విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) – దిల్‌ రాజు కాంబో సినిమాకు హరీష్‌ శంకర్‌‌ కథ రెడీ చేస్తున్నారా?

Updated on Sep 05, 2022 06:15 PM IST
విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా  తెరకెక్కుతున్న ఖుషి తర్వాత దిల్ రాజు సారధ్యంలో సినిమా చేయనున్నారు
విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా తెరకెక్కుతున్న ఖుషి తర్వాత దిల్ రాజు సారధ్యంలో సినిమా చేయనున్నారు

రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) నటించిన సినిమా ‘లైగర్’. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. లైగర్ ఫలితంతో విజయ్ – పూరీ కాంబినేషన్‌లో తెరకెక్కాల్సిన జనగణమన సినిమా షూటింగ్‌ ఆగిపోయిందని సమాచారం.

జనగణమన సినిమా పూరీ జగన్నాథ్‌ డ్రీమ్ ప్రాజెక్ట్‌ కావడం, భారీ బడ్జెట్‌తో తెరకెక్కించే సినిమా కావడంతో కొన్ని రోజులు ఈ ప్రాజెక్ట్‌ను పక్కకు పెట్టాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం పూరీ జగన్నాథ్‌ ఎనర్జిటిక్‌ స్టార్ రామ్‌ పోతినేనితో ఇస్మార్ట్ శంకర్‌‌ సినిమాకు సీక్వెల్‌ తెరకెక్కించే ఆలోచనలో ఉన్నారని సమాచారం. ఆ సీక్వెల్‌ కోసం కథ రెడీ పనిలో ఉన్నారని టాక్.

విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా  తెరకెక్కుతున్న ఖుషి తర్వాత దిల్ రాజు సారధ్యంలో సినిమా చేయనున్నారు

‘ఖుషి’ పూర్తైన తర్వాత..

ఇక, విజయ్ దేవరకొండ ప్రస్తుతం ‘ఖుషి’ సినిమాలో నటిస్తున్నారు. సమంత హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే కాశ్మీర్‌‌లో తొలి షెడ్యూల్‌ పూర్తయ్యింది. ఖుషి సినిమా తర్వాత విజయ్‌ నటించే సినిమాపై ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. అయితే దిల్‌ రాజు నిర్మాణ సంస్ధలో విజయ్‌ ఒక సినిమా చేయాల్సి ఉంది. ఈ సినిమాకు దర్శకుడు ఎవరు అనేది తెలియలేదు.

అయితే దిల్‌ రాజు మాత్రం విజయ్‌తో తెరకెక్కించబోయే సినిమాకు హరీష్ శంకర్‌‌ను దర్శకుడిగా ఎంపిక చేశారని తెలుస్తోంది. దీంతో విజయ్ దేవరకొండ కోసం కథ రెడీ చేసే పనిలో హరీష్ పడ్డారని సమాచారం. ఖుషి సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే దిల్‌ రాజుతో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) తెరకెక్కించే సినిమా పట్టాలెక్కనుందని టాక్.

Read More : విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) ‘లైగర్‌‌’ ఎఫెక్ట్‌!.. సోషల్‌ మీడియాకు బ్రేక్ ఇస్తున్నా: చార్మి కౌర్

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!