పవన్ క‌ళ్యాణ్ (Pawan Kalyan) తో జతకట్టనున్న 'సాహో' ద‌ర్శ‌కుడు సుజిత్ (Sujeeth).. అధికారిక ప్రకటన వచ్చేసింది!

Updated on Dec 04, 2022 10:09 AM IST
ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌రో కొత్త సినిమాను అనౌన్స్ చేశారు. 'సాహో' ద‌ర్శ‌కుడు సుజిత్ (Sujeeth) ద‌ర్శ‌క‌త్వంలో ప‌వ‌న్ సినిమా చేయ‌బోతున్నారు.
ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌రో కొత్త సినిమాను అనౌన్స్ చేశారు. 'సాహో' ద‌ర్శ‌కుడు సుజిత్ (Sujeeth) ద‌ర్శ‌క‌త్వంలో ప‌వ‌న్ సినిమా చేయ‌బోతున్నారు.

టాలీవుడ్  పవర్ స్టార్ పవన్ క‌ళ్యాణ్ (Pawan Kalyan) ఓ వైపు సినిమాలు చేస్తూనే మ‌రో వైపు రాజ‌కీయాల్లోనూ బిజీగా ఉన్నారు. ఆయన ప్రస్తుతం చేస్తున్న సినిమాల విష‌యానికి వ‌స్తే ‘హ‌రిహ‌ర వీరమ‌ల్లు’ అనే పీరియాడిక్ మూవీతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. 

టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ (Director Krrish) తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో పవన్ సరసన నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. ‘హ‌రిహ‌ర వీరమ‌ల్లు’ (Harihara Veeramallu) సినిమా తర్వాత హరీష్ శంకర్ తో పాటు మరికొందరు దర్శకులు కూడా ఆయన కోసం లైన్ లో ఉన్నారు. ఈ తరుణంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌రో కొత్త సినిమాను అనౌన్స్ చేశారు. ర‌న్ రాజా ర‌న్‌, సాహో చిత్రాల ద‌ర్శ‌కుడు సుజిత్ (Sujeeth) ద‌ర్శ‌క‌త్వంలో ప‌వ‌న్ సినిమా చేయ‌బోతున్నారు.  

‘ఆర్ఆర్ఆర్’ (RRR) సినిమాను నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఆదివారం ఈ మూవీని అధికారికంగా ప్రకటించారు. పవన్ కు సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేస్తూ.. 'అగ్ని తుఫాను రానుంది, ఆయన్ను ఒరిజినల్ గ్యాంగ్ స్టర్' (They Call Him #OG) అంటారు అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఈ పోస్టర్ లో పవన్ ముందుకు చూస్తూ నిలబడి ఉన్నట్లు కనిపిస్తున్నాడు.

పవర్ స్టార్ ఇమేజ్ దృష్టిలో పెట్టుకుని సుజిత్ స్టయిలిష్ యాక్షన్ స్క్రిప్ట్ డిజైన్ చేశారట డైరెక్టర్ సుజిత్ (Director Sujeeth). సుజిత్ చెప్పిన కథ నచ్చడంతో స్ట్రెయిట్ సినిమా చేయడానికి పవన్ మొగ్గు చూపారు. 'సాహో' తర్వాత సుజిత్ మరో సినిమా చేయలేదు. మూడేళ్లుగా పలు స్క్రిప్ట్స్ మీద వర్క్ చేశారు. పవన్ సినిమాకు ముందు వరుణ్ తేజ్ హీరోగా ఓ సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. 

అయితే... చివరకు పవర్ స్టార్‌ను తన సొంత కథతో మెప్పించారు. కాగా, పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కథానాయకుడిగా డీవీవీ సంస్థలో రెండో చిత్రమిది. ఇంతకు ముందు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పవన్ హీరోగా 'కెమెరామెన్ గంగతో రాంబాబు' సినిమా నిర్మించారు. పదేళ్ళ తర్వాత మళ్ళీ పవన్‌తో సినిమా చేస్తుండటం విశేషం. 

Read More: పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) లేకుండానే 'హరిహర వీరమల్లు' (HariHara Veeramallu) యాక్షన్ సీక్వెన్స్..?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!