Ram Pothineni: 'ది వారియర్' నుంచి 'విజిల్ సాంగ్’ రిలీజ్.. దర్శకుడిని మర్చిపోయిన హీరో రామ్!

Published on Jun 24, 2022 01:27 PM IST

టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని తాజాగా నటిస్తున్న చిత్రం "ది వారియర్" (The Warrior). పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వ‌ర్ స్క్రీన్ పతాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం. 6గా శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ మూవీ చిత్రీకరణ పూర్తయింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో నదియా, అక్షరగౌడ, భారతీరాజా ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.

జులై 14న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ సరసన కృతిశెట్టి (Kriti Shetty) హీరోయిన్ గా నటిస్తోంది. 

"ది వారియర్" సినిమాలో హీరో రామ్ (Ram Pothineni) పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనించనున్నాడు. ఇక, ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన స్పెషల్ పోస్టర్స్, సాంగ్స్ ఈ మూవీపై మరిన్ని అంచనాలను పెంచేశాయి. సత్య ఐపీఎస్ పాత్రలో రామ్ పోతినేని, విజిల్ మహాలక్ష్మిగా కృతి శెట్టి.. ఇద్దరూ ఆకట్టుకోనున్నారు.

తెలుగు, తమిళ్ భాషలలో ఒకేసారి తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యింది. కాగా, ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ప్రచార కార్యక్రమాలను ముమ్మరంగా చేస్తున్న మేకర్స్, సినిమా నుండి లిరికల్ సాంగ్స్ ను ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తున్నారు. 

ఈ క్రమంలో బుధవారం ఈ మూవీ నుంచి మరో విజిల్ సాంగ్ (Whistle Song Released) రిలీజ్ చేసింది చిత్రయూనిట్. విజిల్ పాట విడుదల కోసం హైదరాబాద్ లో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ వేడుకలో చిత్రయూనిట్ పాల్గోని.. షూటింగ్ సమయంలో జరిగిన సంఘటనలను గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా రామ్ మాట్లాడుతూ.. విజిల్‌ సాంగ్‌ తనకెంతో నచ్చిందని, తమ చిత్రానికి ఇంతటి ఎనర్జిటిక్‌ మ్యూజిక్‌ అందించిన దేవిశ్రీ ప్రసాద్‌, సింగర్స్‌, నిర్మాతలు, ఇతర చిత్ర బృందానికి ధన్యవాదాలు చెబుతున్నానని అన్నారు. అలానే స్టేజ్ మీద కొద్ది సేపు మాట్లాడిన హీరో రామ్ తన స్పీచ్‌లో దర్శకుడు లింగుస్వామి గురించి ప్రస్తావించడం మర్చిపోయారు.

అనంతరం ఈ విషయాన్ని గ్రహించిన రామ్ ట్విట్టర్ వేదికగా ఈ సినిమా దర్శకుడికి క్షమాపణలు చెప్పారు. ఈ మూవీ తెరకెక్కడంలో ముఖ్య పాత్ర పోషించిన వ్యక్తి గురించి చెప్పడం మర్చిపోయాను.. నా వారియర్, డైరెక్టర్ లింగుస్వామి (Director Lingu Swamy)… ఈ సినిమాకు సంబంధించిన ప్రతి ఫ్రేమ్ ను మీరు మీ భుజాలపై ఎత్తుకున్నారు. ఇప్పటివరకు నేను చేసిన ఉత్తమ దర్శకులలో మీరు ఒకరిగా ఉన్నందుకు ధన్యవాదాలు.. సారీ అండ్ లవ్ యూ అంటూ రాసుకొచ్చారు. 

Read More: The Warrior: 20 మిలియన్ల వ్యూస్‌తో రికార్డు సృష్టించిన.. రామ్ పోతినేని సినిమా 'ది వారియర్' టీజర్ !