కూతురు సితార (Sitara) కు సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) డాటర్స్ డే శుభాకాంక్షలు.. ఫొటో వైరల్!

Updated on Sep 25, 2022 09:32 PM IST
సూపర్ స్టార్ ఫ్యాన్స్ మహేష్ బాబు (Mahesh Babu) కు తన కూతురు పై ఉన్న ప్రేమ, అభిమానాన్ని ఈ ఫోటోలో చూడవచ్చంటూ కామెంట్స్ చేస్తూ ఉన్నారు.
సూపర్ స్టార్ ఫ్యాన్స్ మహేష్ బాబు (Mahesh Babu) కు తన కూతురు పై ఉన్న ప్రేమ, అభిమానాన్ని ఈ ఫోటోలో చూడవచ్చంటూ కామెంట్స్ చేస్తూ ఉన్నారు.

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) తన గారాలపట్టి సితారపై (Sitara) మరోసారి ప్రేమను చాటుకున్నారు. నేడు డాటర్స్ డే సందర్భంగా సోషల్ మీడియాలో ఓ బ్యూటిఫుల్ ఫోటోను షేర్ చేశారు. ఈ ఫోటోలో మహేష్ బాబు లుక్ ఇంకా ఆయన కూతురు క్యూట్ స్మైల్ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. “నా ప్రపంచాన్ని ఎల్లప్పుడూ ప్రకాశవంతం చేసే నా చిన్నారి సితార ఘట్టమననేనికి డాటర్స్ డే శుభాకాంక్షలు” అని వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు పెట్టారు.

ఇక, ఈ ఫొటోను చూసిన సూపర్ స్టార్ ఫ్యాన్స్ మహేష్ బాబు (Mahesh Babu) కు తన కూతురు పై ఉన్న ప్రేమ, అభిమానాన్ని ఈ ఫోటోలో చూడవచ్చంటూ చాలా మంది కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ఆయనకు తన కూతురు సితార అంటే ఎంత ఇష్టమో ఈ ఫోటో చూస్తే మరోసారి నిరూపితమవుతుందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
 
కాగా, కొద్ది రోజులుగా పలు టీవీ షోలలోనూ మహేష్ బాబు, సితార (Mahesh Babu-Sitara) ఇద్దరూ కలిసి వెళ్తున్నారు. అటు తండ్రితో కలిసి చేసిన అల్లరిని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అప్ డేట్ చేస్తుంది సితార. దీంతో తాజాగా మహేష్ బాబు పోస్టుకు నెటిజన్లు భారీగా రెస్పాండ్ అవుతున్నారు.

ఇక మహేష్ బాబు సినిమాల విషయానికి వస్తే.. ఇప్పటికే త్రివిక్రమ్ (Director Trivikram) సినిమాను మొదలుపెట్టారు. ఇటీవలే ఒక షెడ్యూల్ ను కూడా ముగించారు. త్వరలోనే రెండవ షెడ్యూల్ ప్రారంభం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా సమాచారం అందుతోంది. 

మహేశ్ బాబు-త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో పూజా హెగ్డే (Pooja Hegde) కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రానికి తాత్కాలికంగా SSMB28 అని పేరు పెట్టారు. ఇక, ఈ సినిమాలో 'బింబిసార' ఫేమ్ సంయుక్తా మీనన్ (Samyuktha Menen) నటిస్తుండగా.. ఈ భారీ ప్రాజెక్ట్ 2023 సంక్రాంతికి థియేటర్లలో సందడి చేయనున్నట్లు తెలుస్తోంది.

Read More: జీ తెలుగులో (Zee Telugu) కొత్త సీరియల్స్.. ప్రమోషన్స్ లో పాల్గొన్న మహేష్ బాబు-సితార స్పెషల్ ప్రోమో రిలీజ్..!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!