SSMB28: మ‌హేష్‌ (Mahesh Babu), త్రివిక్ర‌మ్ కాంబో 'ఎస్ఎస్ఎంబి 28' ఆగ‌స్టులో మొద‌లు!.. విడుద‌ల ఎప్పుడంటే..?

Updated on Jul 09, 2022 06:05 PM IST
మ‌హేష్ బాబు (Mahesh Babu) న‌టించ‌బోయే 28వ సినిమాకు సంబంధించిన వివ‌రాలను మేక‌ర్స్ అధికారికంగా ప్ర‌క‌టించారు. 
మ‌హేష్ బాబు (Mahesh Babu) న‌టించ‌బోయే 28వ సినిమాకు సంబంధించిన వివ‌రాలను మేక‌ర్స్ అధికారికంగా ప్ర‌క‌టించారు. 

SSMB28: టాలీవుడ్‌లో సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు (Mahesh Babu) వ‌రుస హిట్ సినిమాల‌తో దూకుడు మీద ఉన్నారు. స‌ర్కారు వారి పాట సినిమా మ‌హేష్ బాబుకు బ్లాక్ బాస్ట‌ర్ హిట్ ఇచ్చింది. ఈ సినిమా త‌ర్వాత మ‌హేష్ బాబు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో 'ఎస్ఎస్ఎంబి 28'లో న‌టించ‌నున్నారు. మ‌హేష్ బాబు న‌టించ‌బోయే 28వ సినిమాకు సంబంధించిన వివ‌రాలను మేక‌ర్స్ అధికారికంగా ప్ర‌క‌టించారు. 

11 ఏళ్ల త‌ర్వాత మ‌హేష్‌తో సినిమా
టాలీవుడ్ ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌కు మాట‌ల మాంత్రికుడిగా పేరున్న సంగ‌తి తెలిసిందే. ఈ ద‌ర్శ‌కుడు మ‌హేష్ బాబుతో 11 ఏళ్ల త‌ర్వాత సినిమాను తీయ‌బోతున్నారు. గ‌తంలో మ‌హేష్‌(Mahesh Babu), త్రివిక్ర‌మ్ కాంబోలో విడుద‌లైన‌ 'అత‌డు', 'ఖ‌లేజా' సినిమాలు సూప‌ర్ హిట్‌గా నిలిచాయి. ఇక వీరిద్ద‌రి కాంబోలో హాట్రిక్ సాధించేలా మ‌రో సినిమా తెర‌కెక్కుతుందనే అంచ‌నాలు ఏర్పడ్డాయి. ఆ సినిమాకు 'ఎస్ఎస్ఎంబి 28' అనే టెంప‌ర‌రీ టైటిల్‌ను ఖ‌రారు చేశారు. 'సైన్యం' అనే టైటిల్ ఖ‌రారు చేస్తార‌నే వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి

2023లో విడుద‌ల‌
'ఎస్ఎస్ఎంబి 28' సినిమాను హారికా అండ్‌ హాసిని బ్యానర్ పై రూపొందిస్తున్నారు. నిర్మాతగా ఎస్‌.రాధాకృష్ణ(చినబాబు) వ్యవహరిస్తున్నారు. ఈ చిత్ర‌ షూటింగ్ షెడ్యూల్ ఆగ‌స్టులో మొద‌లు కానుంది. 2023 స‌మ్మ‌ర్‌లో 'ఎస్ఎస్ఎంబి 28' విడుద‌ల కానుంది. మ‌హేష్ బాబు కొత్త సినిమా అప్‌డేట్స్ అభిమానుల్లో జోష్ నింపాయి. మ‌హేష్ బాబుకు జోడిగా గ్లామర్ బ్యూటీ పూజా హెగ్దే (Pooja Hegde) ఈ చిత్రంలో నటిస్తోంది. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తున్నారు. జాతీయ అవార్డ్ గ్రహీత నవీన్ నూలి ఎడిటర్‌గా వ్య‌వ‌హ‌రించనున్నారు.

ఫ‌స్ట్ లుక్ రిలీజ్ ఎప్పుడంటే..
హాలీడే ట్రిప్ కోసం మ‌హేష్ బాబు (Mahesh Babu) విదేశాల‌కు వెళ్లారు. అక్క‌డి నుంచి తిరిగి వ‌చ్చాక మ‌హేష్ బాబు 'ఎస్ఎస్ఎంబి 28' సినిమా షూటింగ్‌లో బిజీ కానున్నారు. త్రివిక్ర‌మ్ ఈ సినిమాకు సంబంధించిన స్కిప్ట్ వ‌ర్క్ కూడా పూర్తి చేశారు. మ‌హేష్ బాబు బ‌ర్త్ డే ఆగ‌స్టు 9 కావ‌డంతో ఆ రోజు ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌ను విడుద‌ల చేయాల‌ని భావిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో గ్రాండ్‌గా పూజా కార్యక్రమాలను నిర్వహించారు.  ఆ కార్య‌క్ర‌మంలో మ‌హేష్ భార్య న‌మ్ర‌తా శిరోద్క‌ర్‌తో పాటు త్రివిక్ర‌మ్‌, పూజ హెగ్డే పాల్గొన్నారు.

Read More: ‘SSMB28’: మహేష్ బాబు-త్రివిక్రమ్ కాంబోలో మూవీ.. ఫస్ట్ లుక్ కోసం ముహూర్తం ఖరారు?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!