నాని (Nani) హీరోగా తెరకెక్కుతున్న ‘దసరా’ యాక్షన్‌ సినిమా కాదా? పక్కా లవ్‌స్టోరీ అని ఇండస్ట్రీ టాక్

Updated on Jul 27, 2022 06:31 PM IST
నేచురల్ స్టార్ నాని (Nani) హీరోగా తెరకెక్కుతున్న దసరా సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్
నేచురల్ స్టార్ నాని (Nani) హీరోగా తెరకెక్కుతున్న దసరా సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్

నేచురల్ స్టార్ నాని (Nani) నటించిన ‘అంటే సుందరానికీ’ సినిమా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది. అయితే ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకులను నిరాశపరిచినప్పటికీ.. ఓటీటీలో మాత్రం మంచి టాక్‌ను దక్కించుకుంది. ‘అంటే సుందరానికీ’ సినిమా ఫలితాన్ని ఏ మాత్రం పట్టించుకోకుండా తర్వాతి సినిమా షూటింగ్‌లో బిజీ అయ్యారు నాని. ప్రస్తుతం నాని ‘దసరా’ సినిమాలో నటిస్తున్నారు.

స్టార్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్‌ ఓదెల దసరా సినిమాను తెరకెక్కిస్తున్నారు. కెరీర్‌‌లో ఎప్పుడూ కనిపించనంత కొత్తగా నాని ఈ సినిమాలో చూపించనున్నారని ఇండస్ట్రీ టాక్. నానితో ఫస్ట్‌ టైమ్‌ తెలంగాణ యాసలో డైలాగ్స్ చెప్పిస్తున్నారు దర్శకుడు. ఇప్పటికే రిలీజైన నాని ఫస్ట్‌ లుక్ సినిమాపై అంచనాలను పెంచేసింది. మాస్‌ లుక్‌లో ఉన్న నాని పోస్టర్‌‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

నేచురల్ స్టార్ నాని (Nani) హీరోగా తెరకెక్కుతున్న దసరా సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్

నాని – కీర్తి కాంబోలో రెండో సినిమా..

నాని(Nani)  సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ‘నేను లోకల్’ సినిమా తర్వాత కీర్తి – నాని కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న రెండో సినిమా ‘దసరా’. దాంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 

ఇక ‘దసరా’ సినిమా కథపై ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. నాని మాస్ గెటప్, మేకోవర్‌‌ చూసి యాక్షన్ సినిమా అని అందరూ అనుకుంటున్నారు. అయితే ఇదొక పక్కా లవ్ స్టోరీ అని ఇండస్ట్రీ టాక్. ప్రేమకథల్ని వైవిధ్యంగా తెరకెక్కించడంలో దర్శకుడు సుకుమార్ ఎక్స్‌పర్ట్‌. ఆ దారిలోనే అతని శిష్యులు కూడా నడిచారు.

‘కుమార్ 21 ఎఫ్’ సినిమాతో సూర్య ప్రతాప్ పల్నాటి, ‘ఉప్పెన’ సినిమాతో బుచ్చిబాబు సానా లవ్ స్టోరీల్లో కొత్తదనాన్ని చూపించి సూపర్ హిట్‌ సినిమాలను తెరకెక్కించారు. ఈ నేపథ్యంలో శ్రీకాంత్ ఓదెల రాసుకొన్న దసరా కథాంశం కూడా ప్రేక్షకుల్ని మెప్పిస్తుందని ఇండస్ట్రీ టాక్. ఇది ‘కోటలో రాణి తోటలో రాజు’ లాంటి ప్రేమకథ అని సమాచారం. 

రెండు జోనర్లలో..

హీరో మురికివాడలో ఉంటాడు. హీరోయిన్ కోటలాంటి ఇంటిలో ఉంటుందట. వారిద్దరి మధ్య ప్రేమ ఎలా పుట్టింది? అనేది ఎంతో ఆసక్తికరంగా ఉంటుందట. పోస్టర్స్, నాని గెటప్ చూసి యాక్షన్ సినిమాగా భావించినా.. దసరా సినిమాలలో లవ్ స్టోరీ గమ్మత్తుగా ఉంటుందని, అదే సినిమాకి హైలైట్ అని టాక్. యాక్షన్ సినిమాలు, లవ్ స్టోరీల్లో నటించడం నానికి కొత్తకాదు. అయితే ఈ రెండు జోనర్స్‌ను మిక్స్ చేస్తూ శ్రీకాంత్ తెరకెక్కిస్తున్న ‘దసరా’ సినిమా నాని (Nani) కెరీర్‌‌లో వెరైటీ సినిమాగా నిలుస్తుందని నిర్మాతలు చెబుతున్నారు. 

Read More : రవితేజకు (Ravi Teja) చిరంజీవి స్ఫూర్తి .. నాకు రవితేజ స్ఫూర్తి: ‘రామారావు ఆన్ డ్యూటీ’ ప్రీ రిలీజ్​లో నాని (Nani)

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!