త్రివిక్ర‌మ్ సినిమా కోసం మ‌హేష్ (Mahesh Babu) హార్డ్ వ‌ర్క్.. మ‌రో నాలుగు రోజుల్లో 'ఎస్ఎస్ఎంబి 28' షూటింగ్

Updated on Sep 08, 2022 08:13 PM IST
మ‌హేష్ బాబు (Mahesh Babu) 'ఎస్ఎస్ఎంబి 28' షూటింగ్ కోసం సిద్ద‌మ‌వుతున్నారు. ప్ర‌స్తుతం మ‌హేష్ జిమ్ వీడియో వైర‌ల్‌గా మారింది.
మ‌హేష్ బాబు (Mahesh Babu) 'ఎస్ఎస్ఎంబి 28' షూటింగ్ కోసం సిద్ద‌మ‌వుతున్నారు. ప్ర‌స్తుతం మ‌హేష్ జిమ్ వీడియో వైర‌ల్‌గా మారింది.

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు (Mahesh Babu) కు 'స‌ర్కారు వారి పాట' చిత్రం బ్లాక్ బాస్ట‌ర్ హిట్ ఇచ్చింది. ఈ సినిమా త‌రువాత మ‌హేష్ కాస్త బ్రేక్ తీసుకున్నారు. కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి హాలిడే ట్రిప్పుల‌కు వెళ్లి వ‌చ్చారు. నాలుగు రోజుల్లో ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ డైరెక్ష‌న్‌లో తెర‌కెక్కుతున్న సినిమాలో మ‌హేష్ న‌టించ‌నున్నారు. మ‌హేష్ బాబు 'ఎస్ఎస్ఎంబి 28' షూటింగ్ కోసం సిద్ద‌మ‌వుతున్నారు. ప్ర‌స్తుతం మ‌హేష్ జిమ్ వీడియో వైర‌ల్‌గా మారింది.

వావ్ మ‌హేష్..

ఈ వీడియోలె మ‌హేష్ బాబు త్రెడ్ మిల్‌పై చాలా వేగంగా పరుగెత్తుతూ కనిపించారు. ఈ వీడియోను మ‌హేష్ జిమ్ ట్రైన‌ర్ త‌న సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. మ‌హేష్ రన్నింగ్‌ను చూసి నెటిజన్లు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. త‌న కొత్త సినిమా 'ఎస్ఎస్ఎంబి 28' కోసం మ‌హేష్ చాలా క‌ష్ట‌ప‌డుతున్నారని ఫ్యాన్స్  కామెంట్లు కూడా పెడుతున్నారు. 47 ఏళ్ల వ‌య‌సులో మ‌హేష్ యంగ్ లుక్‌లో క‌నిపించ‌డానికి జిమ్ కూడా ఒక కార‌ణం అయి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. 

కొత్త సినిమా షూటింగ్‌ షురూ

మ‌హేష్ బాబు (Mahesh Babu) న‌టిస్తున్న 28 వ సినిమాను ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ తెర‌కెక్కిస్తున్నారు. ఈ సినిమాకు 'ఎస్ఎస్ఎంబి 28' అనే టెంప‌ర‌రీ టైటిల్ పెట్టారు. రెండు నెల‌ల క్రితం  ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్య‌క్ర‌మాలను నిర్వ‌హించారు. ఈ సినిమా ఫ‌స్ట్ షెడ్యూల్ హైద‌రాబాద్‌లోని అన్న‌పూర్ణ స్టూడియోలో జ‌ర‌గ‌నుంది. సెప్టెంబ‌ర్ 12 తేదీ నుంచి మ‌హేష్‌ బాబు 'ఎస్ఎస్ఎంబి 28' సినిమా షూటింగ్‌లో పాల్గొన‌నున్నారు. 

మ‌హేష్ బాబు త‌న కొత్త సినిమా కోసం క‌స‌ర‌త్తులు మొద‌లు పెట్టారు. త‌న బాడీ షేపింగ్ కోసం హార్డ్ వ‌ర్క్ చేస్తున్నారు. పక్కా యాక్ష‌న్ సినిమాగా త్రివిక్ర‌మ్ ఈ సినిమాను ప్లాన్ చేశారు. అన్న‌పూర్ణ స్టూడియోలో ఓ సెట్ కూడా వేశార‌ట‌. ఓ సీన్ కోసం ప్ర‌త్యేక‌మైన బ‌స్‌ను కూడా ఏర్పాటు చేశార‌ట‌.

ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తున్నారు. త్రివిక్రమ్, మ‌హేష్ కాంబినేషన్లో రూపొందుతున్న మూడో సినిమా కావ‌డంతో ఈ సినిమాపై అంచ‌నాలు పెరిగాయి. 'ఎస్ఎస్ఎంబి 28' పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ కానుంది. 

Read More: మహేష్‌బాబు (MaheshBabu) – త్రివిక్రమ్ సినిమాలో మలయాళ స్టార్ హీరో.. నిజమెంతో మరి?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!