రాజమౌళి సినిమా కోసం సూపర్‌‌స్టార్ మహేష్‌బాబు (MaheshBabu) రెమ్యునరేషన్‌ అన్ని కోట్లా?

Updated on Jul 12, 2022 07:19 PM IST
రాజమౌళి దర్శకత్వంలో మహేష్‌బాబు (MaheshBabu) నటిస్తున్న సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది.
రాజమౌళి దర్శకత్వంలో మహేష్‌బాబు (MaheshBabu) నటిస్తున్న సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది.

సర్కారు వారి పాట సినిమా సక్సెస్‌తో జోష్‌ మీద ఉన్నారు సూపర్‌‌స్టార్ మహేష్‌బాబు (MaheshBabu). ప్రస్తుతం ఆయన త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటించడానికి సిద్దమవుతున్నారు. మహేష్‌ – త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కబోయే సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే జరుగుతున్నాయి. ఆ సినిమా తర్వాత మహేష్‌బాబు దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో సినిమా చేయనున్నారు.

రాజమౌళి డైరెక్షన్‌లో సినిమా చేయడానికి హీరోలు అందరూ ఇంట్రెస్టింగ్‌గానే ఉంటారు. రాజమౌళి డైరెక్షన్‌లో సినిమా చేస్తే మంచి ఫేమ్‌తోపాటు.. భారీ పారితోషికం కూడా లభిస్తుండడం కూడా ఒక కారణం. అయితే రాజమౌళి డైరెక్షన్‌లో నటించాలంటే మాత్రం హీరోకి కాస్త ఓపిక ఎక్కువ ఉండాలి. రాజమౌళితో సినిమా అంటే సుమారుగా రెండు సంవత్సరాలు డేట్స్ ఇవ్వాల్సి ఉంటుంది.

అప్పటివరకు వేరే సినిమాలు చేసే అవకాశం కూడా ఉండదు. ఆ ఓపికగా ఉంటే.. మంచి సినిమాలో నటించామనే సంతృప్తితోపాటు నటుడిగా మంచి పేరు కూడా దక్కుతుంది. జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, రాంచరణ్‌ ఈ లిస్ట్‌లో ఉన్నారు. అయితే ఇప్పుడు ఆ లిస్ట్‌లో సూపర్‌‌స్టార్ మహేష్‌బాబు కూడా చేరనున్నారు.

రాజమౌళి, ప్రభాస్, రాంచరణ్‌, జూనియర్ ఎన్టీఆర్

విజువల్‌గా కూడా..

రాజమౌళి డైరెక్షన్‌లో మొదటిసారి నటించనున్నారు మహేష్‌బాబు. ఈ క్రమంలో మహేష్.. రాజమౌళి డైరెక్షన్‌లో నటించడానికి రెడీ అయ్యారు. రాజమౌళి కూడా మహేష్‌ సినిమాలో సరికొత్త విజువల్ ఎఫెక్ట్స్‌ను వాడనున్నట్టు వెల్లడించారు. మహేష్ బాబు – త్రివిక్రమ్ సినిమా షూటింగ్‌ పూర్తి అయిన వెంటనే, రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు మహేష్‌.

ఈ సినిమా కోసం మహేష్ బాబు కెరీర్‌‌లోనే అత్యధిక రెమ్యునరేషన్‌ తీసుకోనున్నట్టు టాక్. రాజమౌళితో సినిమా కోసం మహేష్‌బాబు (MaheshBabu) ఏకంగా రూ.80 కోట్ల పారితోషకం తీసుకుంటున్నారని తెలుస్తోంది. అయితే దీనిపై ఎటువంటి అధికారిక సమాచారం అందలేదు.

Read More : సినీ సంగీత ప్రపంచంలో తనదైన ముద్ర వేసిన ‘మెలోడీ బ్రహ్మ’ మణిశర్మ (Mani Sharma) బర్త్‌డే స్పెషల్

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!