Hari Hara Veera Mallu: 'హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు' ప‌వ‌ర్ గ్లాన్స్ వీడియో రిలీజ్.. పులిలా తొడ‌గొట్టిన ప‌వ‌న్ క‌ల్యాణ్ (Pawan Kalyan)

Updated on Sep 02, 2022 11:40 AM IST
 ప‌వ‌న్ క‌ల్యాణ్ (Pawan Kalyan), క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ లో 'హరిహర వీరమల్లు' చిత్రం తెరకెక్కుతోంది.
ప‌వ‌న్ క‌ల్యాణ్ (Pawan Kalyan), క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ లో 'హరిహర వీరమల్లు' చిత్రం తెరకెక్కుతోంది.

టాలీవుడ్ ప‌వ‌ర్ స్టార్  ప‌వ‌న్ క‌ల్యాణ్ (Pawan Kalyan) పుట్టిన రోజు సంద‌ర్భంగా 'హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు' సినిమా నుంచి బిగ్ అప్ డేట్ రిలీజ్ అయింది. ప‌వ‌న్ గ్లాన్స్ అనే పేరుతో వీడియో రిలీజ్ చేశారు మేక‌ర్స్. పవన్ క‌ల్యాణ్, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ లో 'హరిహర వీరమల్లు' చిత్రం తెరకెక్కుతోంది. 'హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు' చిత్రం నుంచి రిలీజ్ అయిన వీడియోలో ప‌వన్ క‌ల్యాణ్ న‌ట‌న ఓ రేంజ్‌లో ఉంది.

"దిగొచ్చింది భ‌ళ్లు భ‌ళ్లున‌

పిడుగై దిగొచ్చింది భ‌ళ్లు భ‌ళ్లున‌

మెడల్ని వంచి, కథల్ని మార్చి

కొలిక్కితెచ్చే పనెట్టుకోని తొడకొట్టాడో.. తెలుగోడు!" అంటూ 'హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు' పవర్ గ్లాన్స్ సాగింది. 

ప‌వ‌న్ క‌ల్యాణ్ (Pawan Kalyan) లుక్ అదిరిపోయింది. పులి, మేక ఆట‌తో ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎంట్రీ ఇచ్చారు. పులిలా శ‌త్రువుల‌పై విరుచుప‌డ్డారు. ఓ వీరుడిలా ఉగ్ర రూపంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ క‌నిపించారు. ప‌వ‌న్ లుక్, కాస్టూమ్స్, యాక్ష‌న్ సీన్ల‌ను క్రిష్ అద్భుతంగా చిత్రీక‌రించారు.

 ప‌వ‌న్ క‌ల్యాణ్ (Pawan Kalyan), క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ లో 'హరిహర వీరమల్లు' చిత్రం తెరకెక్కుతోంది.

2023 స‌మ్మ‌ర్‌లో రిలీజ్

పాన్ ఇండియా సినిమాగా 'హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు' రిలీజ్ కానుంది. ప‌వ‌న్ క‌ల్యాణ్ మొద‌టి సారి త‌న సినిమాను పాన్ ఇండియా లెవ‌ల్‌లో రిలీజ్ చేయ‌నున్నారు. 'హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు' సినిమాను తెలుగుతో పాటు త‌మిళ్, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో రిలీజ్ చేయ‌నున్నారు. ఈ సినిమాకు ఎం.ఎం. కీర‌వాణి సంగీతం అందిస్తున్నారు.

పదిహేడవ శతాబ్దం నాటి క‌థ‌తో 'హరిహర వీరమల్లు' చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఈ సినిమాకు క్రిష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. భార‌తీయ సినిమా చ‌రిత్ర‌లో ఇప్ప‌టివ‌ర‌కు రాని క‌థ‌గా 'హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు' సినిమాను చిత్రీక‌రిస్తున్నామ‌ని క్రిష్ తెలిపారు. ఈ సినిమాను ఏ.ఎం.రత్నం సమర్పణలో దయాకర్‌రావు నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా సినిమాగా హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు చిత్రం 2023 స‌మ్మ‌ర్‌కు రిలీజ్ కానుంది. 

Read More: క‌ల్యాణ్ బాబు(Pawan Kalyan)కు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు - చిరంజీవి (Chiranjeevi)

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!