RRR: 'భీమా నిన్ను కన్న నేల తల్లి గర్వపడుతుంది'... ఇజ్రాయెల్ పత్రికల్లో ఎన్టీఆర్( NTR) కథనాలు
ఆర్.ఆర్.ఆర్. (RRR) సినిమాలో కొమురం భీముడుగా ఎన్టీఆర్ (NTR) నటనను ప్రపంచ మొత్తం ప్రశంసిస్తుంది. అడవిలో ఉండే గోండు జాతి కోసం ఎన్టీఆర్ చేసిన భీకర సమరానికి ఎందరో ప్రేక్షకులు జై కొడుతున్నారు. ఎన్టీఆర్ నటన ఓ వండర్ అంటూ పొగుడుతున్నారు. ఆర్.ఆర్.ఆర్. సినిమాలో ఎన్టీఆర్ నటన తమ హృదయాల్లో నిలిచిందంటున్నారు. ఇక ఇజ్రాయెల్ దేశంలో ఓ న్యూస్ పేపర్‌లో ఎన్టీఆర్ నటనను ప్రశంసిస్తూ ఓ కథనాన్నే ప్రచురించారు.
రాజమౌళికే సాధ్యమైన గొప్ప సినిమా ఆర్.ఆర్.ఆర్.
రౌద్రం రణం రుధిరం (RRR) అనే సినిమాతో దర్శక ధీరుడు రాజమౌళి ఓ గొప్ప సినిమాను తెరకెక్కించారు. పాన్ ఇండియా సినిమాగా ఆర్.ఆర్.ఆర్. పలు రికార్డులు బద్దలు కొట్టింది. ఒక్క రికార్డులతో ఆగిపోలేదు. వేయి కోట్ల రూపాయలను కొల్లగొట్టి చరిత్ర సృష్టించింది. నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోయిజం వెండితెరపై కొత్తగా కనిపించింది.
ఓ దేశం కోసం పోరాడే యోధుల పాత్రలో రామ్, ఎన్టీఆర్ జీవించారు. ప్రతీ సన్నివేశానికి సరిపోయేలా హావభావాలతో ఆకట్టుకున్నారు. ఇక రామ్ చరణ్, ఎన్టీఆర్ నటనకు ఇండియాతో పాటు ప్రపంచ దేశాల్లో చర్చించుకుంటున్నారు. ఆర్.ఆర్.ఆర్. సినిమా అభిమానులకు ఓ గొప్ప అనుభూతిని కలిగించింది. అందుకే ఆర్.ఆర్.ఆర్. చూసిన ప్రతీ ఒక్కరు మనసు నిండా మరిచిపోలేని పోరాటాన్ని నింపుకున్నారు.
దేశభక్తి అంటే కొమురం భీముడిదే
ఆర్.ఆర్.ఆర్ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర ఒక ఎత్తైతే.. కొమురం భీముడో పాటతో ఎన్టీఆర్ ప్రతీ ఒక్కరిలో దేశభక్తి రగిల్చాడు. ఎన్టీఆర్ పాత్ర గురించి ప్రపంచ దేశాల్లో సినిమా అభిమానులు చర్చించుకుంటున్నారు. ఇక ఇజ్రాయెల్ దేశంలో ఓ వార్తాపత్రికలో ఎన్టీఆర్ నటనపై ప్రత్యేక కథనాన్నే ప్రచురించారు. దేశాన్ని కాపాడుకోవడానికి ఆర్.ఆర్.ఆర్.లో ఎన్టీఆర్ చేసిన పోరాటంపై వ్యాసాన్ని రాశారు.
దేశభక్తి అంటే కొమురం భీముడిలా ఉండాలంటూ ప్రచురించారు. ఇక ఎన్టీఆర్ క్లైమాక్స్ సీన్‌లో చేసిన ఫైట్ సీన్స్ ఎంజాయ్ చేస్తున్నారట. ఎన్టీఆర్ (NTR) రామ్ చరణ్‌ను భుజాలపై మోసే సన్నివేశం అద్భుతం అంటున్నారు. ఇక బ్రిటిష్ వారిపై అడవి జంతువులతో కలిసి చేసిన ఫైట్స్‌ను మళ్లీ మళ్లీ చూస్తున్నారట.
హాలీవుడ్ రేంజ్ సినిమా ఆర్.ఆర్.ఆర్.
భారతదేశంలో సినిమాలంటే ముంబై గుర్తుకు వస్తుందని ఇజ్రాయెల్ పత్రికలో రాశారు. అప్పటిలా ఇప్పుడు హిందీ సినిమాలే టాప్ కాదని.. ఆర్.ఆర్.ఆర్ సినిమాతో టాలీవుడ్ ఓ గొప్ప శక్తిగా అవతరించిందని రాశారు. ఇద్దరు హీరోల శక్తులను వారికి తెలియకుండానే ఏకం చేసిన గొప్ప దర్శకుడు రాజమౌళి అంటూ ప్రశంసించారు. హాలీవుడ్‌లో ఈ మధ్య ఎంటర్‌టైన్‌మెంట్ తగ్గిందని రాసుకొచ్చారు. ఇక ఆర్.ఆర్.ఆర్. సినిమా హాలీవుడ్ రేంజ్ వినోదం పంచుతుందన్నారు. ఇజ్రాయిల్‌లో Haaretz అనే పత్రిక ఆర్.ఆర్.ఆర్. చిత్రంపై ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.
రామ్ నటనకు ప్రశంసలు
ఆర్.ఆర్.ఆర్. సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటించారు. రామ్ చరణ్ నటనకు కూడా ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరు వస్తుంది. బాలీవుడ్ నటులు అలియా భట్, అజయ్ దేవగన్ ప్రత్యేక పాత్రల్లో నటించారు. ఒలీవియా, శ్రియ, సముద్రఖని, రాహుల్ రామకృష్ణ, మకరంద్ దేశ్ పాండే ఈ సినిమాలో నటించారు.
ఓటీటీలో ఆర్.ఆర్.ఆర్. రిలీజ్ అయ్యాక ఈ సినిమాకు మరింత పాపులారిటీ వచ్చింది. దేశ, విదేశాల్లో ఎంతో మంది ప్రేక్షకులను మెప్పిస్తుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మళయాళ భాషల్లో రిలీజ్ చేశారు.