'పుష్ప 2' (Pushpa 2) కోసం 'అవతార్-2' (Avatar 2) ను వాడుకుంటున్న డైరెక్టర్ సుకుమార్.. గ్లింప్స్ విడుదల ఆరోజే!

Updated on Nov 13, 2022 10:42 AM IST
'పుష్ప ది రూల్' (Pushpa The Rule) షూటింగ్ ఇటీవలే హైద‌రాబాద్‌లో వేసిన భారీ సెట్‌లో ప్రారంభమైన సంగతి తెలిసిందే.
'పుష్ప ది రూల్' (Pushpa The Rule) షూటింగ్ ఇటీవలే హైద‌రాబాద్‌లో వేసిన భారీ సెట్‌లో ప్రారంభమైన సంగతి తెలిసిందే.

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), సుకుమార్ (Sukumar) కాంబోలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ 'పుష్ప ది రైజ్‌' (Pushpa The Rise). ఈ సినిమా సక్సెస్‌తో దానికి కొనసాగింపుగా రూపొందుతున్న ‘పుష్ప 2’ పై అంచనాలు భారీగా పెరిగాయి. అందుకు అనుగుణంగానే త్వరలో విడుదలకు సిద్ధంగా ఉన్న రెండవ భాగాన్ని అత్యున్నత సాంకేతిక ప్రమాణలతో తీర్చిదిద్దుతున్నట్లు తెలుస్తోంది. 

'పుష్ప ది రూల్' (Pushpa The Rule) షూటింగ్ ఇటీవలే హైద‌రాబాద్‌లో వేసిన భారీ సెట్‌లో ప్రారంభమైన సంగతి తెలిసిందే. దీనికి కొనసాగింపుగా కొన్ని స‌న్నివేశాల‌ను బ్యాంకాక్‌లోని అడ‌వుల్లో చిత్రీక‌రించ‌బోతున్నార‌ట‌. ఇప్పటికే అల్లు అర్జున్‌పై కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారట. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో బన్నీ లేని సన్నివేశాలను ప్రత్యేకంగా రూపొందించిన సెట్‌లో చిత్రీకరిసున్నారు. వ‌చ్చే ఏడాది డిసెంబ‌ర్‌లో 'పుష్ప 2' మూవీని విడుద‌ల చేయాల‌ని మేకర్స్ ప్లాన్‌ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామోరూన్ విజువల్ వండర్ 'అవతార్-2' (ది వే ఆఫ్ వాటర్) డిసెంబర్ 16న భారీ అంచనాల మధ్య ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఎన్నో ఏళ్ల నుంచి ఎదురుచూస్తోన్న ఘడియలు దగ్గరపడటంతో అభిమానుల్లో ఉత్కంఠ అంతకంతకు పెరిగిపోతోంది.

'పుష్ప 2' (Pushpa 2) సినిమా క్రేజ్‌ను మరింత పెంచేందుకు డిసెంబరు 16న విడుదల కానున్న ‘అవతార్‌ 2’ (Avatar 2) సినిమాతో పాటు ఈ చిత్ర గ్లింప్స్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రచార చిత్రాన్ని 'అవతార్ -2' తరహాలోనే వివిధ అంతర్జాతీయ భాషల్లో రిలీజ్ చేయాలని భావిస్తున్నారుట. ఇదే వేదికగా సినిమా రిలీజ్ తేదిని కూడా అధికారికంగా ప్రకటించాలని సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. 

ఇదే నిజమై.. ఈ గ్లింప్స్‌ విడుదలైతే ఇక, అభిమానులకు పండగే. ఇక, ఈ సినిమాలో అల్లు అర్జున్‌ సరసన రష్మిక మందన్నా (Rashmika Mandanna) కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు.   

Read More: రష్యాలో అలరించేందుకు సిద్దమైన 'పుష్ప'(Pushpa).. ప్రమోషన్లలో పాల్గొననున్న బన్నీ(Allu Arjun).. రిలీజ్ ఎప్పుడంటే?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!