Most Trolled Telugu Movies : 2022లో అత్యధికంగా ట్రోల్ అయిన తెలుగు సినిమాలపై ప్రత్యేక కథనం..
Most Trolled Telugu Movies : 2022లో రిలీజ్ అయిన తెలుగు సినిమాలు చాలా తక్కువనే చెప్పాలి. ప్రతి ఏడాది వందల తెలుగు సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. ఈ ఏడాది కరోనా ఎఫెక్ట్‌తో పాటు పాన్ ఇండియా సినిమాల వల్ల చాలా తక్కువ సినిమాలు రిలీజ్ అయ్యాయి. 2022లో రిలీజ్ అయిన టాలీవుడ్ (Tollywood) సినిమాల్లో హిట్ కంటే డిజాస్టర్ చిత్రాలే ఎక్కువగా ఉన్నాయి. 'రాధేశ్యామ్'తో మొదలైన ప్లాపులు కొనసాగుతూనే ఉన్నాయి.
ఈ ఏడాది మొదట్లో చిరంజీవికి కూడా 'ఆచార్య' సినిమా భారీ ఫ్లాప్ ఇచ్చింది. ఈ ఏడాది రిలీజ్ అయిన ఫ్లాప్ సినిమాలపై నెటీజన్లు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేశారు. రకరకాల మీమ్స్‌ను పోస్ట్ చేశారు. 2022లో అత్యధిక మీమ్స్‌తో ట్రోల్ అయిన టాలీవుడ్ సినిమాలపై పింక్ విల్లా ప్రత్యేక కథనం..
రాధేశ్యామ్ - మాస్క్ మీమ్
'రాధే శ్యామ్' రోమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రంగా తెరకెక్కింది. ప్రభాస్, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా నటించారు. 2022 సంవత్సరంలో మొదటి డిజాస్టర్ భారీ బడ్జెట్ సినిమాగా 'రాధేశ్యామ్' నిలిచింది. 'రాధేశ్యామ్' సినిమా పోస్టర్‌లోని ప్రభాస్, పూజా హెగ్డేలకు మాస్క్ పెట్టి అస్సాం పోలీసులు ఓ ఫోటోను క్రియేట్ చేశారు. మీరు ప్రేమించే వారి కోసం మాస్క్ తప్పని సరిగా పెట్టుకోండంటూ 'రాధేశ్యామ్' మీమ్ సరదాగా వాడారు. ఈ మీమ్‌ను సినిమా రిలీజ్‌కు ముందు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
'రాధేశ్యామ్' సినిమా ఫ్లాప్ తరువాత నెటీజన్లు ఈ ఫోటోను విపరీతంగా ట్రోల్ చేశారు. ప్రభాస్ అభిమానులను 'రాధేశ్యామ్' నిరాశ పరిచింది. ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. 'ఆదిపురుష్', 'ప్రాజెక్ట్ కె', 'సలార్' చిత్రాలలో నటిస్తున్నారు డార్లింగ్.
ఆచార్య - చిరంజీవి యంగ్ లుక్‌పై మీమ్
మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య (Acharya) భారీ డిజాస్టర్‌గా మిగిలింది. ఈ సినిమాలో చిరంజీవి తన కుమారుడు రామ్ చరణ్‌తో కలిసి మొదటి సారి నటించారు . 'ఆచార్య' సినిమాను దర్శకుడు కొరటాల శివ చెత్తగా డైరెక్ట్ చేశారని చిరు అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెట్టారు.
'ఆచార్య' ఫ్లాప్‌పై కొందరు నెటీజన్లు ట్రోల్ చేశారు. అంతేకాదు రకరకాల మీమ్స్‌ను పోస్ట్ చేశారు. చిరంజీవి యువకుడిగా కనిపించే పాత్రపై చేసిన మీమ్స్ అప్పట్లో తెగ ట్రెండ్ అయింది. గ్రాఫిక్స్, యాప్ప్ వాడి చిరంజీవి ఫేస్‌ను యంగ్‌గా మార్చరంటూ నెటీజన్లు కామెంట్ చేశారు. రామ్ చరణ్ నటించన 'ఆర్ఆర్ఆర్' బ్లాక్ బాస్టర్ హిట్ కావడంతో 'ఆచార్య' ఎఫెక్ట్ చరణ్‌పై అంతగా పడలేదు.
