త్రివిక్ర‌మ్‌ సినిమాకు మ‌హేష్ (Mahesh Babu) సిద్ధం!.. హాలీడే ట్రిప్ నుంచి హైద‌రాబాద్‌కు చేరుకున్న ప్రిన్స్

Updated on Aug 06, 2022 03:02 PM IST
మ‌హేష్ బాబు (Mahesh Babu) పుట్టిన రోజైన ఆగ‌స్టు 9 న‌ త్రివిక్ర‌మ్ 'SSMB28' సినిమా నుంచి అప్‌డేట్ ఇస్తార‌ని అభిమానులు ఎదురుచూస్తున్నారు. 
మ‌హేష్ బాబు (Mahesh Babu) పుట్టిన రోజైన ఆగ‌స్టు 9 న‌ త్రివిక్ర‌మ్ 'SSMB28' సినిమా నుంచి అప్‌డేట్ ఇస్తార‌ని అభిమానులు ఎదురుచూస్తున్నారు. 

టాలీవుడ్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) హాలీడే ట్రిప్ పూర్తి చేసుకుని హైద‌రాబాద్‌కు చేరుకున్నారు. మహేష్ బాబు వెంట అత‌ని భార్య‌, పిల్ల‌లు కూడా ఉన్నారు. 'స‌ర్కారు వారి పాట' బ్లాక్ బాస్ట‌ర్ హిట్ త‌ర్వాత మ‌హేష్ బాబు త‌న ఫ్యామిలీతో క‌లిసి హాలీడే ట్రిప్స్‌కు వెళ్లారు. మొద‌ట యూర‌ప్ దేశాల‌కు వెళ్లారు. ఆ త‌ర్వాత అమెరికా వెళ్లి వ‌చ్చారు. ప్ర‌స్తుతం లండ‌న్, స్విట్జర్లాండ్ దేశాల్లో స‌ర‌దాగా గ‌డిపిన మ‌హేష్ బాబు తిరిగి హైద‌రాబాద్ చేరుకున్నారు.

మ‌హేష్ బాబు (Mahesh Babu) పుట్టిన రోజైన ఆగ‌స్టు 9 న‌ త్రివిక్ర‌మ్ 'SSMB28' సినిమా నుంచి అప్‌డేట్ ఇస్తార‌ని అభిమానులు ఎదురుచూస్తున్నారు. 

స్విట్జర్లాండ్ దేశం నుంచి మ‌హేష్ బాబు (Mahesh Babu) ఇండియా చేరుకున్నారు. హైదరాబాద్ విమానాశ్రయంలో ఫొటోగ్రాఫర్స్ కంట పడిన మ‌హేష్.. బ్లు ష‌ర్ట్‌లో చాలా కూల్‌గా క‌నిపించారు. స్టైలిష్‌గా న‌డుచుకుంటూ వెళ్లే విజువ‌ల్స్ చూసి మ‌హేష్ బాబు ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. 

మ‌హేష్ బాబు (Mahesh Babu) పుట్టిన రోజైన ఆగ‌స్టు 9 న‌ త్రివిక్ర‌మ్ 'SSMB28' సినిమా నుంచి అప్‌డేట్ ఇస్తార‌ని అభిమానులు ఎదురుచూస్తున్నారు. 

షూటింగ్స్‌లో బిజీ కానున్న పిన్స్

ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌తో మ‌హేష్ బాబు (Mahesh Babu) త‌న 28వ సినిమా మొద‌లు పెట్ట‌నున్నారు. ఈ సినిమాకు 'ఎస్ఎస్ఎంబి 28' అనే టెంప‌ర‌రీ టైటిల్ పెట్టిన సంగ‌తి తెలిసిందే. త్రివిక్ర‌మ్ డైరెక్ష‌న్‌లో మ‌హేష్ బాబు మూడో సినిమా చేయ‌నున్నారు. అంత‌కు ముందు వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన 'అత‌డు', 'ఖ‌లేజా' బ్లాక్ బాస్ట‌ర్ హిట్స్ సాధించాయి.

'స‌ర్కారు వారి పాట' సినిమా త‌ర్వాత మ‌హేష్ బాబు న‌టించ‌బోయే 'ఎస్ఎస్ఎంబి 28' పై భారీ అంచానాలు ఏర్పాడ్డాయి. ఈ చిత్రాన్ని హారికా అండ్‌ హాసిని బ్యానర్ పై రూపొందిస్తున్నారు. నిర్మాతగా ఎస్‌.రాధాకృష్ణ(చినబాబు) వ్యవహరిస్తున్నారు. పూజా హెగ్దే (Pooja Hegde) హీరోయిన్‌గా నటిస్తోంది. మ‌హేష్ బాబు పుట్టిన రోజైన ఆగ‌స్టు 9 న‌ త్రివిక్ర‌మ్ 'SSMB28' సినిమా నుంచి అప్‌డేట్ ఇస్తార‌ని అభిమానులు ఎదురుచూస్తున్నారు. 

Read More:  ‘SSMB28’: మహేష్ బాబు-త్రివిక్రమ్ కాంబోలో మూవీ.. ఫస్ట్ లుక్ కోసం ముహూర్తం ఖరారు?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!