మరో బంపర్ ఆఫర్‌‌ కొట్టేసిన కృతి శెట్టి (Krithi Shetty).. ధనుష్‌ సినిమాలో నటించనున్న బేబమ్మ

Updated on Jun 08, 2022 05:40 PM IST
ధనుష్‌, కృతి శెట్టి (Krithi Shetty)
ధనుష్‌, కృతి శెట్టి (Krithi Shetty)

సినిమా ఇండస్ట్రీలో కొంత మందికి చాలా త్వరగా గుర్తింపు వస్తుంది. మరికొంతమందికి ఆలస్యంగా క్రేజ్ వస్తుంది. రెండు మూడు సినిమాలతో వచ్చిన క్రేజ్‌తోనే మంచి సినిమాల్లో ఆఫర్లు కొట్టేస్తుంటారు కొందరు నటులు. అందులోనూ హీరోయిన్లకు అంత తొందరగా ఆఫర్లు రావడం కొంచెం కష్టమే. అయితే త్వరగా గుర్తింపు తెచ్చుకుని, స్టార్ హీరోల సినిమాల్లో మంచి ఆఫర్లు కొట్టేస్తున్న హీరోయిన్‌ కృతి శెట్టి (Krithi Shetty).

‘ఉప్పెన’ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది ‘కృతి శెట్టి’. తన అందం, అభినయంతో కుర్రకారు గుండెల్లో చోటు దక్కించుకుంది బేబమ్మ. అదృష్టాన్ని అరచేతిలో పెట్టుకుని ఇండస్ట్రీలోకి వచ్చింది కృతి. సౌత్‌లో వరుసగా సినిమాలు చేస్తూ బిజీబిజీగా ఉంది. ప్రస్తుతం కృతి శెట్టి చేతిలో ఆరు సినిమాలు ఉన్నాయి. తాజాగా మరో స్టార్ హీరో సినిమాలో యాక్ట్‌ చేసే చాన్స్‌ కొట్టిందని తెలుస్తోంది.

ది వారియర్ సినిమాలో కృతి శెట్టి (Krithi Shetty)

అరుణ్ మాతేశ్వర‌న్ ద‌ర్శక‌త్వంలో కోలీవుడ్ స్టార్ ధ‌నుష్ ఒక సినిమా చేయ‌బోతున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్‌గా కృతిశెట్టిని ఎంపిక చేసిన‌ట్లు కోలీవుడ్ వ‌ర్గాల స‌మాచారం. దీనిపై త్వర‌లోనే అధికారికంగా ప్రక‌ట‌న రానున్నట్టు తెలుస్తోంది. కాగా, ఇప్పటికే త‌మిళంలో హీరో సూర్య, డైరెక్టర్ బాల ప్రాజెక్ట్‌లో హీరోయిన్‌గా కృతి న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. తెలుగులో రామ్‌తో ‘ది వారియ‌ర్’, సుధీర్ బాబుకు జోడీగా ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’, నితిన్ స‌ర‌స‌న ‘మాచ‌ర్ల నియోజ‌కవ‌ర్గం’ సినిమాల‌లో న‌టిస్తోంది కృతి శెట్టి (Krithi Shetty). ఈ మూడు సినిమాల్లో ది వారియర్‌‌ సినిమా షూటింగ్‌ పూర్తి కాగా.. మిగిలిన రెండు సినిమాలు చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉన్నాయి.

Read More: మొన్న బుల్లెట్‌ పాట.. ఇవాళ ‘దడ దడ’ డ్యూయెట్‌తో సందడి చేస్తున్న రామ్‌ పోతినేని, కృతి శెట్టి

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!