మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej)పై మనసు పడ్డ హీరోయిన్?.. ‘మై తేజూ అంటూ ట్వీట్’!

Updated on Oct 20, 2022 04:24 PM IST
బ్రెజిలియన్ మోడల్ లారిస్సా బొనేసి (Larissa Bonesi)తో సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) డేటింగ్ చేస్తున్నారంటూ అప్పట్లో గాసిప్స్ వచ్చాయి
బ్రెజిలియన్ మోడల్ లారిస్సా బొనేసి (Larissa Bonesi)తో సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) డేటింగ్ చేస్తున్నారంటూ అప్పట్లో గాసిప్స్ వచ్చాయి

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) నటించిన ‘తిక్క’ సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఎన్నో అంచనాల మధ్య రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. అయితే ఈ మూవీ చేస్తున్న సమయంలో తేజ్ ప్రేమలో ఉన్నట్లు అప్పట్లో పుకార్లు షికారు చేశాయి. ‘తిక్క’ సినిమాలో హీరోయిన్‌గా నటించిన బ్రెజిలియన్ మోడల్ లారిస్సా బొనేసి (Larissa Bonesi)తో ఆయన డేటింగ్ చేస్తున్నారంటూ గాసిప్స్ వినిపించాయి. మధ్యలో వాటికి కొంచెం బ్రేక్ పడినప్పటికీ.. ఇప్పుడు మళ్లీ తేజ్ లవ్ మ్యాటర్ హాట్ టాపిక్‌గా మారింది. అందుకు లారెస్సా చేసిన ట్వీట్లే కారణమని తెలుస్తోంది. 

నన్నెప్పుడూ డిస్ట్రబ్ చేసే వ్యక్తి!

సాయి ధరమ్ తేజ్ శనివారం 36వ పడిలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆయనకు లారిస్సా బొనేసి ట్విట్టర్ వేదికగా విషెస్ తెలిపారు. ‘హ్యాపీ బర్త్ డే మై తేజు’ అంటూ లవ్ సింబల్‌ను జత చేసి ఆమె ట్వీట్ చేశారు. దీనికి ‘నన్ను ఎప్పుడూ డిస్ట్రబ్ చేసే వ్యక్తి’ అంటూ సాయి తేజ్ ఆమెకు థ్యాంక్స్ చెబుతూ లవ్ ఎమోజీలు పెట్టారు. అంతేగాక ఆమెతో దిగిన ఫొటోనూ షేర్ చేశారు. సోషల్ మీడియాలో ఈ ట్వీట్లు చూసిన నెటిజన్లు.. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ కామెంట్లు పెడుతున్నారు. ‘తిక్క’ సినిమా తర్వాత తెలుగు తెరపై పెద్దగా లారిస్సా కనిపించలేదు. సందీప్ కిషన్ సరసన ‘నెక్స్ట్ ఏంటి’ మూవీలో ఓ చిన్న పాత్రను ఆమె పోషించారు. 

ఇకపోతే, గతేడాది సాయి ధరమ్ తేజ్‌కు యాక్సిడెంట్ జరిగిన విషయం తెలిసిందే. ఆ టైమ్‌లో చాన్నాళ్ల పాటు ఆయన ఆస్పత్రిలోనే ఉన్నారు. అప్పుడు తేజ్ త్వరగా కోలుకోవాలని లారిస్సా ఓ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ కూడా ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆ ట్వీట్‌లో ‘నీ నవ్వును చూడటానికి ఎదురుచూస్తున్నా. నమ్ము తేజు’ అంటూ లారిస్సా రాసుకొచ్చారు. మరి.. తేజు, లారిస్సా మధ్య స్నేహమే ఉందా లేదా అది ప్రేమా అనేది ఇంకా క్లారిటీ రాలేదు. వీరిద్దరిలో ఎవరో ఒకరు స్పష్టత ఇచ్చేవరకు దీనిపై ఏదీ చెప్పలేం.  

బాణీలు అందిస్తున్న ‘కాంతార’ మ్యూజిక్ డైరెక్టర్ 

ఇక కెరీర్ విషయానికొస్తే.. సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం కొత్త సినిమా చిత్రీకరణలో తలమునకలై ఉన్నారు. ఇది ఆయన కెరీర్‌లో పదిహేనో మూవీ కావడం గమనార్హం. ఇందులో సంయుక్తా మీనన్ కథానాయికగా నటిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు సుకుమార్ దగ్గర రచనా విభాగంలో పని చేసిన కార్తీక్ దండు సాయి తేజ్ కొత్త మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు సుకుమార్ స్క్రీన్ ప్లే అందిస్తుండటం విశేషం. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి.. ‘విక్రాంత్ రోణ’, ‘కాంతార’ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలకు సంగీతం అందించిన అజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. 

Read more: మా ఇద్దరి అభిరుచులు ఒకటే.. హీరోయిన్‌తో డేటింగ్ రూమర్స్‌పై స్పందించిన అల్లు శిరీష్ (Allu Sirish)

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!