Krithi Shetty: మరోసారి నాగచైతన్యతో బేబమ్మ.. వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న కృతి శెట్టి!
ఉప్పెన సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది కృతి శెట్టి (Krithi Shetty). ఆ సినిమా సూపర్‌హిట్ సాధించడంతో వరుస ఆఫర్లు వస్తున్నాయి. ప్రస్తుతం రామ్ పోతినేనితో ‘ది వారియర్’, సుధీర్‌బాబుతో ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’, నితిన్‌తో ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమాల్లో నటిస్తోంది బేబమ్మ. శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది.
సినిమా ఇండస్ట్రీలో పైకి రావాలంటే టాలెంట్‌తో పాటు లక్ కూడా ఉండాలి. ఈ రెండూ కలిసొస్తే మాత్రం ఆ యాక్టర్‌కు స్టార్ ఇమేజ్ దక్కుతుంది. ప్రస్తుతం కృతి శెట్టి టైం నడుస్తోంది. ఇప్పటికే పలు క్రేజీ ప్రాజెక్టులలో నటిస్తున్న కృతి తాజాగా మరో బంపర్ ఆఫర్ కొట్టేసింది. నాగచైతన్య 22వ సినిమాలో హీరోయిన్‌గా సెలెక్ట్ అయ్యింది ఈ సొట్ట బుగ్గల సుందరి.
వెంకట్ ప్రభు డైరెక్షన్‌లో..
తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు డైరెక్షన్‌లో నాగచైతన్య హీరోగా ఓ సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్‌గా కృతి శెట్టిని ఎంపిక చేసినట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. పోలీస్ స్టేషన్‌లో ఉండే ఫైల్స్ తరహాలో కృతి పోస్టర్‌ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
కాగా, నాగచైతన్యతో బంగార్రాజు సినిమాలో కలిసి నటించింది కృతి శెట్టి. ప్రస్తుతం రామ్ పోతినేనితో కలిసి నటించిన ది వారియర్ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. ఈ సినిమాలో రామ్, కృతిలపై తెరకెక్కించిన బులెట్ పాట యూట్యూబ్‌లో పది కోట్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ఇప్పటికే మూడు క్రేజీ ప్రాజెక్టులలో ముగ్గురు యువ హీరోలతో నటిస్తున్న కృతి శెట్టి (Krithi Shetty).. నాలుగో సినిమాలో కూడా చాన్స్ కొట్టేసి బిజీ హీరోయిన్‌గా మారింది.
Read More : నాగ చైతన్య (Naga Chaitanya) వెంకట ప్రభు కాంబోలో కొత్త సినిమా .. సమంతకు కౌంటర్ ఇచ్చినట్టేనా !