The Warrior: దూసుకొస్తున్న 'ది వారియర్' ట్రైలర్.. రామ్ (Ram Pothineni) మాస్ యాక్ష‌న్‌పైనే అంద‌రి అంచ‌నాలు!

Updated on Jun 28, 2022 08:13 PM IST
రామ్ (Ram Pothineni) న‌టిస్తున్న ది వారియ‌ర్  ట్రైల‌ర్ జూలై 1న విడుద‌ల చేయ‌నున‌ట్లు అధికారికంగా ప్ర‌క‌టించారు.
రామ్ (Ram Pothineni) న‌టిస్తున్న ది వారియ‌ర్ ట్రైల‌ర్ జూలై 1న విడుద‌ల చేయ‌నున‌ట్లు అధికారికంగా ప్ర‌క‌టించారు.

రామ్ (Ram Pothineni) హీరోగా న‌టిస్తున్న‌ ది వారియ‌ర్ ట్రైల‌ర్ రిలీజ్ తేదీని మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. ఈ సినిమా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెర‌కెక్కుతుంది. ఈ సినిమాకు లింగుసామి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. నిర్మాత‌ శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రామ్ పోలీస్ పాత్ర‌లో న‌టిస్తున్న మొద‌టి సినిమా ది వారియ‌ర్. ఈ సినిమా ట్రైల‌ర్ రిలీజ్ తేదీని మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. 

దూసుకొస్తున్న ది వారియ‌ర్ ట్రైల‌ర్
ది వారియ‌ర్ నుంచి రిలీజ్ అయిన బుల్లెట్ సాంగ్ రికార్డులు సృష్టిస్తోంది. ఈ పాట తెలుగు, త‌మిళ్ భాష‌ల్లో 12 మిలియ‌న్ల వ్యూస్‌కు పైగా దూసుకుపోతుంది. ఆ త‌ర్వాత రిలీజ్ అయిన విజిల్ పాట కూడా యూట్యూబ్‌లో కేక పుట్టిస్తుంది. దేవిశ్రీ ప్ర‌సాద్ ది వారియ‌ర్ చిత్రానికి సంగీతం స‌మ‌కూర్చారు.

రామ్ (Ram Pothineni) న‌టిస్తున్న ది వారియ‌ర్ సినిమా ట్రైల‌ర్ జూలై 1న విడుద‌ల చేయ‌నున‌ట్లు అధికారికంగా ప్ర‌క‌టించారు. జూలై 1 న రాత్రి  7:57 నిమిషాలకు ట్రైల‌ర్ రిలీజ్ చేస్తార‌ట‌. రామ్‌కు జోడిగా ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి న‌టిస్తున్నారు. ది వారియ‌ర్ చిత్రం జూలై 14న తెలుగు, త‌మిళ్ భాష‌ల్లో రిలీజ్ కానుంది. 

రామ్ (Ram Pothineni) న‌టిస్తున్న ది వారియ‌ర్  ట్రైల‌ర్ జూలై 1న విడుద‌ల చేయ‌నున‌ట్లు అధికారికంగా ప్ర‌క‌టించారు.

బెస్ట్ ద‌ర్శ‌కుడు అత‌నే - రామ్(Ram Pothineni)
ది వారియర్ సినిమాను తెరకెక్కించడంలో ద‌ర్శ‌కుడు లింగుసామి కీలక పాత్ర పోషించార‌ని రామ్ రీసెంట్‌గా ట్వీట్ చేశారు. డైరెక్టర్‌ లింగుసామి ఈ సినిమాకు సంబంధించిన ప్రతీ అంశాన్ని త‌న భుజాల‌పైన మోశార‌న్నారు. తాను ప‌నిచేసిన ఉత్త‌మ ద‌ర్శ‌కుల్లో లింగుసామి ఒక‌ర‌ని రామ్ తెలిపారు.

Read More: Ram Pothineni: 'ది వారియర్' నుంచి 'విజిల్ సాంగ్’ రిలీజ్.. దర్శకుడిని మర్చిపోయిన హీరో రామ్!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!