విక్ర‌మ్ (Vikram) సినిమా డైరెక్ష‌న్ అదిరిపోయింది - మ‌హేష్ బాబు (Mahesh Babu)

Updated on Jul 03, 2022 06:12 PM IST
Mahesh Babu: మ‌హేష్ బాబు వ‌రుస ట్వీట్ల‌తో త‌మిళ హీరోల అభిమానులు సంతోషంలో మునిగిపోయారు. 
Mahesh Babu: మ‌హేష్ బాబు వ‌రుస ట్వీట్ల‌తో త‌మిళ హీరోల అభిమానులు సంతోషంలో మునిగిపోయారు. 

టాలీవుడ్ హీరో మ‌హేష్ బాబు (Mahesh Babu) క‌మ‌ల్ హాస‌న్ న‌టించిన‌ విక్ర‌మ్ సినిమాపై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు. కమల్ హాస‌న్‌తో పాటు విక్రమ్ టీమ్‌ను పొగుడుతూ వరుస ట్వీట్స్ చేశారు. విక్ర‌మ్‌ను తెర‌కెక్కించిన లోకేష్ క‌న‌గ‌రాజును మ‌హేష్ మరింత మెచ్చుకున్నారు. మ‌హేష్ బాబు వ‌రుస ట్వీట్ల‌తో త‌మిళ హీరోల అభిమానులు సంతోషంలో మునిగిపోయారు. 

డైరెక్ష‌న్ గురించి తెలుసుకోవాల‌ని ఉంది - మ‌హేష్
త‌మిళ సినీ ఇండ‌స్ట్రీలో మూడేళ్ల త‌ర్వాత విక్ర‌మ్ బ్లాక్ బాస్ట‌ర్ హిట్ సాధించింది. విక్ర‌మ్ సినిమాపై టాలీవుడ్ న‌టుడు మ‌హేష్ బాబు (Mahesh Babu) ట్వీట్ చేశారు. క‌మ‌ల్ హాస‌న్ న‌టించిన‌ విక్ర‌మ్ ఇండ‌స్ట్రీ హిట్ అంటూ మ‌హేష్ బాబు ప్ర‌శంసించారు. ద‌ర్శ‌కుడు లోకేష్ క‌న‌గ‌రాజ్ అద్భుతంగా డైరెక్ష‌న్ చేస్తారన్నారు. 

విక్ర‌మ్ సినిమాను ద‌ర్శ‌కుడు ఎలా తెర‌కెక్కించార‌నే విష‌యాలు లోకేష్‌ను అడిగి తెలుసుకుంటాన‌ని తెలిపారు. లోకేష్ డైరెక్ష‌న్‌కు మ‌హేష్ బాబు ఫిదా అయిపోయారు. లోకేష్‌ను పొగుడుతూ ట్వీట్ చేశారు. ఫహద్ ఫాజిల్, విజయ్ సేతుపతి నటనను కూడా బాగుంద‌న్నారు. విక్ర‌మ్ కోసం అనిరుధ్ అందంచిన సంగీతం మ‌రో హైలెట్‌గా నిలిచింద‌న్నారు. 
 

 
 
క‌మ‌ల్ హాస‌న్ లెజెండ‌రీ యాక్ట‌ర్. క‌మ‌ల్ హాస‌న్ న‌ట‌న గురించి చెప్పేంత అర్హ‌త నాకు లేదు. క‌మ‌ల్ హాస‌న్ అభిమానిగా విక్ర‌మ్ చూశాను. విక్ర‌మ్ సినిమా ఓ గొప్ప అనుభూతిని ఇచ్చింది. క‌మ‌ల్ స‌ర్ మీకు నా అభినంద‌న‌లు.  
మ‌హేష్ బాబు
 

త‌మిళ సినీ ప‌రిశ్ర‌మ అంటేనే సంచ‌ల‌నాల‌కు మారుపేరు. కానీ 2019 త‌ర్వాత ఒక్క సినిమా కూడా భారీ హిట్ సాధించ‌లేదు. ప్ర‌స్తుతం క‌మ‌ల్ హాస‌న్ (Kamal Haasan) న‌టించిన‌ విక్రమ్ (Vikram) సినిమా హిట్‌తో త‌మిళ్ ఇండ‌స్ట్రీలో సంద‌డి నెల‌కొంది. మూడేళ్లుగా ఫ్లాపుల‌తో నిరాశతో ఉన్న కోలీవుడ్‌.. విక్ర‌మ్ సినిమాతో ఫుల్ జోష్‌లో ఉంది. 

విక్ర‌మ్ క‌లెక్ష‌న్ల మోత‌
విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ నాలుగేళ్ల గ్యాప్ త‌ర్వాత‌ న‌టించిన యాక్ష‌న్ మూవీ విక్ర‌మ్ (Vikram). లోకేష్ క‌న‌గ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో విడుద‌లైన ఈ సినిమా బ్లాక్ బాస్ట‌ర్ హిట్ అయింది. విక్ర‌మ్ సినిమా క‌లెక్ష‌న్ల ప‌రంగా కాసుల వ‌ర్షం కురిపిస్తోంది. విడుద‌లైన రెండు రోజుల్లో వంద కోట్ల‌ రూపాయలను కొల్ల‌గొట్టింది. త‌మిళంతో పాటు తెలుగు వెర్ష‌న్ కూడా సూప‌ర్ హిట్‌గా నిలిచింది. హిందీ వెర్ష‌న్ నిదానంగా పికప్ అవుతోందని టాక్.

Read More: బిల్‌గేట్స్‌తో మ‌హేష్ బాబు (Mahesh Babu) : ప్ర‌పంచ కుబేరుడిని క‌లిసిన టాలీవుడ్ శ్రీమంతుడు అంటున్న ఫ్యాన్స్ !

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!