Sai Dharam Tej: జోరు పెంచిన స్టార్ కథానాయకుడు సాయిధరమ్ తేజ్.. మరో సినిమాకు సుప్రీం హీరో శ్రీకారం..!

Updated on Dec 02, 2022 06:17 PM IST
సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) మరో కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టారు. జయంత్ పనుగంటి ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు
సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) మరో కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టారు. జయంత్ పనుగంటి ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు

సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) మళ్లీ జోరు పెంచారు. బైక్ యాక్సిడెంట్‌లో తీవ్రంగా గాయపడిన తర్వాత పూర్తిగా కోలుకున్న సాయి తేజ్.. వరుసగా సినిమాలను లైన్‌లో పెడుతున్నారు. ఇప్పటికే కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్న ఆయన.. ఇప్పుడు మరో ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఇది సాయిధరమ్ తేజ్‌కు 15వ సినిమా. ఇంకా టైటిల్ ఖరారు కాలేదు. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. సుకుమార్‌ రైటింగ్స్ నిర్మిస్తున్న ఈ సినిమా.. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది. 

పదిహేనో సినిమా సెట్స్ మీద ఉండగానే సాయి తేజ్ మరో చిత్రాన్ని ప్రారంభించారు. జయంత్ పనుగంటి డైరెక్షన్‌లో పదహారో సినిమాను ఆయన చేయనున్నారు. తాజాగా ఈ మూవీ హైదరాబాద్‌లో గ్రాండ్‌గా లాంచ్ అయింది. ఈ సినిమాను కూడా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి. ఇక ఇదే బ్యానర్‌లో సాయిధరమ్ తేజ్ గతంలో ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా చేశారు. ఈ మూవీ కమర్షియల్‌గా మంచి సక్సెస్ సాధించింది. 

ఇకపోతే, ‘పిల్లా నువ్వులేని జీవితం’ వంటి బ్లాక్‌బస్టర్‌ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సాయిధరమ్‌.. ‘సుబ్రహ్మణ్యం ఫర్‌ సేల్‌’, ‘సుప్రీమ్‌’, ‘చిత్రలహరి’ లాంటి చిత్రాలతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. గతేడాది ఆయన నటించిన ‘రిపబ్లిక్‌’ మూవీ రిలీజై యావరేజీగా నిలిచింది. విమర్శకులు ఈ చిత్రంపై ప్రశంసలు కురిపించారు. అయినా కమర్షియల్‌గా అంతగా సక్సెస్ కాలేదు. థియేటర్లలో అంతగా ఆదరణకు నోచుకోని ఈ సినిమాకు.. ఓటీటీలో మాత్రం మంచి వ్యూస్ దక్కాయి. ఇక నెక్స్ట్ మిస్టరీ థ్రిల్లర్ సినిమాతో ఆయన ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతున్నారు. ఈ చిత్రం టీజర్ త్వరలో విడుదల కానుందని తెలుస్తోంది. 

Read more: Shriya Saran: ఆ వ్యాధి బాధపెడుతున్నా రాజమౌళి (SS Rajamouli) షూట్ ఆపలేదు!.. జక్కన్నపై హీరోయిన్ శ్రియ ప్రశంసలు

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!