Krish Jagarlamudi Birthday Special : మొదటి సినిమాతోనే 'నంది' అవార్డు అందుకున్న మేటి దర్శకుడు క్రిష్ !

Updated on Nov 10, 2022 04:17 PM IST
క్రిష్ (Krish Jagarlamudi) 2008లో  గమ్యం సినిమాతో దర్శకుడిగా తెలుగు సినిమా పరిశ్రమలో అడుగుపెట్టారు. అంతేకాదు ఈ సినిమాలో నక్సలైట్ పాత్రలో నటించి మెప్పించారు.
క్రిష్ (Krish Jagarlamudi) 2008లో గమ్యం సినిమాతో దర్శకుడిగా తెలుగు సినిమా పరిశ్రమలో అడుగుపెట్టారు. అంతేకాదు ఈ సినిమాలో నక్సలైట్ పాత్రలో నటించి మెప్పించారు.

టాలీవుడ్ స్టార్ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి (Krish Jagarlamudi) సినిమాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. మొదటి సినిమా 'గమ్యం'తో క్రిష్ దర్శకుడిగా తన సత్తా ఏంటో చూపించారు. అంతేకాదు ఈ సినిమాతో  ఆయన 'నంది' అవార్డు అందుకున్నారు. కొత్త కథలతో ప్రేక్షకులకు వినోదం పంచుతున్న క్రిష్ పుట్టిన రోజు సందర్భంగా 'పింక్ విల్లా' స్పెషల్ స్టోరి మీకోసం..

క్రిష్ అసలు పేరు జాగర్లమూడి రాధాకృష్ణ. ఈయన గుంటూరులో పుట్టి పెరిగారు. క్రిష్ తాతగారికిఓ సినిమా థియేటర్ ఉండేది. చిన్నప్పటి నుంచి క్రిష్‌కు సినిమాలంటే ఎంతో ఇష్టం. పై చదువుల కోసం అమెరికా వెళ్లిన క్రిష్.. తెలుగు సినిమాల మీద తనకున్న ఇష్టంతో దర్శకుడిగా మారారు.

క్రిష్ (Krish Jagarlamudi)

2008లో క్రిష్ 'గమ్యం' సినిమాతో దర్శకుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. అంతేకాదు.. ఈ సినిమాలో ఓ నక్సలైట్ పాత్రలో నటించి మెప్పించారు. 'గమ్యం' చిత్రంలో శర్వానంద్, అల్లరి నరేష్, కమలిని ముఖర్జీ ప్రధాన పాత్రల్లో నటించారు. మొదటి సినిమాతోనే క్రిష్ నంది అవార్డును కైవసం చేసుకోవడం విశేషం. 

2010లో అనుష్క ప్రధాన పాత్రలో నటించిన 'వేదం' సినిమాకు క్రిష్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. ఈ సినిమాకుగానూ క్రిష్  ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డు అందుకోవడం విశేషం. వేదం సినిమా హిట్ కావడంతో 'క్రిష్' ఈ సినిమాను తమిళంలో రీమేక్ చేశారు. తమిళంలో కూడా ఈ చిత్రం మంచి కలెక్షన్లను రాబట్టింది. 

2012లో తెరకెక్కించిన 'కృష్ణం వందే జగద్గురుం' సినిమాలో క్రిష్ డైరెక్షన్ అందరినీ ఆకట్టుకుంది. ఈ సినిమా ఫిలిమ్ ఫేర్ అవార్డులకు కూడా నామినేట్ అయింది. 

క్రిష్ (Krish Jagarlamudi)

2015లో క్రిష్ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. 'గబ్బర్ ఈజ్ బ్యాక్' అనే సినిమాకు దర్శకుడిగా వ్యవహరించారు. ఈ సినిమాలో అక్షయ్ కుమార్, కరీనా కపూర్, శ్రుతి హాసన్ ప్రధాన పాత్రలలో నటించారు. తెలుగు చిత్రం 'ఠాగూర్'కి ఈ సినిమా రీమేక్. తెలుగులో చిరంజీవి పోషించిన పాత్రను హిందీలో అక్షయ్ పోషించారు. 

'కంచె' సినిమా క్రిష్‌కు మరో బ్లాక్ బాస్టర్ హిట్ ఇచ్చింది. వరుణ్ తేజ్, ప్రగ్యా జైస్వాల్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా 2015 సంవత్సరానికి గాను ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ అవార్డును కైవసం చేసుకుంది. దీంతో క్రిష్ పేరు టాలీవుడ్‌లో మారుమోగింది. 

2017లో క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించిన సినిమా 'గౌతమి పుత్ర  శాతకర్ణి'. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అనుకున్నంత ప్రభావం చూపించకపోయినా, క్రిష్ దర్శకత్వానికి మంచి మార్కులే పడ్డాయి.. 

2019లో క్రిష్ మూడు చిత్రాలను తెరకెక్కించారు. మహానటుడు ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా 'కథానాయకుడు, మహానాయకుడు సినిమాలను రూపొందించారు. అంతేకాకుండా హిందీలో కంగనా ప్రధాన పాత్రలో నటించిన 'మణికర్ణిక' సినిమాను తెరకెక్కించారు. ఈ మూడు సినిమాలు కూడా అనుకున్నంత స్థాయిలో ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయాయి. 

ప్రస్తుతం క్రిష్  దర్శకత్వంలో  పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా 'హరిహర వీరమల్లు' అనే చిత్రం తెరకెక్కుతోంది. పీరియాడిక్ డ్రామాగా 'హరిహర వీరమల్లు' చిత్రం పాన్ ఇండియా లెవల్‌లో రిలీజ్ కానుంది. 

Read More: పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) 'హరిహర వీరమల్లు' సినిమా అప్‌డేట్స్‌ను పోస్ట్ చేసిన‌ ద‌ర్శ‌కుడు క్రిష్

 

క్రిష్ (Krish Jagarlamudi)

 
 
క్రిష్ మరిన్ని కొత్త కథలతో ప్రేక్షకులకు వినోదం పంచాలని కోరుకుంటూ.. హ్యాపీ బర్త్ డే క్రిష్.
పింక్ విల్లా.
 
Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!