మ‌హేష్ బాబు (Mahesh Babu) సినిమా 'ఎస్ఎస్ఎంబి 28' కొత్త అప్‌డేట్.. మ‌హేష్ లుక్ కేక అంటున్న ఫ్యాన్స్

Updated on Sep 21, 2022 07:42 PM IST
'స‌ర్కారు వారి పాట' సినిమా త‌ర్వాత మ‌హేష్ బాబు (Mahesh Babu) న‌టించ‌బోయే 'ఎస్ఎస్ఎంబి 28' పై భారీ అంచానాలు ఏర్పాడ్డాయి.
'స‌ర్కారు వారి పాట' సినిమా త‌ర్వాత మ‌హేష్ బాబు (Mahesh Babu) న‌టించ‌బోయే 'ఎస్ఎస్ఎంబి 28' పై భారీ అంచానాలు ఏర్పాడ్డాయి.

టాలీవుడ్ సూపర్ స్టార్  మ‌హేష్ బాబు (Mahesh Babu), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న తాజా సినిమా 'SSMB 28' . ఈ సినిమాలో మహేష్ బాబు రెండు విభిన్న పాత్ర‌ల‌లో న‌టిస్తున్నార‌ట‌. ఎస్ఎస్ఎంబి 28 సినిమా మొద‌టి షెడ్యూల్ పూర్త‌యింది. ఈ సినిమాకు సంబంధించిన రెండో షెడ్యూల్ ద‌స‌రా త‌రువాత ప్రారంభం కానుంది.

మ‌హేష్ బాబు, పూజ హెగ్డే 'ఎస్ఎస్ఎంబి 28' సినిమాలో హీరో  హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ శ్రీలీల కూడా న‌టిస్తున్నార‌ని స‌మాచారం. మ‌రోవైపు మ‌హేష్ బాబు కొత్త లుక్స్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. 

నెక్ట్స్ షెడ్యూల్ ఎప్ప‌డంటే..

'ఎస్ఎస్ఎంబి 28' సినిమా యాక్ష‌న్ సీన్లు, పాట‌లు చిత్రీక‌రించార‌ట‌. ఇక మ‌హేష్ బాబు (Mahesh Babu) లుక్‌ను కొత్త‌గా చూపించ‌నున్నార‌ట‌. మ‌హేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన 'అత‌డు', 'ఖ‌లేజా' బ్లాక్ బాస్ట‌ర్ హిట్స్ సాధించాయి. ఇక ఈ సినిమాతో హాట్రిక్ కొట్ట‌డం ప‌క్కా అంటున్నారు పిన్స్ అభిమానులు.

'స‌ర్కారు వారి పాట' సినిమా త‌ర్వాత మ‌హేష్ బాబు న‌టించ‌బోయే 'ఎస్ఎస్ఎంబి 28' పై భారీ అంచానాలు ఏర్పాడ్డాయి. ఈ చిత్రాన్ని హారికా అండ్‌ హాసిని బ్యానర్ పై రూపొందిస్తున్నారు. నిర్మాతగా ఎస్‌.రాధాకృష్ణ(చినబాబు) వ్యవహరిస్తున్నారు. 

రాజ‌మౌళితో మ‌రో సినిమా

మ‌హేష్ త‌న 29 వ సినిమాను రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో చేయనున్నారు. 'ఎస్ఎస్ఎంబి 29'  సినిమాకు సంబంధించిన  స్క్రిప్ట్ వ‌ర్క్ పకడ్బందీగా జ‌రుగుతోందని స‌మాచారం. ఈ సినిమా వ‌చ్చే ఏడాది సెట్స్‌పైకి వెళ్ల‌నుంది. ఈ సినిమాకు రాజ‌మౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథను అందిస్తున్నారు. అలాగే రాజ‌మౌళి సోద‌రుడు కీరవాణి సంగీతాన్ని సమకూర్చనున్నారు.

Read More: మ‌హేశా (Mahesh Babu).. ఎంత స్టైలిష్‌గా ఉన్నావ్! యాడ్స్ కోసం ప్రిన్స్ కొత్త లుక్

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!