రష్యాలో అలరించేందుకు సిద్దమైన 'పుష్ప'(Pushpa).. ప్రమోషన్లలో పాల్గొననున్న బన్నీ(Allu Arjun).. రిలీజ్ ఎప్పుడంటే?
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), నేషనల్ క్రష్ రష్మిక మందన్నా (Rashmika Mandanna) కాంబోలో సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ చిత్రం 'పుష్ప' (Pushpa The Rise). ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ రేంజ్ మారిపోయింది. అప్పటి వరకు కేవలం సౌత్ కే పరిమితం అయిన అల్లు అర్జున్ ఈ సినిమాతో ఉత్తరాది ప్రేక్షకుల మనసులో స్థిరమైన స్థానాన్ని ఏర్పరచుకొని ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయ్యాడు.
పుష్ప రాజ్ గా అల్లు అర్జున్ నట విశ్వరూపం, సుకుమార్ (Director Sukumar) మేకింగ్ అన్ని హిందీ ఆడియన్స్ కి బాగా నచ్చడంతో.. అక్కడ 100 కోట్ల కలెక్షన్స్ తో పుష్ప అదిరిపోయే కలెక్షన్స్ సాధించింది. పార్ట్ 1 సంచలన విజయం సాధించడంతో ఇప్పుడు పార్ట్ 2 తెరకెక్కించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
డైరెక్టర్ సుకుమార్ కూడా తొందర పడకుండా పక్క ప్లానింగ్ తో మరింత పక్కాగా స్క్రిప్ట్ తో బరిలోకి దిగుతున్నాడు. దీంతో పుష్ఫ సీక్వెల్ గా రాబోతున్న 'పుష్ప 2' (Pushpa The Rule)పై అంచనాలు పెరుగుతున్నాయి. ‘తగ్గేదేలే’ అంటూ అల్లు అర్జున్ (Allu Arjun) చెప్పిన డైలాగ్ ప్రపంచం మొత్తని ఒక ఊపు ఊపేసింది.
ఇదిలా ఉంటే.. ఈ చిత్రం త్వరలోనే రష్యాలో (Pushpa Releasing in Russia) విడుదల కానుంది. డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం. గత సెప్టెంబర్ నెలలో ఈ సినిమాని ఇంగ్లీష్ అలాగే రష్యన్ సబ్ టైటిల్స్ తో మాస్కో ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించారు. ఈ క్రమంలో 'పుష్ప' సినిమాకి అక్కడ అద్భుతమైన స్పందన లభించింది. ఈ క్రమంలో ఆ స్పందన చూసిన దర్శక నిర్మాతలు కీలక నిర్ణయం తీసుకున్నారు. అందుకే ఈ చిత్రాన్ని రష్యన్ భాషలో డబ్బింగ్ చేయించి భారీ ఎత్తున విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
రష్యాలో ఈ సినిమా ప్రమోషన్స్ కు అల్లు అర్జున్ (Allu Arjun) కూడా వెళ్లనున్నాడట. అయితే ఈ విషయంపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రస్తుతం బన్నీకి వేరే వర్క్ కమిట్‌మెంట్స్ ఉన్నాయి. ఈ పనులన్నీ పూర్తి కాగానే విడుదల తేదిని ప్రకటించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా సెకండ్ పార్ట్ కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.