లేడీ ఓరియెంటెడ్‌ సినిమాలతో రికార్డులు క్రియేట్ చేసిన టాప్‌5 హీరోయిన్స్

Updated on Nov 25, 2022 10:56 PM IST
టాలీవుడ్ (Tollywood)లో లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో రికార్డులు సృష్టించారు స్టార్ హీరోయిన్లు
టాలీవుడ్ (Tollywood)లో లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో రికార్డులు సృష్టించారు స్టార్ హీరోయిన్లు

‘సినిమా ఇండస్ట్రీలో హీరోలకు ఉన్న క్రేజ్ హీరోయిన్లకు ఉండదు. స్టార్ హీరో సినిమాకు వచ్చినన్ని ఓపెనింగ్స్‌ చిన్న హీరోల సినిమాలకు ఉండవు’. అవన్నీ ఒకప్పటి మాటలు. ఇప్పుడు పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. కంటెంట్‌ బాగుంటే చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడాలు ఉండడం లేదు. అదే విధంగా స్టార్ హీరో సినిమా అయినా సరే కథ బాగాలేదంటే థియేటర్లు ఖాళీ అవుతున్నాయి.

టాలీవుడ్‌(Tollywood)లో మేల్ డామినేషన్ ఎక్కువగా ఉంటుందని రూమర్స్‌ ఉన్నాయి. సినిమా అనౌన్స్ చేస్తున్నారు అంటే హీరో ఎవరు అని ఆసక్తిగా ఎదురుచూస్తారు. హీరో ఎవరనేది డిసైడ్ చేసిన తరువాత మాత్రమే హీరోయిన్‌ గురించి ఆలోచిస్తారు. అంతటి హీరో డామినేషన్ ఉన్న ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుని లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు కొందరు హీరోయిన్లు.

హీరోను మాత్రమే చూసి థియేటర్లకు వచ్చే ప్రేక్షకులను తమ నటనతో మెస్మరైజ్ చేసి సూపర్‌‌హిట్‌ కొట్టారు పలువురు హీరోయిన్లు. లేడీ ఓరియెంటెడ్‌ సినిమాలతో బాక్సాఫీస్‌ దగ్గర కాసులు కురిపించిన టాలీవుడ్‌ (Tollywood) హీరోయిన్ల వివరాలు పింక్‌విల్లా వ్యూయర్స్‌ కోసం..   

టాలీవుడ్ (Tollywood)లో లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో రికార్డులు సృష్టించారు స్టార్ హీరోయిన్లు

అనుష్క (Anushka)

సూపర్ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ ‘అనుష్క’. తన అందం, నటనతో ప్రేక్షకుల మనసుల్లో చోటు దక్కించుకున్న స్వీటీ.. తక్కువ కాలంలోనే అందరు స్టార్ హీరోల సరసన నటించారు. గ్లామర్‌‌ పాత్రలు చేస్తూ బిజీగా ఉన్న సమయంలోనే కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన అరుంధతి సినిమాలో నటించారు అనుష్క (Anushka).

హారర్‌‌, థ్రిల్లర్‌‌గా తెరకెక్కిన అరుంధతి సినిమా బాక్సాఫీస్‌ను షేక్‌ చేసింది. లేడీ ఓరియెంటెడ్ కాన్సెప్ట్‌ సినిమాలకు మార్కెట్‌ లేదని అనుకున్న వాళ్లందరికీ ఈ సినిమా కలెక్షన్లు ఆశ్చర్యపరిచాయి. ఈ సినిమా తర్వాత అనుష్క ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. అయితే ఆ తర్వాత అనుష్క పలు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించినా అవి అనుకున్నంత సక్సెస్ కాలేదు. అయినప్పటికీ ఆమె క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు.

