ఆర్‌సీ 15 (RC 15) : సీఎం పాత్ర‌లో రామ్ చ‌ర‌ణ్ (Ram Charan)!.. హైద‌రాబాద్‌లో ఓట్లు లెక్కిస్తున్న శంక‌ర్!!

Updated on Jul 26, 2022 07:10 PM IST
RC 15: సికింద్రాబాదులోని 'విక్టోరియా మెమోరియల్ హాల్‌లో రామ్ చ‌ర‌ణ్ (Ram Charan) కొత్త  సినిమా ఆర్‌సీ 15 షూటింగ్ జ‌రుగుతోంది.
RC 15: సికింద్రాబాదులోని 'విక్టోరియా మెమోరియల్ హాల్‌లో రామ్ చ‌ర‌ణ్ (Ram Charan) కొత్త  సినిమా ఆర్‌సీ 15 షూటింగ్ జ‌రుగుతోంది.

RC 15: 'ఆచార్య ' ఫ్లాప్ త‌ర్వాత రామ్ చ‌ర‌ణ్ (Ram Charan) త‌మిళ స్టార్ ద‌ర్శ‌కుడు శంక‌ర్ తెర‌కెక్కిస్తున్న పాన్ ఇండియా సినిమా 'ఆర్‌సీ 15 ' చిత్రంలో న‌టిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చ‌ర‌ణ్ మూడు పాత్ర‌ల్లో వెండితెర‌పై క‌నిపిస్తార‌ని టాక్. సీఎం పాత్ర‌లో కూడా రామ్ చ‌ర‌ణ్ న‌టిస్తున్నారట‌. 'ఆర్‌సీ 15' షూటింగ్ హైద‌రాబాద్‌లో జ‌రుగుతుంది. ఎన్నిక‌ల్లో రామ్ చ‌ర‌ణ్‌కు వ‌చ్చిన ఓట్ల లెక్కింపు సీన్‌ను శంక‌ర్ చిత్రీక‌రిస్తున్నార‌ట‌.

కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్న ద‌ర్శ‌కుడు

సికింద్రాబాదులోని 'విక్టోరియా మెమోరియల్ హాల్‌'లో రామ్ చ‌ర‌ణ్ (Ram Charan) కొత్త  సినిమా 'ఆర్‌సీ 15' షూటింగ్ జ‌రుగుతోంది. ఓట్ల లెక్కింపు సీన్ల‌ను ద‌ర్శ‌కుడు శంక‌ర్ చిత్రీకరిస్తున్నారు. రామ్ చ‌ర‌ణ్ ముఖ్య‌మంత్రి కుమారుడిగా 'ఆర్‌సీ 15'లో క‌నిపించ‌నున్నారు. సీఎంగా కూడా రామ్ చ‌ర‌ణ్ న‌టిస్తున్నార‌ట‌.  రామ్, శంక‌ర్ కాంబోలో పొలిటికల్ డ్రామాగా ఈ సినిమా తెర‌కెక్కుతుంది.

 

RC 15: సికింద్రాబాదులోని 'విక్టోరియా మెమోరియల్ హాల్‌లో రామ్ చ‌ర‌ణ్ (Ram Charan) కొత్త  సినిమా ఆర్‌సీ 15 షూటింగ్ జ‌రుగుతోంది.

'ఆర్‌సీ 15'కు సంబంధించిన 8 వ షూటింగ్ షెడ్యూల్ జ‌రుగుతోంది. ఈ మూవీలో రామ్ చరణ్ (Ram Charan) మూడు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాలో రామ్ చ‌ర‌ణ్‌కు జోడిగా కియారా అద్వానీ న‌టిస్తున్నారు. వీరిద్ద‌రి కాంబోలో వ‌స్తున్న రెండో సినిమా ఇది. రామ్, కియారా 'విన‌య విధేయ రామ‌'లో హీరో హీరోయిన్లుగా నటించారు. ప్రకాశ్ రాజ్, శ్రీకాంత్, సునీల్, అంజలి ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.
 

RC 15: సికింద్రాబాదులోని 'విక్టోరియా మెమోరియల్ హాల్‌లో రామ్ చ‌ర‌ణ్ (Ram Charan) కొత్త  సినిమా ఆర్‌సీ 15 షూటింగ్ జ‌రుగుతోంది.

దిల్ రాజ్ 50వ సినిమా

'ఆర్‌సీ 15 'లో రామ్ మూడు గెట‌ప్పుల కోసం మ‌రింత క‌ష్ట‌ప‌డుతున్నారు. ఒక్కో పాత్ర‌లో ఒక్కోలా క‌నిపించ‌నున్నారు. ట్రైనింగ్ నిపుణుడు రాకేష్ ఉడియార్ శిక్షణలో రామ్ క‌స‌ర‌త్తులు మొద‌లుపెట్టారు. రామ్ చరణ్ వర్క్ ఔట్స్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న 50వ చిత్రంగా 'ఆర్‌సీ 15' తెర‌కెక్కుతుంది. ఈ చిత్రానికి త‌మ‌న్ సంగీతాన్ని అందిస్తున్నారు.

Read More: ఆర్‌సీ 15 (RC15) కోసం రామ్ చ‌రణ్ (Ram Charan) ఇంత క‌ష్టప‌డుతున్నారా!!!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!