ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న రామ్ పోతినేని (Ram Pothineni) ! నెట్టింట హల్‌చల్ చేస్తున్న వార్తలో నిజమెంతో?

Updated on Jun 27, 2022 02:57 PM IST
రామ్ పోతినేని
రామ్ పోతినేని

ప్రముఖ డైరెక్టర్, నిర్మాత వైవీఎస్ చౌదరి నిర్మించి, దర్శకత్వం వహించిన 'దేవదాసు' సినిమాతో టాలీవుడ్‌ ప్రేక్షకులకు హీరోగా పరిచయమయ్యాడు రామ్ పోతినేని (Ram Pothineni). లవర్‌‌ బాయ్‌ ఇమేజ్‌ సంపాదించుకున్న రామ్‌ త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నాడంటూ ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.

తన చిన్ననాటి క్లాస్‌మేట్‌తో లవ్‌లో ఉన్నాడని, కొన్నేళ్లుగా వీళ్లిద్దరూ ప్రేమించుకుంటున్నారని సమాచారం. తాజాగా ఇంట్లో వాళ్లను ఒప్పించి పెళ్లికి రెడీ అయ్యారని తెలుస్తోంది. రామ్‌ నటించిన ‘ది వారియర్‌’ మూవీ జూలై 14న రిలీజ్‌ కాబోతోంది.

త్వరలో ఎంగేజ్‌మెంట్!

‘ది వారియర్’ సినిమా విడుదలైన తర్వాత రామ్‌కు తన ప్రియురాలితో ఎంగేజ్‌మెంట్‌ జరగనుందని టాక్. ఈ మేరకు ఇదే విషయాన్ని అధికారికంగా కూడా ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. పెళ్లి కూడా ఇదే ఏడాది జరగబోతుందని సమాచారం. కాగా గతంలో రామ్‌ తన పెళ్లి గురించి స్పందిస్తూ 'అది మన చేతుల్లో ఉండదని, పెళ్లనేది జరగాల్సిన సమయంలో జరుగుతుందని' చెప్పారు.

ది వారియర్ సినిమా పోస్టర్

ఇప్పుడిక ఆ సమయం రానే వచ్చిందంటున్నారు ఫ్యాన్స్‌. అయితే కొందరు మాత్రం ఈ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని కొట్టిపారేస్తున్నారు. రామ్‌ పెళ్లి విషయంపై క్లారిటీ రావాలంటే అతడు స్పందించేవరకు వెయిట్‌ చేయాల్సిందే!

రామ్‌ నటించిన ది వారియర్‌ సినిమా తెలుగు, తమిళంలో రిలీజ్‌కు రెడీగా ఉంది. డైరెక్టర్‌ లింగుసామి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా తర్వాత రామ్‌ (Ram Pothineni).. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.

 Read More : Guinness Records: రివర్స్‌ స్క్రీన్‌ప్లే లవ్‌స్టోరీ ‘మనసానమ:’ (Manasanamaha) షార్ట్‌ ఫిల్మ్‌కు 513 అవార్డులు

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!