అరుదైన వ్యాధితో బాధపడుతున్న హీరోయిన్ సమంత (Samantha Ruth Prabhu).. త్వరలోనే కోలుకుంటానంటూ ఎమోషనల్ పోస్ట్!

Updated on Oct 29, 2022 06:48 PM IST
స్టార్ హీరోయిన్ సమంత (Samantha Ruth Prabhu) ఓ అరుదైన వ్యాధితో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఆమె వెల్లడించారు. 
స్టార్ హీరోయిన్ సమంత (Samantha Ruth Prabhu) ఓ అరుదైన వ్యాధితో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఆమె వెల్లడించారు. 

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha Ruth Prabhu) కొంతకాలంగా సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నారు. ఆమె ఆరోగ్యంపై పలు రకాల రూమర్స్ తెరపైకి వచ్చాయి. సామ్ అనారోగ్యంగా ఉన్నారని.. ఆమె చికిత్స తీసుకుంటున్నారని వార్తలు వచ్చాయి. అయితే దీనిపై సమంత ఇంతవరకు స్పందించలేదు. కానీ తొలిసారిగా ఈ విషయంపై ఆమె మాట్లాడారు. తాను అరుదైన వ్యాధితో బాధపడుతున్నానని సామ్ వెల్లడించారు. ఆ వ్యాధికి చికిత్స తీసుకుంటున్న ఒక ఫొటోను ఆమె షేర్ చేశారు. 

ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తన హెల్త్ గురించి వివరిస్తూ సామ్ ఓ పోస్ట్ పెట్టారు. ‘యశోద (Yashoda) మూవీ ట్రైలర్‌కు మీ స్పందన చూసి ఆనందంగా అనిపించింది. మీ అందరి ప్రేమ, అనుబంధమే జీవితం నాకు ఇస్తున్న సవాళ్లను ఎదుర్కొనేలా చేస్తోంది. కొన్ని నెలల నుంచి ‘మయోసిటిస్’ అనే వ్యాధితో బాధపడుతున్నా. ఈ విషయాన్ని పూర్తిగా కోలుకున్న తర్వాత మీతో చెబుదామని అనుకున్నా. కానీ నేను అనుకున్న దానికంటే ఎక్కువ సమయం పడుతోంది. మనం ఎప్పుడూ స్ట్రాంగ్‌గా ముందుకు వెళ్లలేమని అర్థం చేసుకున్నా’ అని సమంత చెప్పుకొచ్చారు. 

తాను త్వరగా కోలుకుంటానని వైద్యులు స్పష్టంగా చెబుతున్నారని సమంత అన్నారు

‘నేను త్వరగా కోలుకుంటానని వైద్యులు స్పష్టంగా చెబుతున్నారు. శారీరకంగా, మానసికంగా నాకు మంచి రోజులు, అలాగే చెడు రోజులు ఉన్నాయి. నేను ఇదంతా హ్యాండిల్ చేయలేనేమో అని అనుకున్న సందర్భాలూ ఉన్నాయి. కానీ ఏదో విధంగా ఆ క్షణాలు గడిచిపోయాయి. నేను పూర్తిగా కోలుకునే రోజు దగ్గరలోనే ఉందని ఆశిస్తున్నా. లవ్ యూ’ అని సమంత ఎమోషనల్ పోస్టును షేర్ చేశారు. ఈ పోస్టును చూసిన ఆమె అభిమానులు త్వరలో కోలుకుంటావ్ సామ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. 

ఇక, సమంత నటిస్తున్న కొత్త చిత్రం ‘యశోద’. శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు. నవంబర్ 11న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ మూవీని విడుదల చేయనున్నారు. సరోగసీ నేపథ్యంలో ఈ సినిమాను రూపొందించారు. ఇటీవల విడుదలైన ‘యశోద’ ట్రైలర్ అందర్నీ ఆకట్టుకుంటోంది. 

Read more: నిత్యా మీనన్ (Nithya Menen) తల్లి కాబోతోందా.. ప్రెగ్నెన్సీ కిట్ పోస్ట్ చేసిన బ్యూటీ.. షాక్ లో ఫ్యాన్స్!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!