నటన నేర్చుకోకపోవడమే ప్లస్ అయ్యింది: సాయి పల్లవి (Sai Pallavi).. మహేష్‌బాబు స్క్రీన్ ప్రెజెన్స్ ఇష్టమని కామెంట్

Updated on Oct 17, 2022 02:09 PM IST
ఫిదా సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన సాయి పల్లవి (Sai Pallavi).. తక్కువ సమయంలోనే స్టార్‌‌ హీరోయిన్‌ ఇమేజ్ సొంతం చేసుకున్నారు
ఫిదా సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన సాయి పల్లవి (Sai Pallavi).. తక్కువ సమయంలోనే స్టార్‌‌ హీరోయిన్‌ ఇమేజ్ సొంతం చేసుకున్నారు

మెస్మరైజింగ్ లుక్స్, అట్రాక్టివ్ డ్యాన్స్‌తో అభిమానులను అలరిస్తున్నారు హీరోయిన్ సాయి పల్లవి (Sai Pallavi). అభినయానికి ఆస్కారం ఉన్న పాత్రలను మాత్రమే పోషిస్తూ స్కిన్‌ షోకు దూరంగా ఉన్నారామె. గ్లామర్ పాత్రలకు నో చెబుతున్న తన నటనతో అభిమానులను సంపాదించుకున్నారు సాయి పల్లవి. నటనకు ప్రాధాన్యం ఉన్న క్యారెక్టర్లను ఎంపిక చేసుకుంటూనే కమర్షియల్ సినిమాలు కూడా చేస్తున్న సాయి పల్లవి టాలీవుడ్‌లో కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. ఇటీవల ఆమె మీడియాతో మాట్లాడారు. ఆ క్రమంలో టాలీవుడ్‌ హీరోలపై పలు కామెంట్లు చేశారు.

కథ చెప్పమని అడుగుతా..

ఈ హీరో సినిమాలో నటించాలనే ఆలోచనలేమీ లేవు. కథ బాగుంటే తప్పకుండా చేస్తాను. ‘ఒక స్టార్ హీరో సినిమాలో హీరోయిన్‌గా నటిస్తారా?’ అని ఎవరైనా అడిగితే.. ఆ స్టార్ హీరో ఎవరు అని అడగను. ముందు కథ చెప్పమని అడుగుతాను. ఇండస్ట్రీలో ఉన్న హీరోలందరిపైనా గౌరవం ఉంది. అల్లు అర్జున్‌తో ఒక్క సినిమా కూడా చేయలేదు. కానీ, ఆయన డాన్స్ అంటే చాలా ఇష్టం. మహేష్‌బాబు (MaheshBabu) స్క్రీన్ ప్రెజెన్స్ ఇష్టం. బాలీవుడ్‌లో ఇమ్రాన్‌ఖాన్ ఇష్టం. మగాళ్లు ఇంత అందంగా ఉంటారా? అని ఆశ్చర్యపోతాను.

ఫిదా సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన సాయి పల్లవి (Sai Pallavi).. తక్కువ సమయంలోనే స్టార్‌‌ హీరోయిన్‌ ఇమేజ్ సొంతం చేసుకున్నారు

అందరూ అందగత్తెలే..

ప్రేమమ్‌ సినిమాలో నటించే సమయానికి నాలో చాలా భయాలు ఉండేవి. నా మొహం మీద మొటిమలు ఉంటాయి. నేను అందంగా ఉండను. అసలు నేను హీరోయిన్ మెటీరియల్‌ను కాదు. స్క్రీన్‌పై ఆడియన్స్ నన్ను చూడగలరా?  ఇండస్ట్రీలో నాకు చోటు ఉంటుందా? అప్పటివరకు నేను చూసిన హీరోయిన్లు అందరూ అందగత్తెలే. వాళ్లతో పోలిస్తే నేనెంత అనిపించింది. ప్రేమమ్ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు డైరెక్టర్ అల్ఫోన్స్ పుత్రేన్‌ను చాలా ప్రశ్నలు వేసే దానిని. ప్రేమమ్‌ సినిమాలో క్యారెక్టర్‌‌కు నేను సరిపోతానా? లేక మధ్యలోనే తీసేస్తారా? అని అడిగాను. నాలో కాన్ఫిడెన్స్ పెంచడానికి ఆయన చాలా కష్టపడ్డారు. ఫస్ట్ షాట్‌ ఓకే అయిన తర్వాత కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. ‘ప్రేమమ్‌’ సినిమా విడుదలైన రోజు నాకిప్పటికీ గుర్తుంది. సినిమా అయిపోయిన తర్వాత అందరూ చప్పట్లు కొట్టారు. ఇండస్ట్రీలో నాకు కూడా చోటు దక్కిందని ఆరోజే అనిపించింది’ అని చెప్పుకొచ్చారు సాయి పల్లవి.  

ప్రాక్టీస్ చేయిస్తుంటే పారిపోయి వచ్చేశా..

నటన నేర్చుకోకపోవడమే నాకు ప్లస్‌ అయ్యింది. ఇంట్లో ఎలా ఉంటానో.. స్క్రీన్‌పై కూడా అలాగే కనిపిస్తాను. ‘నా నటన బాగుంది. అదిరిపోయింది’ అని అందరూ అంటుంటే అమ్మ ఆశ్యర్యపోతుంది. నువ్వెక్కడ నటించావు. ఇంట్లో ఎలా ఉన్నావో స్క్రీన్‌పై కూడా అలాగే ఉన్నావు అంటుంది. డాన్స్ కూడా ప్రత్యేకంగా నేర్చుకోలేదు. మాధురీ దీక్షిత్‌ డాన్స్‌ వీడియోలు చూస్తూ.. ఆ స్టెప్పులు ప్రాక్టీస్‌ చేసేదానిని. చిన్నప్పుడు భరతనాట్యం క్లాసులకు పంపించారు. వారంరోజులు  ఒకే స్టెప్పు నేర్పించారు. ‘ఈ స్టెప్పు వచ్చేసింది.. ఇంకొకటి నేర్పించండి’ అని టీచర్‌ని అడిగాను. ‘నెలరోజులు ఇదే స్టెప్పు ప్రాక్టీసు చేయాలి’ అని చెప్పారు. అంతే పారిపోయి వచ్చేశా’ అన్నారు సాయి పల్లవి (Sai Pallavi)

Read More : Sai Pallavai: థియేటర్లలో అభిమానుల సమక్షంలో 'గార్గి' (Gargi Movie) సినిమా వీక్షించిన సాయిపల్లవి..!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!