పారితోషికం పెంచేసిన స్టార్ హీరోయిన్ సమంత (Samantha)!.. ఒక్కో మూవీకి అంత తీసుకుంటున్నారా?

Updated on Oct 27, 2022 04:16 PM IST
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) తన రెమ్యూనరేషన్‌ను పెంచారని సమాచారం. 
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) తన రెమ్యూనరేషన్‌ను పెంచారని సమాచారం. 

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కెరీర్ ఫుల్ స్వింగ్‌లో ఉంది. ఆ మధ్య కాస్త స్పీడ్ తగ్గించిన సమంత.. ఇప్పుడు మళ్లీ దూకుడు పెంచారు. కోలీవుడ్, టాలీవుడ్‌ల్లో వరుస చిత్రాలను ఒప్పుకుంటున్న ఆమె.. మరోవైపు వెబ్ సిరీస్‌ల్లోనూ యాక్ట్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఈ క్రమంలో సామ్ రెమ్యూనరేషన్ కూడా పెంచారని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతానికి సమంత చేస్తున్న సినిమాలకు దాదాపు రూ.3 నుంచి రూ.8 కోట్ల వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. తదుపరి ఒప్పుకునే చిత్రాలు, వెబ్ సిరీస్‌లకు కూడా ఆమె ఈ మొత్తంలోనే పారితోషికం అందజేయాలని నిర్మాతలను డిమాండ్ చేస్తున్నారట. రెమ్యూనరేషన్ విషయంలో అస్సలు తగ్గేదేలే అంటున్నారట. దీంట్లో ఎంత నిజముందో ఆమెకే తెలియాలి. 

సమంత త్వరలోనే ముంబైలో ఓ విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేయనున్నట్లు సోషల్ మీడియాలో ఓ రూమర్ వైరల్ అవుతోంది. రూ.30 కోట్లతో ఒక భారీ ఇల్లును సామ్ తీసుకుంటున్నట్లు వినికిడి. ఆ ఇల్లు బీచ్ వ్యూతోపాటు అన్ని సదుపాయాలతో ఉందట. ఎంతో ఇష్టపడి ఆమె ఇంటిని కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. హిందీలో పలు చిత్రాలతోపాటు వెబ్ సిరీస్‌ల్లోనూ నటిస్తుండటంతో తన మకాంను పూర్తిగా ముంబైకి మార్చే పనిలో సామ్ బిజీగా ఉన్నారట. దీనిపై సమంత స్పందిస్తారేమో చూడాలి.  

ఇకపోతే, సమంత ప్రస్తుతం లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఆమె నటిస్తున్న ‘యశోద’ (Yashoda) చిత్రం నవంబర్ 11న విడుదల కానుంది. సామ్ ప్రధాన పాత్రలో టైటిల్ రోల్ పోషిస్తూ ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘శాకుంతలం’ (Shakuntalam) మూవీ కూడా త్వరలో రిలీజ్ కానుంది. నీలిమా గుణ, దిల్ రాజు సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ విడుదల వాయిదా పడింది. త్వరలో కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తామని మేకర్స్ పేర్కొన్నారు. 

కాగా, రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ సరసన ‘ఖుషి’ సినిమాలో సమంత నటిస్తున్నారు. అలాగే ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ దర్శకులు రాజ్, డీకే ద్వయం తెరకెక్కిస్తున్న కొత్త వెబ్ సిరీస్‌లోనూ సమంత యాక్ట్ చేస్తున్నారు. హిందీ యువ నటుడు వరుణ్ ధావన్‌తో కలసి ఆమె రొమాన్స్ చేయనున్నారు. ఈ వెబ్ సిరీస్ షూటింగ్ నవంబర్‌ మొదటి వారంలో ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఈ వెబ్ సిరీస్ ఇంటర్నేషనల్ హిట్ సిరీస్ ‘సిటాడెల్‌’కు ఇండియన్ వెర్షన్‌గా చెబుతున్నారు. ఇక ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ సిరీస్ తర్వాత రాజ్, డీకేలతో సమంత చేస్తున్న రెండో ప్రాజెక్ట్ ఇది కావడం విశేషం. 

Read more: బాలీవుడ్‌లో మరో క్రేజీ సినిమాలో సమంత (Samantha)కు ఆఫర్.. ఈసారి యువరాణి క్యారెక్టర్‌‌లో కనిపించనున్న సామ్

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!