Gargi: గార్గి ప్రెస్ మీట్‌లో క‌న్నీరు పెట్టుకున్న హీరోయిన్.. ఓదార్చిన సాయి ప‌ల్ల‌వి(Sai Pallavi)

Updated on Jul 07, 2022 03:37 PM IST
Sai Pallavi: మూడేళ్ల  ఐశ్వ‌ర్య కల నెర‌వేరింద‌నే సంతోషంతో ఆమె కంట‌త‌డి పెట్టుకున్నారు.
Sai Pallavi: మూడేళ్ల  ఐశ్వ‌ర్య కల నెర‌వేరింద‌నే సంతోషంతో ఆమె కంట‌త‌డి పెట్టుకున్నారు.

Gargi: టాలీవుడ్‌లో న‌ట‌న‌తోనే కాకుండా డాన్సుల‌తోనూ ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తున్న హీరోయిన్ సాయి ప‌ల్ల‌వి (Sai Pallavi). విరాట ప‌ర్వం త‌ర్వాత సాయి ప‌ల్ల‌వి లేడీ ఓరియెంటెడ్ సినిమా గార్గిలో న‌టిస్తున్నారు. గార్గి త‌మిళ్ వ‌ర్ష‌న్ ప్రీ రిలీజ్ ఈవెంట్ చెన్నైలో జ‌రిగనుంది. చెన్నైలో ఏర్పాటు చేసిన గార్గి ప్రెస్ మీట్‌లో హీరోయిన్ ఐశ్వ‌ర్య ల‌క్ష్మీ క‌న్నీరు పెట్టుకున్నారు. ఐశ్వ‌ర్య ల‌క్ష్మీని సాయి ప‌ల్ల‌వి ఓదార్చారు. అస‌లు  ఐశ్వ‌ర్య ల‌క్ష్మీ ఎందుకు కంట‌త‌డి పెట్టారో తెలుసా?.

ఐశ్వ‌ర్య‌వి ఆనంద‌బాష్పాలన్న యాంక‌ర్
గార్గి సినిమాకు హీరోయిన్ ఐశ్వ‌ర్య ల‌క్ష్మీ కో - ప్రొడ్యూస‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ సినిమా త‌మిళ వ‌ర్ష‌న్ ప్రీ రిలీజ్ వేడుక కోసం ఐశ్వ‌ర్య ల‌క్ష్మీ చెన్నైలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌కు హాజ‌ర‌య్యారు. ఈ కార్య‌క్ర‌మానికి సాయి ప‌ల్ల‌వి(Sai Pallavi), ద‌ర్శ‌కుడు గౌత‌మ్ రామ‌చంద్ర‌న్ కూడా హాజ‌ర‌య్యారు. యాంక‌ర్ ఐశ్వ‌ర్య ల‌క్ష్మీని సినిమా గురించి మాట్లాడాల్సిందిగా కోరింది. గార్గి సినిమా గురించి చెప్పేందుకు మైకు ముందుకు వ‌చ్చిన ఐశ్వ‌ర్య లక్ష్మీ బోరున ఏడ్చేశారు. ఇంత‌లో యాంక‌ర్ ఆమె ఆనందంతో ఏడుస్తున్నార‌ని చెప్పింది. 

సాయి ప‌ల్ల‌వి న‌ట‌న అద్భుతం - ఐశ్వ‌ర్య‌ల‌క్ష్మీ
ఐశ్వ‌ర్య లక్ష్మీ గార్గి సినిమా రిలీజ్ కోసం మూడేళ్ల నుంచి ఎదురు చూస్తున్నారు. అంతేకాకుండా ఈ యంగ్ హీరోయిన్ గార్గి చిత్రానికి కో ప్రొడ్యూస‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఒడిదుడుకుల‌ను అన్నింటిని దాటుకుని ఐశ్వ‌ర్య గార్గి చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాను ఎంతో మంది సినీ ప్ర‌ముఖుల మ‌ద్ద‌తు ఉంది. మూడేళ్ల  ఐశ్వ‌ర్య కల నెర‌వేరింద‌నే సంతోషంతో ఆమె కంట‌త‌డి పెట్టుకున్నారు. సాయి ప‌ల్ల‌వి కంటే గొప్ప‌గా ఇంకెవ‌రూ ఈ పాత్ర చేయ‌లేర‌ని ఐశ్వ‌ర్య ల‌క్ష్మీ చెప్పారు. 

గార్గి కోసం ఐశ్వ‌ర్య ల‌క్ష్మీ అన్ని ర‌కాలుగా త‌మ‌కు స‌హ‌క‌రించార‌ని ద‌ర్శ‌కుడు గౌత‌మ్ రామ‌చంద్ర‌న్ అన్నారు. న్యాయం కోసం పోరాటం చేసే పాత్ర‌లో సాయి ప‌ల్ల‌వి (Sai Pallavi) వెండితెర‌పై గార్గిగా క‌నిపించ‌నున్నారు. జూలై 8న గార్డి తెలుగు ట్రైల‌ర్‌ను హీరోలు రానా ద‌గ్గుబాటి, నానిలు రిలీజ్ చేయ‌నున్నారు.గార్గి చిత్రాన్ని జులై 15న తెలుగుతో పాటు తమిళం, కన్నడ భాషల్లో విడుదల చేయ‌నున్నారు. 

Read More: Virata Parvam : 'విరాట ప‌ర్వం'లో గ‌న్ ప‌ట్టుకోవ‌డం.. ఎంతో థ్రిల్లింగ్‌గా అనిపించింది : సాయిప‌ల్ల‌వి

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!