లైగర్ - టైగర్ మీమ్
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ 'లైగర్' సినిమా కోసం చాలా కష్టపడ్డారు. విజయ్ సిక్స్ ప్యాక్తో పాటు మైక్ టైసన్ కోసం రెండేళ్ల పాటు తన బాడీ షేపింగ్‌పై ఫోకస్ పెట్టారు. 'లైగర్' సినిమా పాన్ ఇండియా లెవల్‌లో విడుదలై భారీ డిజాస్టర్‌గా నిలిచింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ తెరకెక్కలేదని.. బాలీవుడ్ దర్శక, నిర్మాత కరణ్ జోహార్ డైరెక్షన్ అంటూ తెలుగు ప్రేక్షకులు కామెంట్లు చేశారు. ఈ సినిమాపై రకరకాల ట్రోల్స్ చేశారు. ఓ మీమ్ మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచింది.
'లైగర్' పోస్టర్‌తో పాటు ఓ పులి కామెంట్ మీమ్ విపరీతంగా వైరల్ అయింది. "విజయ్ దేవరకొండ 'లైగర్' అయితే నేను సన్ని లియోన్‌నా" అంటున్న పులితో కూడిన మీమ్‌ను నెటీజన్లు తెగ ట్రోల్ చేశారు.
‘సన్నాఫ్ ఇండియా’ - సినిమా హాలు ఖాళీ అంటూ మీమ్
మోహన్ బాబు నటించిన ‘సన్నాఫ్ ఇండియా’ సినిమాను ముందు ఓటీటీలో విడుదల చేయాలని భావించారు. చివరకు థియేట్రికల్‌గా ఫిబ్రవరి 18న రిలీజ్ చేశారు. మోహన్ బాబు సొంతంగా ‘సన్నాఫ్ ఇండియా’ సినిమాను 350 థియేటర్స్‌లో రిలీజ్ చేసుకున్నారు. అయితే వందకు పైగా షోలు ప్రేక్షకులు లేక క్యాన్సిల్ అయ్యాయి. కొన్ని చోట్ల ‘సన్నాఫ్ ఇండియా’ సినిమా చూసేందుకు ప్రేక్షకులు లేక షోలు క్యాన్సిల్ అయ్యాయి.
'సన్ ఆఫ్ ఇండియా' చిత్రంపై సోషల్ మీడియాలో రకరకాల మీమ్స్ ప్రత్యక్షమయ్యాయి. జులాయి సినిమా డైలాగులను మార్చి మీమ్ పోస్ట్ చేశారు. ఓ సినిమాకు వెళితే... ఓ రో మొత్తం ఖాళీగా ఉందని అల్లు అర్జున్ అంటే... 'సన్ ఆఫ్ ఇండియా' సినిమాకు వెళ్లు మొత్తం హాలే ఖాళీగా ఉంటుందని తనికెళ్ల భరణి కామెంట్ చేసిన మీమ్ నెటీజన్లు ట్రోల్ చేశారు.
జిన్నా - అన్న అనుకుంటున్నాడు మీమ్
మంచు విష్ణు నటించిన సినిమా 'జిన్నా'పై నెటీజన్లు ట్రోల్స్ వర్షం కురిపించారు. బాక్సాఫీస్ వద్ద బోల్తా పడిన 'జిన్నా'పై సోషల్ మీడియాలో విపరీతంగా మీమ్స్‌ను పోస్ట్ చేశారు. 'జిన్నా' సినిమా థియేటర్లు ఖాళీగా కనిపించాయంటూ ట్రోల్స్ చేశారు. మంచు విష్ణు తనకు తాను హిట్ కొట్టాడని అనుకుంటాడనే మీమ్ అప్పట్లో వైరల్‌గా మారింది. 2022లో అత్యధికంగా మీమ్స్‌తో ట్రోల్ అయిన సినిమా 'జిన్నా'నే.
Read More: Telugu Music Video Songs: 2022లో అత్యధిక వ్యూస్ సాధించిన టాలీవుడ్ వీడియో సాంగ్స్..