టాలీవుడ్ (Tollywood)లో లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో రికార్డులు సృష్టించారు స్టార్ హీరోయిన్లు

సమంత (Samantha)

ఏ మాయ చేశావె సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ సమంత. తక్కువ కాలంలోనే స్టార్ హీరోలందరితోనూ నటించి స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్నారు. అక్కినేని నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పలు కారణాలతో వారిద్దరూ విడాకులు తీసుకున్నారు.

ఇక, ‘ఓ బేబి’, ‘యూటర్న్’ వంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో అలరించారు సామ్. కొంత గ్యాప్ తర్వాత ‘యశోద’తో మన ముందుకు వచ్చారు. ఈ లేడీ ఓరియెంటెడ్ సినిమా పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలై మంచి కలెక్షన్లు వసూలు చేసింది. ఇమేజ్, క్రేజ్ ఉన్న కారణంగానే ‘శాకుంతలం’ వంటి భారీ బడ్జెట్ చిత్రాలను కూడా సమంత(Samantha)తో చేయడానికి ముందుకు వస్తున్నారు నిర్మాతలు.

టాలీవుడ్ (Tollywood)లో లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో రికార్డులు సృష్టించారు స్టార్ హీరోయిన్లు

నయనతార (Nayanthara)

చంద్రముఖి సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు హీరోయిన్ నయనతార (Nayanthara). మొదట్లో పర్సనాలిటీ పెద్దగా ఉందని, పర్ఫామెన్స్ బాగాలేదని విపరీతమైన ట్రోలింగ్‌కు గురయ్యారు నయన్‌. నెగెటివ్ కామెంట్స్‌ను పట్టించుకోకుండా తన అందం, నటనతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. లేడీ సూపర్‌‌స్టార్‌‌గా ఎదిగిన నయనతార ఇటీవలే దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌ను పెళ్లి చేసుకున్నారు.

అనామిక, కర్తవ్యం, అమ్మోరు తల్లి, లేడీ టైగర్, ఓ2, మయూరి, డోర వంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించి మెప్పించారు నయనతార.

టాలీవుడ్ (Tollywood)లో లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో రికార్డులు సృష్టించారు స్టార్ హీరోయిన్లు

కీర్తి సురేష్ (Keerthy Suresh)

‘నేను శైలజ’ సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌కు పరిచయమయ్యారు కీర్తి సురేష్. ఈ సినిమా తర్వాత నేను లోకల్, అజ్ఞాతవాసి సినిమాలు చేశారు. అలనాటి హీరోయిన్‌ సావిత్రి బయోపిక్‌గా తెరకెక్కిన ‘మహానటి’ సినిమాలో టైటిల్‌ రోల్‌ చేసి మెప్పించారు కీర్తి సురేష్ (Keerthy Suresh). ఈ సినిమాలో నటనకుగాను నేషనల్ అవార్డు అందుకున్నారు.

ఈ సినిమా తర్వాత మిస్‌ ఇండియా, పెంగ్విన్, గుడ్‌లక్‌ సఖి, చిన్ని వంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించారు కీర్తి.  

టాలీవుడ్ (Tollywood)లో లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో రికార్డులు సృష్టించారు స్టార్ హీరోయిన్లు

సాయి పల్లవి (Sai Pallavi)

గ్లామర్‌‌షోకు దూరంగా ఉంటూనే తన నటన, అభినయంతో అభిమానులను సంపాదించుకున్నారు సాయి పల్లవి. నటనతోపాటు మంచి గ్రేస్‌తో డాన్స్ చేయడం సాయిపల్లవి స్పెషాలిటీ. నేచురల్‌ స్మైల్‌తో ప్రేక్షకులను మెప్పించడంతోపాటు, ఎమోషన్ సీన్స్‌తో కంటతడి కూడా పెట్టించగలనని నిరూపించుకున్నారు.

ఇటీవల గార్గి సినిమాతో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేయగలనని చెప్పారు సాయిపల్లవి (Sai Pallavi)

Read More : ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) చేసిన టాప్‌10 డాన్స్ మూవ్‌మెంట్స్‌

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!