Gargi Movie Review:  నిజాలను నిర్భయంగా చెప్పిన కథ 'గార్గి' .. సాయిపల్లవి నటనా ప్రతిభకు మరో నిదర్శనం ఈ చిత్రం 

Updated on Jul 15, 2022 07:19 PM IST
సాయిపల్లవి (Sai PallavI) ఇటీవలే రానా దగ్గుబాటితో కలిసి విరాటపర్వం చిత్రంలో నటించారు. ఆ చిత్రంలోని పాత్రకు గాను ప్రశంసలు అందుకున్నారు
సాయిపల్లవి (Sai PallavI) ఇటీవలే రానా దగ్గుబాటితో కలిసి విరాటపర్వం చిత్రంలో నటించారు. ఆ చిత్రంలోని పాత్రకు గాను ప్రశంసలు అందుకున్నారు

నటీనటులు: సాయి పల్లవి, కాళీ వెంకట్, ఐశ్వర్య లక్ష్మి, ఆర్ ఎస్ శివాజీ, కలైమామణి శరవణన్

సంగీత దర్శకుడు: గోవింద్ వసంత

దర్శకత్వం : గౌతం రామచంద్రన్


ఫిదా, శ్యామ్ సింగరాయ్, విరాటపర్వం లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన నటి సాయిపల్లవి (Sai Pallavi). ఈ రోజే ఈమె నటించిన 'గార్గి' (Gargi) సినిమా థియేటర్లలో విడుదలైంది. ఒక యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో చూద్దాం


కథా నేపథ్యం :
గార్గి (సాయిపల్లవి) ఓ ఉపాధ్యాయురాలు. ఆమె తండ్రి ఓ సెక్యూరిటీ గార్డ్. గార్గికి వివాహం చేయడానికి ఇంట్లో ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. కానీ ఓ రోజు అనుకోకుండా గార్గి తండ్రిని పోలీసులు అరెస్టు చేస్తారు. ఓ బాలికను రేప్ చేసి హతమార్చిన కేసులో ఆయనను నిందితుడిగా పేర్కొంటారు. ఎవరికీ తెలియకుండా, ఆయనను ఓ రహస్య ప్రదేశంలో బంధిస్తారు. 

ఈ క్రమంలో తన తండ్రి దోషి కాదని నిరూపించేందుకు గార్గి (Gargi) సకల ప్రయత్నాలూ చేస్తుంది. ఆయనను నిర్దోషిగా బయటకు రప్పించేందుకు ఓ పెద్ద న్యాయ పోరాటమే చేస్తుంది. ఎన్నో ఆటుపోట్లను, ఇబ్బందులను కూడా ఎదుర్కొంటుంది. మరి ఆమె కేసు గెలుస్తుందా లేదా? అన్న విషయం తెలుసుకోవాలంటే, ఈ సినిమా చూడాల్సిందే. 

ప్లస్ పాయింట్స్
నిర్దోషులను దోషులుగా చిత్రీకరిస్తూ, పోలీసులు అరెస్టు చేయడం అనే కాన్సెప్టుతో గతంలో చాలా సినిమాలు వచ్చాయి. మనోహరం, నాంది లాంటి చిత్రాలు అందుకు ఉదాహరణ. అయితే, 'గార్గి' చిత్రంలో ఓ కొత్త కోణం ఉంది. ఒకసారి ఓ వ్యక్తి మీద ఏదైనా రేప్ లేదా మర్డర్ కేసు ఫైల్ అయితే, సభ్య సమాజం కూడా వారిని మానసికంగా వేధిస్తుంది. కొన్నిసార్లు వారి కుటుంబాలను కూడా వెలివేసే సందర్భాలు ఎదురవుతూ ఉంటాయి. 

అలాగే వాస్తవాలు తెలియకముందే, మీడియా ఛానల్స్‌లో ప్రసారమయ్యే కథనాలు కూడా జనాలను మిస్ లీడ్ చేస్తుంటాయి. అందుకే తప్పు చేయకుండా కేసుల్లో ఇరుక్కునే అమాయకులు ఎప్పుడూ సమాజంలో నిరాదరణకు గురవుతారు. ఏదేమైనా, ఈ సినిమా మొత్తాన్ని సాయిపల్లవి (Sai Pallavi) భుజాన వెేసుకొని నడిపించిందని చెప్పవచ్చు. 

మైనస్ పాయింట్స్:
ఇది కమర్షియల్ సినిమా కాదు. దాదాపు సినిమా అంతే ఆర్ట్ ఫార్మాట్లోనే సాగుతుంది. పైగా సెకండ్ హాఫ్ నెమ్మదిగా సాగడంతో, అక్కడక్కడ ప్రేక్షకుడు విసుగుచెందే అవకాశం ఉంది. క్లైమాక్స్ వరకు సినిమా నత్తనడకనే నడుస్తుంది. అయితే భావోద్వేగాలతో మిళతమైన సన్నివేశాలు ఈ లోటును పూడ్చాయనే చెప్పాలి. సినిమా మనుషులను ఓ ట్రాన్స్‌లోకి తీసుకుపోతుంది. అయితే, ఎడిటింగ్ ఇంకాస్త బాగా చేస్తే బాగుండేది. దర్శకుడికి సబ్జెక్టు మీద మంచి గ్రిప్ ఉన్నప్పటికీ, అక్కడక్కడ తడబడినట్లు ప్రేక్షకులకు అనిపిస్తుంది. 

సాంకేతిక విభాగం:
ఈ సినిమాకు సంబంధించి ప్రధానంగా చెప్పుకోవాల్సింది బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గురించి. అలాగే సినిమాటోగ్రఫీ కూడా కథకు అనుగుణంగా ఉంది. కొన్ని ఉత్కంఠభరిత సన్నివేశాలలో కెమెరామన్ పనితనం కనిపిస్తుంది. అలాగే నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.

ఫైనల్ వర్డ్
ఈ సినిమా భావోద్వేగాలతో ముడిపడిన ఓ సెన్సిటివ్ సబ్జెక్టు. నేటి సమాజపు పోకడలను కళ్లకు కట్టినట్లు చూపించిన చిత్రం. సగటు ప్రేక్షకుడిని ఆలోచింపజేసే చిత్రం. 

రేటింగ్ : 3/5

Read More: 'విరాట పర్వం' ఎందుకు అంత ప్రత్యేకమో తెలుసా ? మీకోసమే ఈ ఆసక్తికరమైన విషయాలు !
 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!