Movie Review : మాస్ అండ్ యాక్షన్‌ ఎంటర్‌‌టైనర్‌‌గా సుడిగాలి సుధీర్‌‌ (Sudigali Sudheer) ‘గాలోడు’

Updated on Nov 18, 2022 02:22 PM IST
బజర్దస్త్‌ కామెడీ షోతో పాపులర్ అయిన సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer) ప్రస్తుతం సినిమాల్లో హీరోగా నటిస్తున్నారు
బజర్దస్త్‌ కామెడీ షోతో పాపులర్ అయిన సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer) ప్రస్తుతం సినిమాల్లో హీరోగా నటిస్తున్నారు

సినిమా : గాలోడు

నటీనటులు : సుడిగాలి సుధీర్, గెహానా సిప్పీ, సప్తగిరి, షకలక శంకర్‌‌

దర్శకత్వం : పులిచర్ల రాజశేఖర్‌‌ రెడ్డి

సంగీతం : బీమ్స్‌ సిసిరోలియో

నిర్మాత : సంస్కృతి ఫిలింస్

విడుదల తేదీ : 18–11–2022

రేటింగ్ : 3 / 5

జబర్దస్త్‌ కామెడీ షోతో బుల్లితెరకు పరిచయమై.. వెండితెరపై కూడా తన సత్తా చూపెట్టడానికి రెడీ అయ్యారు సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer). యాంకర్‌‌గా, మెజీషియన్‌గా, డాన్సర్‌‌గా, కమెడియన్‌గా మంచి పేరు తెచ్చుకున్న సుధీర్.. అడపాదడపా హీరోగా కూడా మెరుస్తున్నారు. పులిచర్ల రాజశేఖర్‌‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ ఎంటర్‌‌టైనర్‌ ‘గాలోడు’. గెహానా సిప్పీ హీరోయిన్‌గా నటించారు. సంస్కృతి ఫిలింస్‌ నిర్మించిన గాలోడు సినిమా శుక్రవారం విడుదలైంది.   

కథ ఏంటంటే?

పల్లెటూరిలో అల్లరి చిల్లరిగా తిరిగే కుర్రాడు రజినీకాంత్ అలియాస్ రాజు (సుడిగాలి సుధీర్). పేకాటలో జరిగిన చిన్న గొడవలో ఊరి సర్పంచ్ కొడుకుని కొడతాడు రాజు. దాంతో అతను మరణిస్తాడు. హత్య కేసు నుంచి బయటపడడానికి  హైదరాబాద్ వెళ్లిపోతాడు. అక్కడ శుక్లా (గెహానా సిప్పీ) అనే అమ్మాయిని ఆకతాయిల నుంచి కాపాడి, ఆ అమ్మాయి తండ్రి దగ్గర డ్రైవర్‌‌గా ఉద్యోగం సంపాదిస్తారు. ఇక తనతోనే ప్రేమలో పడతారు రాజు. అయితే పల్లెటూరిలో జరిగిన హత్య కేసులో రాజుని అరెస్టు చేస్తారు పోలీసులు. ఆ కేసు నుంచి రాజు ఎలా బయటపడ్డాడు? తనకు లాయర్ భాస్కర్ (సప్తగిరి) ఎలా హెల్ప్ చేశాడు అనేది సినిమా కథ.

బజర్దస్త్‌ కామెడీ షోతో పాపులర్ అయిన సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer) ప్రస్తుతం సినిమాల్లో హీరోగా నటిస్తున్నారు

ఎవరెలా నటించారంటే ?

గాలోడు సినిమాకు ఉన్న మెయిన్ అట్రాక్షన్ సుడిగాలి సుధీర్. యాక్షన్‌కు మాత్రమే ప్రాధాన్యం ఉన్న క్యారెక్టర్‌‌కు సుధీర్ న్యాయం చేశారు. లవ్‌ సీన్లలో కూడా బాగానే నటించారు. డాన్స్‌తో కూడా ఆకట్టుకునేందుకు ప్రయత్నించారు సుధీర్. సినిమా కథ మొత్తం సుధీర్ చుట్టూనే తిరగడంతో సినిమాలో వేరే క్యారెక్టర్లు ఉన్నాయనే విషయం మనకు గుర్తురాదు. ఇక, హీరోయిన్‌ గెహానా సిప్పీ తన అందంతో మెస్మరైజ్ చేస్తుంది. అయితే పాటల కోసమే సినిమాలో పెట్టినట్టు అనిపిస్తుంది. హీరోకు సహాయం చేసే పాత్రలో సప్తగిరి నటించారు. షకలక శంకర్‌‌ కామెడీ బాగానే పండింది.  

ఎలా ఉందంటే?

యాక్షన్ సినిమాలకు ఎప్పుడూ మార్కెట్ ఉంటుంది. అటువంటి మార్కెట్‌ను టార్గెట్‌ చేస్తూ గాలోడు సినిమాను తెరకెక్కించారు దర్శకుడు. సుడిగాలి సుధీర్ అనగానే కామెడీని ఎక్స్‌పెక్ట్‌ చేస్తారు ప్రేక్షకులు. సినిమా ఎంట్రీ సీన్‌ నుంచి సుధీర్‌‌ను హీరోగా ఎలివేట్‌ చేయడంపైనే ఎక్కువ శ్రద్ధ పెట్టారు దర్శకులు. దాంతో సుడిగాలి సుధీర్‌‌ కామెడీని ఎక్స్‌పెక్ట్‌ చేసి వచ్చిన ప్రేక్షకులు కొంచెం నిరుత్సాహపడతారు.

కథలో కొత్తదనం లేకపోవడం, రొటీవ్ లవ్ సీన్లతో ఫస్టాఫ్‌లో ప్రేక్షకులు బోర్ ఫీలవుతారు. అయితే సెకండాఫ్‌లో కథ ఆసక్తిగా మారుతుంది. యాక్షన్ సీన్లు కూడా బాగానే ఉన్నప్పటికీ అవసరానికి మించి ఉన్నాయని కొన్ని సీన్లతో అనిపిస్తుంది. క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్‌ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి.

ప్లస్ పాయింట్స్ : సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer) నటన, డాన్స్‌

మైనస్‌ పాయింట్స్ : రొటీన్‌ కథ కావడం  

ఒక్క మాటలో.. మాస్ ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం ‘గాలోడు’

Read More : Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ ఇంటికి కొత్త వారసుడు.. ఫ్యామిలీలో పండుగ వాతావరణం!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!