మెగా హీరో సాయిధరమ్‌ తేజ్ (Saidharam Tej) బర్త్‌డే స్పెషల్.. 'SD15' నుంచి ఆసక్తికర పోస్టర్..!

Updated on Oct 17, 2022 02:14 PM IST
శనివారం సాయిధరమ్‌ తేజ్ (Saidharam Tej) బర్త్‌డే సందర్భంగా మేకర్స్‌ స్పెషల్‌ పోస్టర్‌ను (SD15 Special Poster) రిలీజ్‌ చేశారు.
శనివారం సాయిధరమ్‌ తేజ్ (Saidharam Tej) బర్త్‌డే సందర్భంగా మేకర్స్‌ స్పెషల్‌ పోస్టర్‌ను (SD15 Special Poster) రిలీజ్‌ చేశారు.

మెగా హీరోగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చినా తన ప్రతిభతో గుర్తింపు తెచ్చుకున్నాడు సాయి ధరమ్ తేజ్ (Saidharam Tej). ఈ సినిమాలో సాయిధరమ్ సరసన సంయుక్త మీనన్ (Samyuktha Menon) కథానాయిక గా నటిస్తోంది. ‘పిల్లా నువ్వులేని జీవితం’ సినిమాతో కెరీర్‌ ప్రారంభించిన తేజ్‌.. ‘సుబ్రహ్మణ్యం ఫర్‌ సేల్‌’, ‘సుప్రీమ్‌’, ‘చిత్రలహరి’ వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. 

ప్రస్తుతం ఈ యంగ్ హీరో కార్తీక్ దండు (Karthik Dandu) దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. 'SD15' అనే వర్కింగ్ టైటిల్ తో మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుంది. నిజానికి ఈసినిమా ఎప్పుడో మొదలవ్వాలి. అయితే కరోనా వల్ల కొంత కాలం లేట్ అయితే ఆతర్వాత సాయి తేజ్ కు యాక్సిడెంట్ అవ్వడంతో మొత్తానికి బ్రేక్ పడింది. ఈ మధ్యనే ఈసినిమా షూటింగ్ ను తిరిగి ప్రారంభించారు.

కాగా, శనివారం సాయిధరమ్‌ తేజ్ (Saidharam Tej) బర్త్‌డే సందర్భంగా మేకర్స్‌ స్పెషల్‌ పోస్టర్‌ను (SD15 Special Poster) రిలీజ్‌ చేశారు. తాజాగా విడుదలైన పోస్టర్‌లో సాయిధరమ్‌ తేజ్‌ చేతిలో కాగడా పట్టుకొని ఉన్నాడు. పోస్టర్ మాత్రం ఇంట్రెస్టింగ్ గా ఉండి ఆకట్టుకుంటుంది. దీనితో పాటు టైటిల్ ను కూడా త్వరలోనే రిలీజ్ చేస్తామని.. అలాగే వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్టు స్పష్టం చేశారు.

ఈ చిత్రం తేజ్‌ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌ మూవీగా తెరకెక్కనుందట. ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన ప్రీ లుక్‌ పోస్టర్‌లు సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్‌చేశాయి. ఇక, ఈ చిత్రానికి డైరెక్టర్ సుకుమార్‌ (Director Sukumar) కథ, స్క్రీన్‌ప్లే అందిస్తూ సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వరా సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.

Read More: Sai Dharam Tej: సాయిధ‌ర‌మ్ తేజ్ కు జోడీగా 'భీమ్లా నాయక్' బ్యూటీ సంయుక్తా మీనన్..!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!