పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) 'హరిహర వీరమల్లు' సినిమా అప్‌డేట్స్‌ను పోస్ట్ చేసిన‌ ద‌ర్శ‌కుడు క్రిష్

Updated on Oct 06, 2022 03:31 PM IST
 ప‌వ‌న్ క‌ల్యాణ్ (Pawan Kalyan) మొద‌టి సారి 'హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు' సినిమాను పాన్ ఇండియా లెవ‌ల్‌లో రిలీజ్ చేయ‌నున్నారు.
 ప‌వ‌న్ క‌ల్యాణ్ (Pawan Kalyan) మొద‌టి సారి 'హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు' సినిమాను పాన్ ఇండియా లెవ‌ల్‌లో రిలీజ్ చేయ‌నున్నారు.

టాలీవుడ్ హీరో పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) న‌టిస్తున్న‌ పీరియాడిక్‌ యాక్షన్‌ చిత్రం ‘హరిహర వీరమల్లు’ సినిమా నుంచి లేటెస్ట్ అప్‌డేట్ రిలీజ్ అయింది. ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న క్రిష్ త‌న సోష‌ల్ మీడియాలో ఓ సరికొత్త అప్‌డేట్ అందించారు.  ‘హరిహర వీరమల్లు’ సినిమా వ‌ర్క్ షాప్ షెడ్యూల్ పూర్త‌యిందంటూ క్రిష్ త‌న ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. ఈ సినిమాకు సంబంధించిన మ‌రో షెడ్యూల్ ద‌స‌రా త‌రువాత ప్రారంభం కానుంది. ఈ సినిమాపై క్రిష్ అందించిన అప్‌డేట్స్‌తో ప‌వ‌న్ అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. 

 ప‌వ‌న్ క‌ల్యాణ్ (Pawan Kalyan) మొద‌టి సారి 'హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు' సినిమాను పాన్ ఇండియా లెవ‌ల్‌లో రిలీజ్ చేయ‌నున్నారు.

2023 స‌మ్మ‌ర్‌లో రిలీజ్

ప‌వ‌న్ క‌ల్యాణ్ (Pawan Kalyan) మొద‌టి సారి త‌న సినిమాను పాన్ ఇండియా లెవ‌ల్‌లో రిలీజ్ చేయ‌నున్నారు. 'హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు' సినిమాను తెలుగుతో పాటు త‌మిళం, క‌న్న‌డ‌ం, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో రిలీజ్ చేయ‌నున్నారు. ఈ సినిమాలో ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు జోడిగా నిధి అగర్వాల్ న‌టిస్తున్నారు.   ఈ సినిమాకు ఎం.ఎం. కీర‌వాణి సంగీతం అందిస్తున్నారు. 

పదిహేడవ శతాబ్దం నాటి క‌థ‌తో 'హరిహర వీరమల్లు' చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఈ సినిమాకు క్రిష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. భార‌తీయ సినిమా చ‌రిత్ర‌లో ఇప్ప‌టివ‌ర‌కు రాని క‌థ‌గా 'హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు' సినిమాను చిత్రీక‌రిస్తున్నామ‌ని క్రిష్ తెలిపారు. ఈ సినిమాను ఏ.ఎం.రత్నం సమర్పణలో దయాకర్‌రావు నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా సినిమాగా హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు చిత్రం 2023 స‌మ్మ‌ర్‌కు రిలీజ్ కానుంది. 

Read More: Hari Hara Veera Mallu: 'హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు' ప‌వ‌ర్ గ్లాన్స్ వీడియో రిలీజ్.. పులిలా తొడ‌గొట్టిన ప‌వ‌న్ క‌ల్యాణ్ (Pawan Kalyan)

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!