మహేష్‌బాబు (MaheshBabu) – త్రివిక్రమ్ సినిమాలో మలయాళ స్టార్ హీరో.. నిజమెంతో మరి?

Updated on Sep 06, 2022 06:07 PM IST
మహేష్‌బాబు (MaheshBabu) – త్రివిక్రమ్ కాంబినేషన్‌లో సినిమా కోసం నటీనటుల ఎంపిక కొనసాగుతోంది
మహేష్‌బాబు (MaheshBabu) – త్రివిక్రమ్ కాంబినేషన్‌లో సినిమా కోసం నటీనటుల ఎంపిక కొనసాగుతోంది

సూపర్ స్టార్‌‌ మహేష్‌బాబు (MaheshBabu) – త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ఎస్‌ఎస్‌ఎంబీ28. అతడు, ఖలేజా సినిమాల తరువాత వస్తున్న చిత్రంతో ఈ సినిమాపై భారీ అంచనాలను పెట్టుకున్నారు అభిమానులు.

ఇటీవలే పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. ప్రస్తుతం నటీనటులను ఎంపిక చేసే పనిలో ఉన్నారు త్రివిక్రమ్. వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమాలో హీరో తరుణ్ ఒక క్యారెక్టర్‌‌ చేయనున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తరుణ్ హీరోగా తెరకెక్కిన నువ్వే నువ్వే చిత్రంతో డైరెక్టర్‌‌గా కెరీర్ మొదలుపెట్టారు త్రివిక్రమ్. కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న తరుణ్‌.. త్రివిక్రమ్‌ సినిమాతో రీఎంట్రీ ఇవ్వనున్నారని అంతా అనుకున్నారు. అయితే  ఈ విషయమై ఇప్పటికే మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఈ చిత్రంలో మరో యంగ్ హీరోకు పాత్ర ఉందని, కానీ తాము తరుణ్‌ను అనుకోవడం లేదని చెప్పుకొచ్చారు.

మహేష్‌బాబు (MaheshBabu) – త్రివిక్రమ్ కాంబినేషన్‌లో సినిమా కోసం నటీనటుల ఎంపిక కొనసాగుతోంది

క్లారిటీ అంతలోనే మరో వార్త..

ఇక తాజాగా తరుణ్ కూడా ఎస్‌ఎస్‌ఎంబీ28 సినిమా కోసం తనను ఎవరూ సంప్రదించలేదని, ఏదైనా ఉంటే తానే డైరెక్ట్ గా చెప్తానని చెప్పుకొచ్చారు. దీంతో ఆ క్యారెక్టర్‌‌ను తరుణ్ నటించడం లేదని కన్ఫర్మ్ అయ్యింది. కాగా, తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ క్యారెక్టర్‌‌ కోసం మలయాళ హీరో రోషన్ మాథ్యూను సంప్రదించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మలయాళంలో రోషన్ స్టార్ హీరోగా మంచి పేరు తెచ్చుకున్నారు.

ఇక రోషన్ ఈ మధ్యనే అలియాభట్‌తో డార్లింగ్ సినిమాలో నటించారు. ఆ సినిమాతో హిట్ కూడా అందుకున్నారు రోషన్. ఈరోజు రిలీజ్ అయిన కోబ్రా సినిమాలో విలన్‌గా నటించి మెప్పించాడు. ఇక, తెలుగులో మహేష్‌బాబు (MaheshBabu) – త్రివిక్రమ్ సినిమా ద్వారా రోషన్‌ మాథ్యూ ఎంట్రీ ఇవ్వనున్నాడని తెలుస్తోంది. మరి ఈ వార్తలో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది.

Read More : లీడర్ సినిమా సీక్వెల్‌లో మహేష్‌బాబు (MaheshBabu) నటించనున్నారా? శేఖర్ కమ్ముల కథకు సూపర్‌‌స్టార్ ఓకే చెబుతారా!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!