ఫస్ట్ టైమ్ స్క్రీన్‌పై చూసినప్పుడే సమంత (Samantha Ruth Prabhu)తో ప్రేమలో పడిపోయా: విజయ్ (Vijay Devarakonda)

Updated on Oct 28, 2022 11:46 AM IST
కాలేజీ రోజుల నుంచే సమంత (Samantha Ruth Prabhu)కు తాను అభిమానిని అని టాలీవుడ్ యంగ్ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) అన్నారు
కాలేజీ రోజుల నుంచే సమంత (Samantha Ruth Prabhu)కు తాను అభిమానిని అని టాలీవుడ్ యంగ్ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) అన్నారు

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha Ruth Prabhu)పై తన అభిమానాన్ని మరోసారి బయటపెట్టారు పాన్ ఇండియా సెన్సేషన్ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda). సమంత అంటే తనకు చాలా ఇష్టమని ఆయన అన్నారు. మొదటిసారి సమంతను స్క్రీన్‌పై చూసినప్పుడే ఆమెతో ప్రేమలో పడిపోయానని ఈ రౌడీ స్టార్ అన్నారు. సమంత నటించిన ‘యశోద’ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఈ ట్రైలర్‌ను విజయ్ దేవరకొండ ట్విట్టర్‌లో పంచుకున్నారు.  

సమంత కొత్త చిత్రం ‘యశోద’ ట్రైలర్‌ను అందరితో పంచుకుంటున్నందుకు ఎంతో ఆనందంగా ఉందని విజయ్ దేవరకొండ తెలిపారు. సమంతకు ఎప్పటినుంచో తాను అభిమానినని ఆయన అన్నారు. కాలేజీ రోజుల్లో ఆమెను తొలిసారి స్క్రీన్‌పై చూశానన్నారు. సమంత తన కెరీర్‌లో సాధించిన విజయాలను చూస్తుంటే గర్వంగా ఉందని విజయ్ చెప్పారు.  

ఇక, సమంత ప్రధాన పాత్రలో ‘యశోద’ చిత్రం రూపుదిద్దుకుంటోంది. సరోగసీ అంశంతోపాటు రాజకీయం, మర్డర్ మిస్టరీ, ప్రమాదం అంచున ఓ మహిళ చేసిన పోరాటంగా ఈ సినిమా ఉండబోతోందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. హరి–హరీశ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేశ్, సంపత్ రాజ్, శత్రు, మధురిమ, కల్పికా గణేశ్ తదితరులు నటిస్తున్నారు. శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. సీనియర్ సంగీత దర్శకుడు మణిశర్మ బాణీలు సమకూర్చుతున్నారు. 

ఇటీవలే వివిధ భాషల్లో ఐదుగురు స్టార్ హీరోలు ‘యశోద’ ట్రైలర్‌ను లాంచ్‌‌ చేశారు. లవ్, ఎమోషన్, యాక్షన్, థ్రిల్ లాంటి అంశాలను ఈ రెండున్నర నిమిషాల కంటే తక్కువ నిడివి గల ట్రైలర్‌లో అద్భుతంగా చూపించారు. దీంతో ‘యశోద’పై అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమాను నవంబర్ 11న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల చేయనున్నారు.  ఈ చిత్రంతో సమంత ఏస్థాయి విజయాన్ని అందుకుంటారో చూడాలి.  

Read more: టాలీవుడ్‌ (Tollywood)లో చిన్న సినిమాల సందడి.. నవంబర్‌‌లో రిలీజ్‌ కానున్న చిత్రాలు!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!