విజయ్‌ ఆంటోనీ (Vijay Antony) హీరోగా తెరకెక్కిన ‘హత్య’ సినిమా ట్రైలర్ లాంచ్ చేయనున్న నేచురల్ స్టార్ నాని (Nani)

Updated on Aug 15, 2022 04:55 PM IST
విజయ్‌ ఆంటోనీ (Vijay Antony) హీరోగా తెరకెక్కిన ‘హత్య’ సినిమా ట్రైలర్‌‌ను నేచురల్ స్టార్ నాని (Nani) లాంచ్ చేస్తారు
విజయ్‌ ఆంటోనీ (Vijay Antony) హీరోగా తెరకెక్కిన ‘హత్య’ సినిమా ట్రైలర్‌‌ను నేచురల్ స్టార్ నాని (Nani) లాంచ్ చేస్తారు

బిచ్చగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు విజయ్ ఆంటోనీ (Vijay Antony). ఆ సినిమా సూపర్‌‌హిట్ సాధించింది. బిచ్చగాడు సినిమా తర్వాత విజయ్ ఆంటోనీ నటించిన పలు సినిమాలు తెలుగులో రిలీజ్ అయినప్పటికీ ఆ రేంజ్‌లో విజయం సాధించలేదు. తాజాగా ఆంటోనీ నటించిన సినిమా హత్య.

బాలాజీ కే కుమార్ దర్శకత్వంలో డెత్ మిస్టరీ నేపథ్యంలో హత్య సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో ఖిలాడీ హీరోయిన్ మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించారు. కాగా, హత్య సినిమా ట్రైలర్‌‌ మంగళవారం రిలీజ్ కాబోతోంది. ఈ ట్రైలర్‌‌ను నేచురల్ స్టార్ నాని (Nani) విడుదల చేయనున్నారు. ఇన్ఫినిటీ ఫిలిం వెంచర్స్‌ అండ్ లోటస్ పిక్చర్స్‌ సంయుక్తంగా హత్య సినిమాను తెరకెక్కిస్తున్నాయి. కొన్నాళ్లుగా సరైన హిట్‌ కోసం ఎదురుచూస్తున్న విజయ్ ఆంటోనీ ‘హత్య’ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నారు. 

విజయ్‌ ఆంటోనీ (Vijay Antony) హీరోగా తెరకెక్కిన ‘హత్య’ సినిమా ట్రైలర్‌‌ను నేచురల్ స్టార్ నాని (Nani) లాంచ్ చేస్తారు

మరో రెండు సినిమాల్లో కూడా..

 

హత్య సినిమాకు గిరీష్ మ్యూజిక్ కంపోజ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఈ సినిమాలో రితికా సింగ్‌, రాధికా శ‌ర‌త్ కుమార్, ముర‌ళీ శ‌ర్మ, జాన్ విజ‌య్, సంకిత్ బొహ్రా కీల‌క పాత్రల్లో న‌టిస్తున్నారు. విజ‌య్ ఆంటోనీ (Vijay Antony) ప్రస్తుతం బిచ్చగాడు2 సినిమాతోపాటు మరో రెండు సినిమాల షూటింగ్‌ల్లో బిజీబిజీగా ఉన్నారు.  

కాగా, నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం దసరా సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నారు. నాని (Nani) నటించిన అంటే సుందరానికీ సినిమా ఇటీవలే రిలీజై మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. నజ్రియా హీరోయిన్‌గా నటించిన అంటే సుందరానికీ సినిమా లవ్ ఎంటర్‌‌టైనర్‌‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Read More : కామన్ మ్యాన్ నుంచి నేచురల్ స్టార్ వరకు 'ఓ సుదీర్ఘ ప్రయాణం'.. నాని (Nani) నటించిన టాప్‌ టెన్ సినిమాలు ఇవే !

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!