మొన్న బుల్లెట్‌ పాట.. ఇవాళ ‘దడ దడ’ డ్యూయెట్‌తో సందడి చేస్తున్న రామ్‌ పోతినేని (Ram Pothineni), కృతి శెట్టి

Updated on Jun 04, 2022 06:55 PM IST
రామ్‌ పోతినేని (Ram Pothineni) ‘ది వారియర్’ సినిమా పోస్టర్
రామ్‌ పోతినేని (Ram Pothineni) ‘ది వారియర్’ సినిమా పోస్టర్

ఎనర్జిటిక్ స్టార్ రామ్‌ పోతినేని (Ram Pothineni) స్పీడ్‌గా సినిమాలు ఓకే చేస్తూ అదే జోరుతో షూటింగ్‌లను కూడా షురూ చేస్తున్నాడు. ఇప్పటికే రామ్‌ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి ‘ది వారియర్’. కృతి శెట్టి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయ్యింది. ఈ సినిమాను హైలెవెల్‌ టెక్నికల్ వ్యాల్యూస్‌తో తెరకెక్కించామని చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. కాగా, ఈ సినిమాలో రామ్‌ పవర్‌‌ఫుల్‌ పోలీసాఫీసర్‌‌గా కనిపించనున్నాడు. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన సింగిల్‌, ట్రైలర్‌‌కు రామ్‌ అభిమానులతోపాటు సినీ ప్రేమికులు కూడా ఫిదా అయ్యారు.

ది వారియర్ సినిమా నుంచి రిలీజైన ‘బుల్లెట్‌’ పాట యూట్యూబ్‌ను షేక్‌ చేస్తోందనే విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా నుంచి మరో సింగిల్‌ను చిత్ర యూనిట్‌ ఈరోజు విడుదల చేసింది. ‘దడ దడ’ అంటూ సాగుతున్న ఈ పాటకు దేవీ శ్రీ ప్రసాద్ అద్భుతమైన మ్యూజిక్ అందించాడు. త‌మిళ ద‌ర్శకుడు ఎన్‌.లింగుస్వామి ద‌ర్శక‌త్వం వ‌హించిన ది వారియర్‌‌ సినిమా పోస్ట్ ప్రొడ‌క్షన్ ప‌నులు వేగంగా జరుగుతున్నాయి.

రామ్‌ పోతినేని (Ram Pothineni) ‘ది వారియర్’ సినిమా పోస్టర్

ఆకట్టుకుంటున్న సాంగ్..

‘ద‌డ ద‌డ మ‌ని హృద‌యం శ‌బ్ధం’ అంటూ సాగుతున్న ఈ పాట సంగీత ప్రియులను ఆకట్టుకుంటోంది. శ్రీమ‌ణి సాహిత్యం అందించిన ఈ పాట‌ను హ‌రిచ‌ర‌ణ్ పాడాడు. మరో మెలోడీ ట్యూన్‌తో దేవీ శ్రీ ప్రసాద్ ప్రేక్షకులను మైమరిపించాడు. ఇప్పటికే చిత్రం నుంచి విడుద‌లైన ‘బుల్లెట్’ సాంగ్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పంద‌న వ‌చ్చింది. ఇప్పటివ‌ర‌కు బుల్లెట్‌ పాట నాలుగున్నర కోట్ల వ్యూస్‌ను సాధించింది. ఇక, ది వారియర్ సినిమాలో విలన్‌గా ఆది పినిశెట్టి నటించాడు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ సినిమా జూలై 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.  

ది వారియర్ సినిమా విడుదలకు రెడీ కావడంతో త్వరలో మరో సినిమా షూటింగ్‌ను పట్టాలెక్కించబోతున్నాడు రామ్. మరో సినిమా ప్రస్తుతం చర్చల దశలో ఉన్నట్టు తెలుస్తోంది. కొంతకాలంగా వరుస ఫ్లాప్‌లతో ఇబ్బంది పడుతున్న రామ్‌కు ‘ఇస్మార్ట్ శంకర్‌‌’ సినిమా బ్రేక్ ఇచ్చింది. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో రామ్‌ మాస్ క్యారెక్టర్‌‌లో మెప్పించి మాస్ ఆడియన్స్‌కు దగ్గరయ్యాడు. మాస్ ఆడియన్స్‌కు మరింత దగ్గరయ్యేందుకు రెడ్‌ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు రామ్‌ (Ram Pothineni). ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి టాక్‌నే సొంతం చేసుకుంది.

Read More: ది వారియ‌ర్ - వంద‌ల‌ మంది డ్యాన్స‌ర్లు, మోడ‌ల్స్‌తో స్టెప్పులేయ‌నున్న రామ్

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!