‘లైగర్’ ఎఫెక్ట్ పడలేదుగా!.. నాన్ థియేట్రికల్ బిజినెస్‌లో దుమ్మురేపిన విజయ్ (Vijay Deverakonda) ‘ఖుషి’ మూవీ
‘లైగర్’ (Kushi) సినిమా ఫలితంతో నిరాశలో కూరుకుపోయిన రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) సాలిడ్ హిట్ కొట్టాలని చూస్తున్నారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘లైగర్’ (Liger) మూవీ రిజల్ట్ ఒకరకంగా ఆయనను షాక్‌కు గురి చేసిందనే చెప్పాలి. టాలీవుడ్‌తోపాటు బాలీవుడ్‌లోనూ ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో తదుపరి చేసే సినిమాల విషయంలో విజయ్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ప్రస్తుతం ‘ఖుషి’ చిత్రంలో నటిస్తున్న విజయ్ దేవరకొండ.. నెక్స్ట్ ఏ సినిమాలో యాక్ట్ చేస్తారనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. తెలుగుతోపాటు కొందరు హిందీ దర్శకులు కూడా ఆయనకు పలు కథలు వినిపించారట. అయితే ఇంకా ఏ స్క్రిప్టుకూ ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని తెలుస్తోంది. ఈసారి ఆడియెన్స్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ నిరాశపర్చొద్దని ఆయన భావిస్తున్నారట. అందుకే ఎక్కువ టైమ్ తీసుకుంటున్నారని సమాచారం.
ప్రస్తుతం ‘ఖుషి’ సినిమాలో విజయ్ దేవరకొండ నటిస్తున్నారు. ఇందులో ఆయన సరసన టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత (Samantha Ruth Prabhu) యాక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ మూవీ రిలీజ్ అవుతుందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో విజయ్ తెలిపారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిసినెస్ ఆసక్తిని రేపుతోంది. ‘లైగర్’ చిత్రం రిజల్ట్ ఎఫెక్ట్ ‘ఖుషి’పై పడుతుందేమోనని అనుకున్నారు. అయితే ఆ ప్రభావమేమీ పడ్డట్లు కనిపించడం లేదు.
‘ఖుషి’ మూవీ నాన్ థియేట్రికల్ బిజినెస్ సుమారు రూ.90 కోట్లు దాటిందని ట్రేడ్ వర్గాల సమాచారం. తెలుగు, హిందీ సహా అన్ని భాషలు కలుపుకుని ఈ చిత్రం నాన్ థియేట్రికల్ హక్కులు ఇప్పటికే అమ్మేశారని సమాచారం. విజయ్, సమంతల కాంబినేషన్‌కు వస్తున్న క్రేజ్ వల్లే ఈ స్థాయిలో బిజినెస్ జరిగిందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. పెద్ద బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ‘ఖుషి’ చిత్రంతో విజయ్ ఏ స్థాయి హిట్‌ను అందుకుంటారో, ప్రేక్షకులను ఎంతమేరకు మెప్పిస్తారో చూడాలి.