Vijay Deverakonda: ఈడీ విచారణకు హాజరైన విజయ్ దేవరకొండ.. అధికారులు ఏం ప్రశ్నించనున్నారు..?

Updated on Nov 30, 2022 05:09 PM IST
‘లైగర్’ (Liger) సినిమా నిర్మాణ వ్యవహారాలకు సంబంధించి విజయ్ (Vijay Deverakonda)ను అధికారులు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం
‘లైగర్’ (Liger) సినిమా నిర్మాణ వ్యవహారాలకు సంబంధించి విజయ్ (Vijay Deverakonda)ను అధికారులు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) విచారణకు హాజరయ్యారు. ‘లైగర్’ సినిమా నిర్మాణ వ్యవహారాలకు సంబంధించి విజయ్‌ను అధికారులు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ఈ మూవీ డైరెక్టర్ పూరి జగన్నాథ్, నిర్మాత ఛార్మీ కూడా గతంలో ఈడీ విచారణకు హాజరవ్వగా.. ఇప్పుడు విజయ్‌ను విచారిస్తున్నారు. 

‘లైగర్’ (Liger) చిత్రానికి సంబంధించిన వ్యవహారంలో దుబాయికి డబ్బులు పంపించి.. అక్కడి నుంచి తిరిగి సినిమాలో పెట్టుబడులు పెట్టినట్టు ఈడీ (Enforcement Directorate) అధికారులు గతంలో ప్రాథమికంగా గుర్తించారు. ఈ వ్యవహారంలో ఓ రాజకీయ నేత ప్రమేయం కూడా ఉన్నట్లు ఈడీ అనుమానిస్తోంది. ఆ నాయకుడికి ఢిల్లీ లిక్కర్ స్కాంతో సంబంధం ఉందని భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ‘లైగర్‌’ నిర్మాణంలో సంబంధం ఉన్న వాళ్లందరినీ అధికారులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారని తెలుస్తోంది. 

‘లైగర్‌’ నిర్మాణంలో సంబంధం ఉన్న వాళ్లందరినీ అధికారులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు

విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)తో ‘జనగణమన’ పేరుతో కొత్త చిత్రాన్ని ప్రకటించిన పూరి జగన్నాథ్.. ‘లైగర్’ నిర్మాణ సమయంలోనే ఈ మూవీ కోసం కొన్ని సన్నివేశాలు షూట్ చేశారు. ఇందుకు సుమారు రూ.20 కోట్ల దాకా ఖర్చయినట్లు సమాచారం. ఈ మొత్తాన్ని సమకూర్చింది ఎవరనేది ఇంకా బయటపడాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. కాగా, ‘లైగర్’ హిందీ వెర్షన్‌కు కరణ్ జోహర్ కూడా నిర్మాతగా వ్యవహరించడం గమనార్హం. 

ఇకపోతే, ప్రస్తుతం ‘ఖుషి’ సినిమాలో విజయ్ దేవరకొండ నటిస్తున్నారు. ఇందులో ఆయన సరసన టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత (Samantha Ruth Prabhu) యాక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ మూవీ రిలీజ్ అవుతుందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో విజయ్ తెలిపారు. కాగా, ఈ సినిమా ప్రీ రిలీజ్ బిసినెస్ ఆసక్తిని రేపుతోంది. ‘లైగర్’ చిత్రం రిజల్ట్ ఎఫెక్ట్ ‘ఖుషి’పై పడుతుందేమోనని అంతా అనుకున్నారు. అయితే ఆ ప్రభావమేమీ పడ్డట్లు కనిపించడం లేదు. ‘ఖుషి’ మూవీ నాన్ థియేట్రికల్ బిజినెస్ సుమారు రూ.90 కోట్లు దాటిందని ట్రేడ్ వర్గాల సమాచారం. తెలుగు, హిందీ సహా అన్ని భాషలు కలుపుకుని ఈ చిత్రం నాన్ థియేట్రికల్ హక్కులు ఇప్పటికే అమ్మేశారని సమాచారం.

Read more: Telugu Flop Movies 2022 : 2022లో విడుదలైన టాప్ 10 డిజాస్టర్ తెలుగు సినిమాలపై ప్రత్యేక కథనం..

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!