‘SSMB28’: మహేష్ బాబు-త్రివిక్రమ్ కాంబోలో మూవీ.. ఫస్ట్ లుక్ కోసం ముహూర్తం ఖరారు?

Updated on Jun 26, 2022 06:53 PM IST
మహేష్ బాబు మూవీ పోస్టర్ (SSMB Movie Poster)
మహేష్ బాబు మూవీ పోస్టర్ (SSMB Movie Poster)

Mahesh Babu-Trivikram: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘సర్కారు వారి పాట’ సినిమా ఇటీవలే గ్రాండ్ గా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.  ప్ర‌స్తుతం ఆయన ‘స‌ర్కారు వారి పాట’ స‌క్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. విదేశాల్లో విహ‌రిస్తూ ఫ్యామిలీతో స‌రదాగా గ‌డుపుతున్నాడు. వెకేష‌న్ పూర్తి కాగానే మ‌హేష్, త్రివిక్ర‌మ్ సినిమాను మొద‌లు పెట్ట‌నున్నాడు. 

11 ఏళ్ల తర్వాత మాటల మాంత్రికుడు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్-సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh babu) కాంబినేషన్ మరోసారి సెట్ అవ్వడం ఫ్యాన్స్, ఆడియెన్స్ లో తెలియని జోష్ ను నింపింది. ముచ్చటగా మూడోసారి ఈ క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కబోతుడటంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. 

గ‌తంలో వీళ్ళ కాంబోలో తెర‌కెక్కిన ‘అత‌డు’, ‘ఖ‌లేజా’ క‌ల్ట్ క్లాసిక్స్‌గా మిగిలాయి. ఇప్ప‌టికి ఈ రెండు చిత్రాలు టీవీలో వ‌స్తే ప్రేక్ష‌కులు క‌న్నార్ప‌కుండా చూస్తారు. ఈ కాంబోలో మూడో చిత్రం తెర‌కెక్క‌నుండ‌టంతో అంచ‌నాలు తారా స్థాయిలో ఉన్నాడు. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ (SSMB28 Pre Production) ప‌నుల‌ను జ‌రుపుకుంటున్న ఈ చిత్రం జూలైలో షూటింగ్ ప్రారంభంకానుంది.

గతేడాది ఆగస్టు 9న ఈ కాంబినేషన్ ను అఫిషియల్ గా అనౌన్స్ చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో గ్రాండ్ గా పూజా కార్యక్రమాలను  కూడా పూర్తి చేశారు. కానీ ఇప్పటికీ ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లలేదు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైర‌ల్‌గా మారింది.

 తాజాగా ఈ సినిమా గురించి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఫస్ట్ లుక్ (SSMB28 First Look Update) అప్ డేట్ ఆగష్టు 9న రాబోతుందట. మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఆగష్టు 9న ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ రానుందని తాజాగా టాక్ వచ్చింది. ఇదే కనుక నిజం అయితే మహేష్ ఫస్ట్ లుక్ వస్తే ఫ్యాన్స్ కు పండగ అనే చెప్పాలి. మహేష్ బాబు ఈ మూవీలో ఒక విభిన్న పాత్ర చేస్తుండగా, దీనిని భారీ యక్షన్ కమర్షియల్ మూవీగా త్రివిక్రమ్ తెరకెక్కించనున్నారట. 

‘SSMB28’ వర్కింగ్‌ టైటిల్ పేరుతో రూపొందబోతున్న ఈ చిత్రాన్ని హారికా అండ్‌ హాసిని బ్యానర్ పై రూపొందిస్తున్నారు. నిర్మాతగా ఎస్‌.రాధాకృష్ణ(చినబాబు) వ్యవహరిస్తున్నారు. జాతీయ అవార్డ్ గ్రహీత నవీన్ నూలి ఎడిటర్ గా ఎంపిక అయ్యారు. కళా దర్శకునిగా  ఎ.ఎస్.ప్రకాష్, కెమెరామెన్‌గా మధీని ఎంపికయ్యారు. హీరోయిన్ గా గ్లామర్ బ్యూటీ పూజా హెగ్దే (Pooja Hegde) నటిస్తోంది. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి మూవీని రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. 

Read More: ఆ హీరోయిన్లు వద్దంటూ రాజమౌళికి షరతులు పెట్టిన మహేష్‌బాబు (Mahesh Babu).. నిజమెంత?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!