ఓటీటీ ప్లాట్ ఫామ్ లాక్ చేసుకున్న అడివి శేష్ (Adivi Sesh) తాజా చిత్రం ‘హిట్ 2’ (Hit 2).. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Updated on Dec 03, 2022 12:54 PM IST
రాబోయే రోజుల్లో ‘హిట్’మూవీల పరంపరం కొనసాగే అవకాశం ఉంది. 'హిట్ 2' (Hit 2) మూవీ క్లైమాక్స్‌లో 'హిట్ 3'పై దర్శకుడు ఓ హింట్ కూడా ఇచ్చాడు.
రాబోయే రోజుల్లో ‘హిట్’మూవీల పరంపరం కొనసాగే అవకాశం ఉంది. 'హిట్ 2' (Hit 2) మూవీ క్లైమాక్స్‌లో 'హిట్ 3'పై దర్శకుడు ఓ హింట్ కూడా ఇచ్చాడు.

టాలీవుడ్‌లో క్రైమ్ థ్రిల్లర్ సస్పెన్స్ మూవీగా తెరకెక్కిన తాజా చిత్రం ‘హిట్ 2’ (Hit 2). శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ సినిమా 2020లో ఆయనే తెరకెక్కించిన హిట్ చిత్రానికి సీక్వెల్‌గా వచ్చింది. అడివి శేష్ (Adivi Sesh) హీరోగా నటించిన ఈ మూవీ తాజాగా థియేటర్లలో విడుదలై పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. 

అడవి శేష్‌కి జంటగా ఈ మూవీలో మీనాక్షి చౌదరి (Meenakshi Chowdary) నటించగా.. రావు రమేశ్, పోసాని కృష్ణ మురళి, తణికెళ్ల భరణి తదితరులు నటించారు. శ్రీనాథ్ మాగంటి, రావు రమేష్, కోమలి ప్రసాద్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. నాచురల్ స్టార్ నాని సమర్పణలో వాల్ బోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి త్రిపిరనేని ఈ చిత్రాన్ని నిర్మించారు.

ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ (Amazon Prime Video) 'హిట్ 2' (Hit 2) చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు దక్కించుకున్నట్లు తెలుస్తోంది.

ఈ చిత్రం విడుదలకు ముందే డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు మంచి రేటుకు అమ్ముడయ్యాయి. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ (Amazon Prime Video) 'హిట్ 2' చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. టీజర్, ట్రైలర్ తో పాటు ప్రమోషన్స్ తో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. పైగా, రివ్యూలు కూడా పాజిటివ్ గానే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని ఓటీటీలో చూడాలంటే కనీసం నెల రోజులైనా ఎదురు చూడాల్సి ఉంది.

ఇదిలా ఉంటే.. రాబోయే రోజుల్లో ‘హిట్’మూవీల పరంపరం కొనసాగే అవకాశం ఉంది. 'హిట్ 2' మూవీ క్లైమాక్స్‌లో 'హిట్ 3'పై దర్శకుడు ఓ హింట్ కూడా ఇచ్చాడు. ఈ సినిమాకి సమర్పకుడిగా ఉన్న హీరో నాని ‘హిట్ 3’ సినిమాలో హీరోగా చేయబోతున్నట్లు ఓ సీన్ పెట్టాడు. అది కూడా చాలా క్రూరమైన పోలీస్ ఆఫీసర్‌గా నాని కనిపించబోతున్నట్లు సంకేతమిచ్చాడు. వచ్చే ఏడాది 'హిట్ 3' రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.

Read More: 'హిట్' (Hit) మూవీ సిరీస్ లో నటించనున్న సమంత (Samantha).. అడివి శేష్ (Adivi Sesh) ఏమన్నారంటే..?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!