్నారు. అందుకోసం స‌న్నాహాలు చేస్తున్నారు. ఓటీటీలో ఎవ‌రూ విడుద‌ల చేయ‌ని స్టైల్లో రిలీజ్ చేస్తార‌ట‌. ఇప్ప‌టికే దాదాపు అన్ని పొట‌ల‌కు కొత్త రూపు ఇచ్చారు రాజ‌మౌళి. సినిమాలో ఇంకెన్ని ఇంట్ర‌స్టింగ్ ఎలిమెంట్స్ ఉంటాయోన‌ని  ఆడియ‌న్స్ ఎదురుచూస్తున్నారు. 

ఆర్.ఆర్.ఆర్ సినిమా మే 20న  జీ5, నెట్‌ఫ్లిక్స్‌లలో స్ట్రీమింగ్ అవుతుంది. ఓటీటీలో ఆర్.ఆర్.ఆర్ చూడాలంటే కొంత డ‌బ్బును ఆ సంస్థ‌ల‌కు చెల్లించాల‌ట‌. జూన్ 3 నుంచి అందరికీ అందుబాటులోకి వస్తుంది.  రాజ‌మౌళి ఈ త‌ర‌హాలో సినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తే ... మ‌రో రికార్డు బ్రేక్ చేసిన‌ట్టే. ఓటీటీలో కొత్త త‌ర‌హా ప్ర‌యోగం చేసిన ఇండియ‌న్  సినిమాగా నిలుస్తుంది. 
 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!