మ‌హేశా (Mahesh Babu).. ఎంత స్టైలిష్‌గా ఉన్నావ్! యాడ్స్ కోసం ప్రిన్స్ కొత్త లుక్

Updated on Sep 20, 2022 10:42 AM IST
ప్ర‌స్తుతం మ‌హేష్ బాబు (Mahesh Babu) స్టైలిష్‌గా కనిపించే ఫోటోలు సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. 
ప్ర‌స్తుతం మ‌హేష్ బాబు (Mahesh Babu) స్టైలిష్‌గా కనిపించే ఫోటోలు సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. 

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు (Mahesh Babu) ను అభిమానులు ప్రిన్స్ అని పిలుస్తారు. 'స‌ర్కారు వారి పాట' బ్లాక్ బాస్ట‌ర్ హిట్‌తో మ‌హేష్ బాబు త‌న ఫాలోయింగ్ మ‌రింత పెంచుకున్నారు. ఈ సినిమాలో మ‌హేష్ లుక్ అదిరిపోయింది. అస‌లు 'స‌ర్కారు వారి పాట‌'లో మ‌హేష్ బాబు స్టైలిష్ లుక్ సినిమాకు ప్ల‌స్ అయింది. ఇలాగే త‌రువాతి సినిమాల్లో కూడా మ‌హేష్ బాబు మ‌రింత అందంగా క‌నిపించ‌నున్నార‌ట. ప్ర‌స్తుతం మ‌హేష్ బాబు స్టైలిష్‌గా కనిపించే ఫోటోలు సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. 

మ‌హేష్ లుక్ అదుర్స్

ప్ర‌స్తుతం మ‌హేష్ బాబు (Mahesh Babu) ప‌లు బ్రాండ్ల‌కు సంబంధించిన యాడ్స్‌లో న‌టిస్తున్నారు. త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న 'ఎస్ఎస్ఎంబి 28' చిత్రంలో మ‌హేష్ న‌టిస్తున్నసంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో మ‌హేష్ యంగ్ లుక్‌లో ద‌ర్శ‌న‌మిచ్చారు. ప్రిన్స్ ఈ సినిమా షూటింగ్‌తో పాటు.. వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల్లో కూడా న‌టిస్తున్నారు. మ‌హేష్ బాబు యాడ్ ఫోటోలు సోష‌ల్ మీడియాలో రిలీజ్ చేశారు. ఆ ఫోటోలు చూసిన అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. సోష‌ల్ మీడియాలో తెగ షేర్ చేస్తూ మురిసిపోతున్నారు. 

ప్ర‌స్తుతం మ‌హేష్ బాబు (Mahesh Babu) స్టైలిష్‌గా కనిపించే ఫోటోలు సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. 

మ‌హేష్ త‌న 29 వ సినిమాను రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో చేయనున్నారు. 'ఎస్ఎస్ఎంబి 29'  సినిమాకు సంబంధించిన  స్క్రిప్ట్ వ‌ర్క్ పకడ్బందీగా జ‌రుగుతోందని స‌మాచారం. ఈ సినిమా వ‌చ్చే ఏడాది సెట్స్‌పైకి వెళ్ల‌నుంది. ఈ సినిమాకు రాజ‌మౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథను అందిస్తున్నారు. అలాగే రాజ‌మౌళి సోద‌రుడు కీరవాణి సంగీతాన్ని సమకూర్చనున్నారు.

Read More: త్రివిక్ర‌మ్ సినిమా కోసం మ‌హేష్ (Mahesh Babu) హార్డ్ వ‌ర్క్.. మ‌రో నాలుగు రోజుల్లో 'ఎస్ఎస్ఎంబి 28' షూటింగ్

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!