విషాదంలో సూపర్ స్టార్ కుటుంబం.. మహేష్ బాబు (Mahesh Babu) తల్లి ఇందిరాదేవి కన్నుమూత !

Updated on Sep 28, 2022 01:35 PM IST
మ‌హేష్‌ (Mahesh Babu) కు తల్లి అంటే ప్రాణ‌మ‌ని అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. త‌ల్లి ఇందిరాదేవి త‌న‌కు దైవంతో స‌మాన‌మ‌ని మ‌హేష్ బాబు అంటుండేవారు.
మ‌హేష్‌ (Mahesh Babu) కు తల్లి అంటే ప్రాణ‌మ‌ని అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. త‌ల్లి ఇందిరాదేవి త‌న‌కు దైవంతో స‌మాన‌మ‌ని మ‌హేష్ బాబు అంటుండేవారు.

టాలీవుడ్ స్టార్ హీరో మ‌హేష్ బాబు (Mahesh Babu) త‌ల్లి, సూపర్‌స్టార్‌ కృష్ణ సతీమణి ఇందిరాదేవి తుదిశ్వాస విడిచారు. 70 ఏళ్ల ఇందిరా దేవి కొంత కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నారు. ఈ రోజు తెల్ల‌వారుజామున ఆమె క‌న్నుమూశారు. ఇందిరాదేవి మరణంతో కృష్ణ కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి.

మ‌హేష్‌ బాబుకు తన తల్లి అంటే ప్రాణ‌మ‌నేది అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. త‌ల్లి ఇందిరాదేవి త‌న‌కు దేవుడితో స‌మాన‌మ‌ని మ‌హేష్ బాబు అంటుండేవారు. మ‌హేష్ త‌న త‌ల్లి గురించి ప్ర‌త్యేకంగా సోష‌ల్ మీడియాలో పోస్టులు పెట్టి మరీ త‌న ప్రేమ‌ను చాటుకునేవారు. ఇందిరా దేవి మ‌ర‌ణంతో మ‌హేష్ బాబు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. 

అనారోగ్యంతో ఇందిరా దేవి మృతి

సూప‌ర్ స్టార్ కృష్ణ డిగ్రీ పూర్తైన వెంటనే న‌ట‌న‌పై ఉన్న ఇష్టంతో మద్రాసు వెళ్లారు. 1965 వ సంవ‌త్స‌రంలో కృష్ణ‌ 'తేనె మనసులు' అనే సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ సంవత్సరమే కృష్ణ ఇందిరా దేవిని వివాహం చేసుకున్నారు. వీరి వివాహానికి పలువురు సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు.

మ‌హేష్‌ (Mahesh Babu)కు తల్లి అంటే ప్రాణ‌మ‌నేది అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. త‌ల్లి ఇందిరాదేవి త‌న‌కు దైవంతో స‌మాన‌మ‌ని మ‌హేష్ బాబు అంటుండేవారు.

కృష్ణ,ఇందిరాదేవి దంప‌తుల‌కు ఐదుగురు సంతానం. కుమారులు రమేష్‌బాబు, మహేష్‌బాబు (Mahesh Babu). కుమార్తెలు పద్మావతి, మంజుల, ప్రియదర్శిని ఉన్నారు. భ‌ర్త‌తో పాటు పిల్ల‌ల‌ను ఎంతో ప్రేమ‌గా చూసుకునేవారు ఇందిరాదేవి. పెద్దకుమారుడు రమేష్‌బాబు అనారోగ్యంతో ఇటీవ‌ల‌ క‌న్నుమూశారు. ఇప్పుడు ఇందిరా దేవి మృతితో కృష్ణ కుటుంబంలో తీవ్ర విషాదం నెల‌కొంది. అనారోగ్యంతో ఏఐజీ ఆస్ప‌త్రిలో చేరిన ఇందిరా దేవి ఈరోజు ఉద‌యం 4 గంట‌ల‌కు తుది శ్వాస విడిచారు.

ఇందిరా దేవీ అంత్య‌క్రియలు

ఇందిరాదేవి పార్థివ దేహాన్నిమధ్యాహ్నం 12 00 గంటల వరకు పద్మాలయ స్టూడియోలో ఉంచుతారు. ఆ త‌రువాత జూబ్లీహిల్స్‌‌లోని మహా ప్రస్థానంలో అంతిమ సంస్కారాలు నిర్వహిస్తారు. ఇందిరా దేవిని క‌డ‌సారి చూసేందుకు ప‌లువురు సినీ ప్ర‌ముఖులు.. కృష్ణ, మ‌హేష్ బాబు (Mahesh Babu) అభిమానులు త‌ర‌లివ‌స్తున్నారు.

Read More: కూతురు సితార (Sitara) కు సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) డాటర్స్ డే శుభాకాంక్షలు.. ఫొటో వైరల్!

Advertisement
Credits: Twitter

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!